Udaya Bhaskar
-
ఫార్మా ఎగుమతులు 4 శాతం అప్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఫార్మా ఎగుమతులు 4.22 శాతం వృద్ధి చెంది 14.57 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 13.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇవి 27 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 24.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, అక్టోబర్ ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో సానుకూలంగానే ఉన్నాయని, ఇదే ధోరణి పూర్తి ఆర్థిక సంవత్సరంలోను కొనసాగవచ్చని భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఫార్మా ఎగుమతులు 5.45 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు కొన్ని కీలక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం కూడా ఎగుమతుల తగ్గుదలకు కారణమైనట్లు భాస్కర్ చెప్పారు. ‘ఉదాహరణకు భారత ఫార్మాకు టాప్ 5 మార్కెట్లలో నైజీరియా కూడా ఒకటి. అమెరికా డాలర్‌తో పోలిస్తే నైజీరియా నైరా క్షీణత కొనసాగుతుండటంతో ఆ దేశం దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తోంది‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలు టాప్ మార్కెట్లుగా ఉంటున్నాయి. -
సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి
సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసిన నాయకులకు వైఎస్సార్ సీపీలో సముచిత స్థానం లభిస్తుందనేది మరోసారి రుజువైంది. పార్టీకి అనంతబాబు చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత స్థానం కల్పిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సందర్భాల్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ అధిష్టానం రంపచోడవరం నేత అనంత సత్య ఉదయభాస్కర్(అనంత బాబు)ను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనమే కానుంది. మున్సిపల్, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఇటీవల వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. ఈ క్రమంలో అనంతబాబు గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ‘ఓదార్పు’ నుంచీ జగన్ వెంటే.. దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడు అనంతబాబు. ఓదార్పు యాత్ర నుంచి ఇప్పటి వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలిచారు. అధికారంలో ఉండగా తమ పార్టీలో చేరాలని టీడీపీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ కేసులు పెట్టి వేధించినా తల వంచలేదు. తొమ్మిది రోజులు విశాఖ సెంట్రల్ జైలులో ఉంచినా పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఆయన చెమటోడ్చి 2014లో వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రలోభాలకు లొంగిన ఆమె పార్టీ ఫిరాయించారు. స్వయానా మేనమామలైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు సైతం వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించినా అనంతబాబు నమ్మిన జెండా వీడలేదు. రంపచోడవరం నియోజకవర్గంలో జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేశారు. అప్పటి నుండి జగన్ వెంట నడుస్తూ పార్టీని ఒంటి చేత్తో విజయపథాన నడిపిస్తూ మంచి గుర్తింపు పొందారు. చదవండి: (అన్నిటా అగ్రతాంబూలం.. రెండు ఎమ్మెల్సీ పదవులూ వారికే..) రాజకీయ కుటుంబ నేపథ్యం అనంత బాబు తాత వీర్రాజు, ముత్తాత పడాల వీర్రాజు పలు పర్యాయాలు అడ్డతీగల సమితి అధ్యక్షులుగా పని చేశారు. తండ్రి అనంత చక్రరావు 1982లో అడ్డతీగల సమితి ప్రెసిడెంట్, 1987లో అడ్డతీగల ఎంపీపీగా పని చేశారు. వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనంత బాబు ఏజెన్సీలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న ఏజెన్సీలో తనదైన రాజకీయ వ్యూహంతో వైఎస్సార్ సీపీకి బలమైన బాటలు వేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పక్షాన నాగులపల్లి ధనలక్ష్మి సాధించిన 38 వేల ఓట్ల భారీ మెజారి అప్పట్లో ఒక రికార్డు. 2014, 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవశం చేసుకోవడంలో అనంతబాబు విశేష కృషి చేశారు. 2001లో అడ్డతీగల జెడ్పీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2019లో డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ హయాంలో డీసీసీబీ పరిధిలోని పలు ప్రాథమిక సహకార సంఘాలు, బ్రాంచిల్లో జరిగిన అవినీతి బాగోతాలపై ఉక్కు పాదం మోపారు. -
విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారు
సాక్షి, అమరావతి: తన అధికార విధులను నిర్వర్తించకుండా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి, అదనపు కార్యదర్శి అడ్డుకుంటున్నారని కమిషన్ చైర్మన్ పి.ఉదయ భాస్కర్ హైకోర్టుకు నివేదించారు. అటెండర్, పేషీ సిబ్బందిని పొందే హక్కు తనకు ఉన్నప్పటికీ.. దానిని హరించారని పేర్కొన్నారు. చైర్మన్‌గా తన విధుల్లో జోక్యం చేసుకోవద్దని కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నాటినుంచీ తన ఆమోదం లేకుండా కమిషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2020 జనవరి నుంచి తనను ఏ అధికారిక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. 2020 ఫిబ్రవరి 25న జరిగిన సమావేశంలో నిబంధనలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాలేవీ చట్ట ప్రకారం చెల్లుబాటు కావన్నారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గత నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనతో పలువురు అభ్యర్థులు గత నెలలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న సర్వీస్ కమిషన్ కార్యదర్శి, చైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కమిషన్ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ పైవివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. -
జీవో 5 ప్రకారమే ఏపీపీఎస్సీ ఎంపికలు
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను జీవో 5 ప్రకారమే చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. దీని ప్రకారం ఆయా పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్‌కు ముందుగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. అనంతరం 1:12, లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లలో జీవో 5ను ప్రస్తావిస్తూ.. దాని ప్రకారమే ఎంపికలుంటాయని పొందుపరిచినందున ఆ దిశగానే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. తాజాగా కమిషన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేస్తోంది. సీఎస్‌తో ఏపీపీఎస్సీ చైర్మన్ భేటీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 (అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున) నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కొంతకాలంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి కూడా పలుమార్లు వినతిపత్రాలిచ్చారు. ఏపీపీఎస్సీ ఈ అంశంపై ఏమీ తేల్చకపోవడంతో గ్రూప్–3, గ్రూప్–2, గ్రూప్–1 పోస్టులకు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. మెయిన్స్‌కు 1:12, లేదా 1:15 ప్రకారం కాకుండా.. 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేస్తారన్న ఆశతో నిరుద్యోగులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని కొత్తగా జీవో ఇస్తే ఆ ప్రకారమే చేస్తామని ఏపీపీఎస్సీ కొంతకాలంగా చెబుతుండటంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి ఇదివరకే దీనిపై మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపికల తీరుపై ప్రభుత్వం ఏపీపీఎస్సీని వివరాలడగడంతో.. ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గ్రూప్ పరీక్షల ఫలితాల వెల్లడిలో ఏర్పడిన ప్రతిష్టంభనపై ప్రభుత్వానికి వివరించారు. 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపికచేయడం వల్ల అభ్యర్థుల సంఖ్య వేలాదిగా పెరిగి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొన్నారు. గతంలో 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. ఆ తర్వాత పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ విధానాన్ని అనుసరించి 1:12, లేదా 1:15 నిష్పత్తిని పాటిస్తామని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. దాని ఆధారంగా ప్రభుత్వం జీవో 5 ద్వారా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏపీపీఎస్సీకి ఇచ్చినట్టు చెప్పారు. ఈ జీవో ద్వారా గ్రూప్ నోటిఫికేషన్లలో ఎంపికలుంటాయని పేర్కొన్నామని, దీన్ని మార్పు చేస్తే న్యాయపరంగా ఇబ్బందులొచ్చే ప్రమాదముందని చెప్పినట్టు తెలిసింది. నోటిఫికేషన్లలో జీవోను ప్రస్తావించినందున ఆ ప్రకారమే ముందుకెళ్తామని పేర్కొనడంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అందుకు సమ్మతించినట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్–3, గ్రూప్–2, గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ముందుగా కటాఫ్ నిర్ణయించాక నిర్ణీత నిష్పత్తిలో ఆయా కేటగిరీలవారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని భేటీ అనంతరం ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్న విషయాన్ని గుర్తుచేయగా.. అందుకు అవకాశం లేదన్నారు. జీవో 5ను రద్దుచేసి 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని ప్రభుత్వం కొత్తగా జీవో ఇస్తే.. రానున్న నోటిఫికేషన్లలో అమలు చేస్తామని వివరించారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై తేలితే మరో 9 నోటిఫికేషన్లు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి పదిశాతం కోటా అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్ట ఉత్తర్వులొస్తే.. పెండింగ్‌లో ఉన్న 9 నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చైర్మన్ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ అంశాన్ని ప్రస్తావించామని, త్వరలోనే ఉత్తర్వులిస్తామన్నారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హారిజాంటల్ (సమాంతరం)గా అమలు చేయడంపై కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. కమిషన్‌లో భర్తీచేయాల్సిన పోస్టులపై కూడా ప్రధాన కార్యదర్శికి వివరించినట్టు చెప్పారు. దాదాపు 200 మంది సిబ్బంది ఉండేలా కమిషన్‌లో పోస్టులు భర్తీ కావాల్సి ఉందని.. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 57కుగాను ఇద్దరే ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏపీపీఎస్సీ బడ్జెట్‌ను రూ.90 కోట్లు చేయాలని కోరినట్టు ఉదయభాస్కర్ వివరించారు. -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉదయ భాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్(ఏపీపీఎస్సీ) గా డాక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపీఎస్సీ సిలబస్ మార్పుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ కోసం క్యాలెండర్ ను రూపొందిస్తామన్నారు. వసతులున్న భవనం దొరికితే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఉదయభాస్కర్ చెప్పారు. కాగా గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్‌గా పని చేశారు. అదే విధంగా కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్‌గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయభాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ భాస్కర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూలో ( డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్) ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'బీసీలను బాబు కరివేపాకులా వాడుకుంటున్నారు'
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు బీసీల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి. ఉదయ్‌కుమార్ గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బీసీలను చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను ఎన్నికల మందు తెలంగాణ సీఎం చేస్తానని చెప్పి... ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతగా కూడా చేయలేదని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘాన్ని టీడీపీకీ ఆర్ కృష్ణయ్య తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు.