Uddanam Kidney patients
-
ఆరోగ్య ఉద్యానం.. వైఎస్సార్ సుజలధారను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధుల బాధితులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పలాసలో కొత్తగా నెలకొల్పిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురంలో సీఎం జగన్ గురువారం తొలుత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం రూ.85 కోట్లతో పలాసలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ బాలుర వసతి గృహాన్ని వరŠుచ్యవల్గా ఆరంభించారు. నూతన పారిశ్రామికవాడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలాస రైల్వే గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నేను విన్నాను.. నేను చేశాను 2018 డిసెంబర్ 30న ఇదే పలాసలో పాదయాత్రలో మాటిచ్చా. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు చెప్పా. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడే 200 పడకలతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తెస్తామని చెప్పా. 2019 సెప్టెంబర్‌లో రూ.85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిని మంజూరు చేశాం. పనులకు శంకుస్థాపన చేసి ఎక్కడా ఆలస్యం లేకుండా పూర్తి చేశాం. ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచి నీటిని తెచ్చేందుకు హిర మండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్లు వేసి ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2020 సెప్టెంబర్‌లో సుజలధార పథకం మంజూరు చేశాం. ఈ రెండు పథకాలు ఈ రోజు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ మీ బిడ్డ మీ కళ్ల ఎదుట నిలబడ్డాడు. ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇక్కడి కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి పని చేస్తుంది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి క్రితం హెల్త్ సెక్రటరీ కృష్ణబాబుతో మాట్లాడా. ఈ ఫిబ్రవరిలోనే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి చికిత్స) కూడా చేసి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తోందో రాష్ట్రానికి, దేశానికి చూపించాలని చెప్పా. కచ్చితంగా ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం ఆస్పత్రిలో క్యాజువాలిటీ బ్లాక్, సెంట్రల్ ల్యాబ్ ఉంది. రేడియో డయోగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ డయాలసిస్, యూరాలజీ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి సదుపాయాలన్నీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికో పరుగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ రోజు పలాసలో ఉంది. ఇదే కిడ్నీ ఆస్పత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 375 మంది సేవలందించేందుకు ఈ రోజుమీ అందరికీ అందుబాటులో ఉన్నారు. 7 మండలాల్లో స్క్రీనింగ్ ఉద్దానం ప్రాంతంలో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే వెంటనే మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందించగలుగుతామనే తపన, తాపత్రయంతో కిడ్నీ ప్రభావిత మండలాల్లో స్క్రీనింగ్ కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, వజ్రపుకొత్తూరు, పలాసలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తున్నాం. 25 ఏళ్లు పైబడిన వారిలో 2,32,898 మందిని స్క్రీనింగ్ చేయగా 19,532 మందికి సాధారణం కంటే సీరం క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఉద్దానంలో 10 పీహెచ్‌సీలు, 5 అర్బన్ పీహెచ్‌సీలు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సెమీ ఆటో ఎనలైజర్లు అందుబాటులోకి తెచ్చాం. ఉచితంగా 37 రకాల మందులు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను అన్ని పీహెచ్సీలలో అందుబాటులోకి తెచ్చాం. వీటిని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నాం. ఈ మందులన్నీ ప్రతి పేదవాడికీ గడప ముంగిటికే ఉచితంగా ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే కవిటి, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 69 డయాలసిస్ యంత్రాలను విస్తరించాం. బారువ, ఇచ్ఛాపురం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పీహెచ్సీలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రోగులకు రూ.10 వేల పెన్షన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 మాత్రమే ఉన్న పెన్షన్‌ను మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా రూ.10 వేలకు పెంచాడు. నాన్ డయాలసిస్ పేషెంట్లు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో సీకేడీ డిసీజ్‌తో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి వారికి రూ.5 వేల పింఛన్ ఇచ్చేలా చేసింది మనందరి ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటున్న వారు, పింఛన్లు పొందుతున్న వారు కేవలం 3,076 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ఖర్చు చేసింది అప్పట్లో కేవలం నెలకు రూ.76 లక్షలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 13,140 పింఛన్లు పెంచాం. నెలా నెలా ఇందుకు ఖర్చవుతున్న సొమ్ము రూ.12.54 కోట్లు. ఇలా 55 నెలలుగా ప్రతీ నెలా ఖర్చు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం దిశగా.. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టింది. నాలుగు దశల అధ్యయనంలో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. ప్రపంచంలో అత్యుత్తమ వైద్యసంస్థగా పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో పాటు నార్త్ కరోలినా యూనివర్సిటీతో కలసి పనిచేసేలా మనందరి ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటోంది. ఈ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక నోడల్ సెంటర్‌గా వ్యవహరించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇలాంటి సమస్య ఉందని గుర్తించడంతో తాగునీటికి ఉపరితల జలాలను అందించేందుకు వెలుగొండ టన్నెళ్లను పరుగెత్తించాం. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, కిడ్నీ సేవల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేశాం. చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం ఉద్దానంలో ఒక్క కిడ్నీ ఆస్పత్రితోనే సరిపుచ్చకుండా సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎవరి ఊహకూ అందని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి మరీ హిరమండలం నుంచి పైపుల ద్వారా నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసేలా అడుగులు వేశాం. ఇదీ మీపట్ల మీ జగన్‌కు ఉన్న కమిట్మెంట్. ఈ కమిట్మెంటే గత పాలకులకు, మనకు మధ్య తేడాను తెలియచేస్తుంది. మొత్తం 807 గ్రామాలకుగానూ ఈ నెలాఖరుకల్లా ప్రతి గ్రామం పూర్తిగా కనెక్ట్ అవుతుంది. 1.98 లక్షల కుటుంబాలు, 6.78 లక్షల జనాభాకు సురక్షిత తాగునీటిని అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైంది. ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతున్నాం. రూ.265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గంలో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా మేలు చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. దీనికి టెండర్లు, అగ్రిమెంట్లు, సర్వే పూర్తైంది. సంక్రాంతి తర్వాత ఆ పనులు మొదలుపెడతారు. -
శ్రీకాకుళం : ఉద్దానంలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
Uddanam Hospital: పలాసలోని ఉద్దానం ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (ఫొటోలు)
-
ఉద్దానానికి ఊపిరి.. రూ.700 కోట్లతో మంచి నీటి పథకం..
ఇన్నాళ్లూ నిరాశ, నిస్పృహలకు లోనైన ఉద్దానం ప్రాంతంలో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. పురాణాల్లో చెప్పినట్లు.. గంగను ఆకాశం నుంచి భూమి మీదకు తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన యత్నాలను తలపిస్తూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడో వంద కిలోమీటర్ల దూరాన ఉండే హిరమండలం రిజర్వాయర్ నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన పనులు చూసిన ఈ ప్రాంత వాసుల్లో మనకూ మంచి రోజులు వస్తున్నాయన్న ధీమా మొదలైంది. మరోవైపు.. కిడ్నీ బాధితులకు చేరువలోనే వైద్య సేవలు అందించడానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో కొండంత భరోసా కలుగుతోంది. వెరసి కిడ్నీ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతోందనే నమ్మకం, ధైర్యం, సంతోషం కనిపిస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మహమ్మారి పీడ అతి త్వరలో విరగడవుతోంది. ఉద్దానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైంది. ఉద్దానం ప్రాంతం నుంచి మేడికొండ కోటిరెడ్డి, వడ్డే బాలశేఖర్: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడి అల్లాడుతుంటే గత ప్రభుత్వాలు మాటలతో మభ్యపెడితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన అడుగులు ఫలితాలివ్వడానికి సిద్ధమయ్యాయి. నాలుగు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభోత్సవ దశకు చేరింది. హిరమండలం నుంచి తాగునీటిని తరలించే ప్రక్రియలో ఉపయోగించే నీటి మోటార్లకు మూడు, నాలుగు రోజుల్లో ట్రయల్ రన్ మొదలవ్వనుంది. ఉద్దానం నుంచి వంద కిలోమీటర్లకు పైగా దూరం ఉండే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి రెండు సబ్ సేషన్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇందులో హిరమండలం వద్ద ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌కు గత (మే) నెల 24వ తేదీనే విద్యుత్ సరఫరా ప్రక్రియ పూర్తయింది. హీరమండలం రిజర్వాయర్ నీటిని అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉండే మెళియపుట్టి మండల కేంద్రం వద్దకు తరలించి.. శుద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫిల్టర్ బెడ్ల కేంద్రం సిద్ధమైంది. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన అనంతరం ఆయా ప్రాంతాలకు తరలించడానికి మరో సబ్ స్టేషన్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. దానికి ఈ నెల 15 నాటికి విద్యుత్ సరఫరా పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఉద్దానం ప్రాంతానికి తాగునీటి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యం ఉద్దానం ప్రాంతంలో అక్కడి భూగర్భ జలాలనే తాగునీటిగా ఉపయోగించడం వల్ల కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయనే వాదన ఉంది. ప్రజల్లో కూడా ఇదే విషయమై ఆందోళన ఉంది. అయితే ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో కొన్ని మంచినీటి పథకాలు ఉన్నా.. అవి ఎక్కువగా స్థానికంగా బోర్లు వేసి సరఫరా చేసేవే. మరోవైపు.. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా, వేసవిలో ఆ నదులు ఎండిపోతే ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కన పెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా సరే వెనుకాడకుండా హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఉద్దానం ప్రాంతానికి ఏడాది పొడవునా టీఎంసీ కన్నా తక్కువ నీరే అవసరం ఉంటుంది. హిరమండలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 2.67 టీఎంసీలుండటం వల్ల ఉద్దానం ప్రాంతానికి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జగన్ ప్రభుత్వ ‘భగీరథ’ యత్నం హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి నీటి తరలింపు అషామాషీ కాకపోయినా ప్రభుత్వం పట్టుదలగా పనులు చేపట్టి పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో ఏకంగా 1,047 కిలోమీటర్ల పొడవునా భూగర్భ పైపులైన్ల నిర్మాణం చేశారు. రోజూ 8.40 కోట్ల లీటర్ల మేర తాగునీరు ఆ భూగర్భ పైపు లైను ద్వారా వెళ్లేలా పనులు చేపట్టారు. కేవలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు భారీ మోటార్లు ఒక్కొక్కటి నిమిషానికి 28 వేలకు పైగా లీటర్ల నీటిని పంపింగ్ చేయగలవు. ఈ నీరు ఎగుడు దిగుడు కొండలు, మైదాన ప్రాంతాలు దాటుకుంటూ.. మధ్యలో మరే మోటార్ల అవసరం లేకుండా 32 కి.మీ. దూరంలోని మెళియాపుట్టి శుద్ధి కేంద్రానికి చేరతాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి మూడో మోటార్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. నీటి తరలింపు మార్గంలో వంశధార నది ఉండటంతో నదీ గర్భంలో దాదాపు అర కిలోమీటర్ మేర పైపు లైన్ నిర్మాణం చేశారు. కొన్ని చోట్ల కొండలను తొలిచి పైప్‌లైన్ వేశారు. ఒక్కసారిగా 73 మీటర్ల ఎత్తుకు.. ఆపై 50 మీటర్లు దిగువకు.. మళ్లీ 147 మీటర్ల ఎత్తున ఉండే కొండపైకి.. మళ్లీ దిగువకు ఇలా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. మరోమాటలో చెప్పాలంటే భగీరథ యత్నమే చేశారు. ఈ ప్రాజెక్టు త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. కరోనా లేకుంటే ఇప్పటికే అందుబాటులోకి.. ఉద్దానం ప్రాంతంలో కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని గ్రామాల పరిధిలో కిడ్నీ సమస్య ఉంది. ఈ మండలాల్లో 7,82,707 మంది జనాభా నివసిస్తుంటారు. 1980 దశకం నుంచి ఉద్దానం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంత వరకు స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ.. ఆ ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాలకు అక్కడి భూగర్భ జలాలు వినియోగించడం ఒక కారణం కావొచ్చనే నిపుణుల అనుమానాల మేరకే జగన్ ప్రభుత్వం నివారణ చర్యలు మొదలుపెట్టింది. పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు 807 నివాసిత గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరాకు ఉద్దేశించి ఈ మంచినీటి పథకానికి సీఎం జగన్ 2019 సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలను పరిగణనలో ఉంచుకుని 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో పౌరులు ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున ఏడాది పొడవునా ఈ పథకం ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని డిజైన్ చేసింది. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 170 నివాసిత ప్రాంతాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా తాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాతి సంవత్సరంలోనే కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపు, మరుసటి ఏడాది కూడా రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. ఈ ప్రభావం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపైనా పడింది. ఈ సమస్య లేకుంటే ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండేది. బాబు, పవన్.. మాటలతోనే సరి గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దానం సమస్య పరిష్కారం పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పాలి. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక తొలి మూడేళ్లు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక్క చర్యా చేపట్టలేదు. చివరి ఏడాది 2018లో కేంద్ర పరిశోధన సంస్థ ఐసీఎంఆర్, జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థలతో ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయి అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. అదీ ప్రకటనకే పరిమితమైంది. మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ 2018 మే లో ఒకట్రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో దీక్షలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబుతో సమావేశమై ఆ సమస్యను వదిలేశారు. కిడ్నీ రోగులకు వరం వాటర్ గ్రిడ్ ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి 20 వేల మంది అన్ని రకాల కిడ్నీ రోగులకు వాటర్ గ్రిడ్ వరంగా మారబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, రూ.700 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు 232 గ్రామాలకు ట్యాంకులు ఏర్పాటు చేసి, ఇంటింటికీ కుళాయిల ద్వారా నదీ జలాలు అందించనున్నారు. ఇదే జరిగితే భూగర్భంలో ఉన్నటువంటి సిలికాన్ కారణంగా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయనే అనుమానాలు సైతం తొలగిపోతాయి. ఈ పథకం ప్రారంభం కావడం ద్వారా సీఎం వైఎస్ జగన్ మరింత మంది ప్రజల గుండెల్లో నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహంలేదు. – రాపాక చిన్నారావు, గొల్లమాకన్నపల్లి, పలాస మండలం మహిళలకు పాట్లు తప్పుతాయి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు పలాస నియోజకవర్గంలో అనేక గ్రామాలకు తాగునీటి సమస్య ఉంది. వాటర్ గ్రిడ్ ప్రారంభం అయితే మహిళలకు పాట్లు తప్పుతాయి. ఇంటికి కావాల్సిన తాగునీరుతో పాటు అదనంగా ఇచ్చే నీరు వాడుకలకు సరిపోతుంది. ప్రస్తుతం మున్సిపల్ ట్యాంకర్, పంట పొలాలు, బావులపై ఆధారపడి జీవిస్తున్న వారే అధికం. ఎప్పుడు పథకం ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజులు వచ్చాయి. వంశధార నది నుంచి వచ్చే తాగునీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పల్లెల్లో తాగునీటి కోసం అనేక కొట్లాటలు, గొడవలు జరుగుతున్నాయి. రూ.20 ఇచ్చి క్యాన్ కొనుగోలు చేయాలంటే అందరికీ కుదరదు. సీఎం జగన్ చర్యల వల్ల ఈ కష్టాలన్నీ తప్పుతాయి. – దున్న నిర్మల, మొగిలిపాడు, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ -
ఉద్దానం కిడ్నీ బాధితులకు తీపి కబురు
కవిటి: ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ప్రభు త్వం ఓ తీపి కబురు అందించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణ యం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది. జిల్లాలోని 38 మండలాల పరిధిలో 2856 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల జిల్లాలోని ఆ రు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డయాలసిస్ రోగులకు ఉచిత ప్రయాణసేవలు అందనున్నాయి. వీటితో పాటు సీరం క్రియేటినైన్ పరిమితికి మించి ఉండి కిడ్నీవ్యాధి ముప్పు అధికంగా ఉన్నవా రుకూడా నిపుణులైన వైద్యుల సాయం తీసుకునేందుకు విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలకు ఆరీ్టసీల్లో ఉచిత ప్రయాణానికి వీలు కలుగుతుంది. కిడ్నీ బాధితులకు సాయం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు నెల కు రూ.10,000 పెన్షన్ అందించడం బాధిత కు టుంబాలకు అత్యంత సంతోషానిచ్చింది. అనంతర కాలంలో సీరం క్రియేటినైన్ 5 కు మించి ఉ న్న బాధితులకు కూడా నెలకు రూ.5000 పెన్షన్, నికంగా డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచి త అంబులెన్స్ సేవలతో పాటు తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానికులు వేనోళ్ల కీర్తిస్తున్నారు. సీఎం జగన్ ఆపద్బాంధవుడు వైఎస్ జగన్ మా వద్దకు వచ్చి కష్టాలు తెలుసుకున్నా రు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు మాకు చెప్పినవన్నీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో పడుతున్న కష్టాలను తొలగించేలా కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఊరట నిచ్చేవిధంగా ఆదుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా పాస్‌లు అందించే నిర్ణయం సంతోషం కలిగిస్తోంది. – నర్తు తరిణమ్మ, కొండిపుట్టుగ, కిడ్నీ బాధితురాలు, కవిటి మండలం ఆదేశాలు అందిన వెంటనే చర్యలు కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా శాఖాపరమైన ఆదేశాలు వచ్చిన వెంటనే నిబంధనల మేరకు బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం. – అంధవరపు అప్పలరాజు, రీజనల్ మేనేజర్, శ్రీకాకుళం. -
కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఆసుపత్రి
-
కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్ధానం సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం సిబ్బందిని నియమించనుంది. వైద్యుడు, సిబ్బందిని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్రాతిపదికన 5 పోస్టులు, కాంట్రాక్ బేసిస్ కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద60 పోస్టులను మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముందే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా రూ.10 వేలు కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచే కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో పర్యటించారు. కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఉద్దాన సమస్యపై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారని ప్రశంసిస్తున్నారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఒకరు పోతేగానీ మరొకరికి సేవలుండవు..!
ఒకరు బతకాలంటే మరొకరు కన్నుమూయాలా..? ఒకరి ఊపిరి నిలపాలంటే మరొకరి ఉసురు ఆగిపోవాలా..? జిల్లాలోని కిడ్నీవ్యాధిగ్రస్తులు ఇలా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి స్థానం ఖాళీ అయితే గానీ మరొకరికి డయాలసిస్ అందని కఠిన స్థితిలో ఉన్నారు. చాలా మంది ఇక్కడ కొన ఊపిరితో డయాలసిస్ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమాణాలు చేయడం, ప్రకటనలు ఇవ్వడం తప్ప సేవలు మర్చిపోయిన సర్కారు తీరుతో వీరు విసిగిపోయారు. జనం ప్రాణాలు కాపాడలేని అసమర్థ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గ : ఇటీవల పలాస మండలంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన ఒక కిడ్నీవ్యాధిగ్రస్తుడు మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న సుమారు ఆరుగురు రోగులు ఆస్పత్రి వారిని సంప్రదించారు. తాము విశాఖ, శ్రీకాకుళం వెళ్లలేమని, పలాసలో డయాలసిస్ అయ్యేలా అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా డయాలసిస్ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకా వందలాదిగా ఉన్నారు. ఉద్దానం కిడ్నీవ్యాధిగ్రస్తులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కిడ్నీవ్యాధి సోకిన వారిలో అధికంగా డయాలసిస్ చివరి దశలో ఉన్న వారు ఇక బతుకుపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ వీరి వెనుక డయాలసిస్ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం అంతకంటే నరకం అనుభవిస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒకరు చనిపోతే గానీ తమకు సేవలు అందని దౌర్భాగ్య పరిస్థితిని తలచుకుని కుమిలిపోతున్నారు. ప్రభుత్వం కపట ప్రేమ రెండున్నర దశాబ్దాలుగా ఉద్దానం, తీర ప్రాంతాల ప్రజలను వణికిస్తున్న కిడ్నీ భూతంతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికీ వీరి కోసం ప్రభుత్వం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపలేదు. జిల్లాలో 7 ఉద్దాన తీర ప్రాంతంలో సుమారు 20 వేల మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే వారిలో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 80 మంది రోగులు మాత్రమే డయాలసిస్ చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో ఊహించుకోవచ్చు. కొందరికే అవకాశం.. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాల్లో సదుపాయాలు లేక, ఉచిత మందులు అందక, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలాస డయాలసిస్ కేంద్రంలో కేవలం డయాలసిస్ మిషన్లు (హెచ్డి) 9 ఉండగా వీటిలో 7 పాజిటివ్, 2 నెగిటివ్ మిషన్లు ఉన్నాయి. దీనిలో 80 మంది రోగులకు రోజుకు 3 షిఫ్ట్‌లలో 27 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మరో ఇద్దరు రావాల్సి ఉంది. మిగిలిన రోగులు డయాలసిస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుదూర ప్రాంతాల్లో గల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రకటనలకే పరిమితమా..? జిల్లాకు వచ్చిన ప్రతిసారీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అది చేస్తాం. ఇది చేస్తాం అని గొప్పలు చెబుతున్న ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలం అవుతున్నారు. రోగులకు ఉచిత మందులు అందిస్తానని, డయాలసిస్ కేంద్రాలను పెంచుతానని, వారికి పింఛన్లు అందిస్తానని అనేక హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం నెఫ్రాలజిస్టు నియామకం చేపట్టకపోవడంతో డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాల పరిధిలో 20వేలమందికిపైగా అన్నిరకాల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, ఇచ్ఛాపురం, సొంపేట, కంచిలితో మొత్తం ఏడు మండలాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో డయాలసిస్ కేంద్రాల్లో పాలకొండలో 50 మంది రోగులు, శ్రీకాకుళం రిమ్స్‌లో 125 మంది, టెక్కలి 72 మంది, పలాసలో 80మంది, సొంపేటలో 100 మంది, కవిటి, 50 మంది రోగులు డయాలసిస్ పొందుతున్నారు. ప్రతి సెంటర్ వద్ద సుమారు ఐదు నుంచి పదికిపైగా కిడ్నీ రోగులు వెయిటింగ్లో ఉన్నారు. ఇందులో ఎవరైనా చనిపోతే మిగిలిన వెయింట్‌లో ఉన్నవారికి అవకాశం కలుగుతుంది. పలాసలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు తిత్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి కీడ్నీ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలాల పరిధి అక్కుపల్లిలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో అధికంగా కిడ్నీరోగులు గుణుపల్లి, బాతుపురం, బైపల్లి, యుఆర్కే పురం, అక్కుపల్లి గ్రామాల ప్రజలు అక్కుపల్లిలో ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతవరకు జరగలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన పింఛన్లు కేవలం 225 మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలిన వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పలాసలో నామమాత్రపు సేవలు పలాస సామాజిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో అరకొర సేవలు అందుతున్నాయి. నాలుగు షిఫ్టులలో జరుగుతున్న డయాలసిస్ సేవలు కొందరికే పరిమితమయ్యాయి. 8 మంచాలపై జరుగుతున్న డయాలసిస్ కోసం మూడు షిఫ్టుల్లో రోజుకు 24 మందికి మాత్రమే జరుగుతుంది. పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉద్దాన కిడ్నీ రోగులు 700 మందికిపైగా డయాలసిస్ జరుపుకుంటున్నారు. అత్యవసరమైన వారు విశాఖ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు పెడుతున్నారు. మా సొంతగ్రామం గొల్లమాకన్నపల్లిలో ఇప్పటివరకు 50 మందికిపైగా చనిపోయారు. ఇంకా చాలామంది రోగులకు సేవలు అందడంలేదు. – రాపాక అప్పలస్వామి, కిడ్నీ రోగి, గొల్ల మాకన్నపల్లి, పలాస మండలం అత్యవసర పరిస్థితి ప్రకటించాలి.. ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీరోగుల మరణాలను నమోదు చేసి తక్షణమే అత్యవస మెడికల్ ప్రకటించి అందరిని ఆదుకోవాలి. ఉచిత మందులు, డయాలసిస్ పూర్తి సేవలు, రవాణా ఖర్చులు అందించాలి. ఆర్టీసీ బస్సుపాసులు ఇస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలకు ఆర్టీసీ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – పత్తిరి దశరథ,కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తోంది గానీ పనులు చేయడం లేదు. చివరి దశలో మరణానికి సిద్ధంగా ఉన్నవారికి పింఛన్లు ప్రకటించారు. మేమంతా వారి తరఫున అడుగుతున్నాం. సీరం క్రియాటిన్ తగ్గుదల ప్రారంభం నుంచి పింఛన్ అందిస్తే కాస్త అయినా మేలు జరుగుతుంది. ప్రస్తుతం సౌకర్యాలు లేకుండా డయాలసిస్ నడుపుతున్నారు. ప్రత్యేకమైన గ్రూపుల వారు విశాఖ వెళ్లాల్సి వస్తోంది. ఇకనైనా వారిపై శ్రద్ధ చూపాలి. – సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ సీపీ పలాస ఎమ్మెల్యే అభ్యర్థి -
‘కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తాం’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకోని.. వారిలో భరోసా నింపడానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంక్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం జననేత పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ వైఎస్ జగన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ముగ్గురు, నలుగురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారుంటే ఇంటికి ఒక్కరికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు తెలిపారు. ప్రభుత్వం తమకు ఎలాంటి పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయారు. ఆస్పత్రికి వెళ్తే మందులు కూడా లేవంటున్నారని చెప్పారు. ఉయాలసిస్ యంత్రాలు సరిపోక రోజుల తరబడి పడిగాపులు కాయల్సి వస్తుందని అన్నారు. కిడ్నీ వ్యాధితో వందల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కాగా, జననేత హామీలపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. -
ఈ కన్నీరు తుడిచేవారెవరు?
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చదనానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఏ పల్లెలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా పది మందికి అన్నం పెట్టిన రైతన్నలు నేడు ఆర్థిక సాయం కోసం చేతులు చాపాల్సిన దుస్థితి దాపురించింది. మూత్రపిండాల(కిడ్నీ) జబ్బులతో వేలాది కుటుంబాలు చితికిపోయాయి. ఈ దెబ్బకు ఉన్న ఆస్తులు, పొలాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. పుండుపై కారం చల్లినట్టు తిత్లీ తుపాన్ బాధిత కుటుంబాలను మరింత కుంగదీసింది. ఉద్దానంలోని సోంపేట, కవిటి, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో కిడ్నీ రోగుల దుస్థితిని ‘సాక్షి’ ప్రత్యక్షంగా పరిశీలించింది. గుండె తరుక్కుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఉద్దానం ప్రాంతంలో 40–45 ఏళ్ల వయసుకే వేలాది మంది మూత్రపిండాల జబ్బుల బారిన పడ్డారు. ఎప్పటికప్పుడు రక్తశుద్ధి(డయాలసిస్) చేయించుకుంటే తప్ప వారు బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఉద్దానంలో 7 మండలాలు ఉండగా, సోంపేట, పలాసలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలున్నాయి. చాలామంది బాధితులు వారానికి రెండుసార్లు, కొందరు మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. సోంపేటలో రోజుకు 70 మందికి, పలాసలో 40 మందికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో చాలామంది బాధితులు వెయిటింగ్లో ఉన్నారు. లేదంటే విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లాలి. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లాలంటే సహాయకుడితో కలిపి రూ.2,000 ఖర్చవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. కిడ్నీ వ్యాధుల వల్ల ఉద్దానంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. తిత్లీ తుపాన్ పల్ల పంటలు, తోటలన్నీ నాశనమయ్యాయని, రూపాయి కూడా ఆదాయం లేదని, ఇక డయాలసిస్ ఎలా చేయించుకోవాలని కిడ్నీ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఉద్దానంలో ఏ కిడ్నీ బాధితుడిని కదిలించినా ఒకటే ఆవేదన. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పెన్షన్ సరిపోవడం లేదని, తక్షణమే పెంచాలని కోరుతున్నారు. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లడానికి బస్ పాసులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. తిత్లీ తుపాన్ వల్ల దారుణంగా నష్టపోయామని, తమకు ప్రత్యేకంగా నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకరు మృతి చెందితేనే మరొకరికి డయాలసిస్ ఉద్దానంలోని సోంపేట, పలాసతోపాటు టెక్కలి, శ్రీకాకుళంలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 13 రక్తశుద్ధి యంత్రాలు పనిచేస్తున్నాయి. ఉద్దానంలోని బాధితులంతా సోంపేట, పలాసకే వస్తారు. ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులెవరైనా మృతి చెందితేగానీ మరొకరికి అవకాశం రాదు. ఒక యంత్రం రోజుకు ఒక్కొక్కరికి 4 గంటల చొప్పున మూడు షిఫ్ట్‌లు మాత్రమే రక్తశుద్ధి చేయగలదు. గడిచిన ఏడాదిన్నరలో సోంపేట డయాలసిస్ కేంద్రం పరిధిలో 43 మంది, పలాస కేంద్రం పరిధిలో 15 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. శ్రీకాకుళం, టెక్కలి కేంద్రాలను కూడా కలుపుకుంటే 100 మందికి పైగా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. డయాలసిస్ చేయడంలో జాప్యం జరిగితే కాళ్లు, చేతులు వాపు వస్తాయి. తీవ్ర ఆయాసం వస్తుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. దానివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా జాప్యం జరగడం వల్ల చాలామంది బాధితులు మృతి చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డయాలసిస్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. పెన్షన్ డబ్బులు చాలడం లేదు ‘‘నాది ఇచ్ఛాపురం దగ్గర కేఎస్ పురం. డయాలసిస్ కేంద్రానికి రావాలంటే 35 కిలోమీటర్లు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చెయ్యాలి. వచ్చిన ప్రతిసారీ రూ.1,000 ఖర్చవుతోంది. ఇక్కడ ఇచ్చే మందులు చాలవు. మందులకే రూ.5,000 అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.2,500 పెన్షను ఒక్క వారానికి కూడా సరిపోవడం లేదు’’ – లోకనాథం, కిడ్నీ బాధితుడు, కేఎస్ పురం మాకే ఎందుకు ఈ శాపం ‘‘మాకు ఇద్దరు పిల్లలు. నా భర్తకు కిడ్నీ జబ్బు వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక కొంత పొలం అమ్ముకున్నాం. వారానికి రెండుసార్లు డయాలసిస్ కేంద్రానికి వస్తున్నాం. మాకే దేవుడు ఎందుకు ఈ శాపం పెట్టాడో. సర్కారు సాయం చాలడం లేదు. భర్తకు కిడ్నీ జబ్బు రావడంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది’’ – శోభ, కిడ్నీ బాధితుడు బాలం భార్య, బెజ్జపుట్టుగ గ్రామం మందులు మింగకపోతే చనిపోతా.. ‘‘నేను ఆత్మహత్య చేసుకోనక్కరలేదు. మూడు రోజులు మందులు మింగకపోతే చనిపోతా. కిడ్నీ జబ్బు వచ్చాక నా భార్య కిడ్నీ ఇచ్చింది. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి మందులు ఉచితంగా ఇవ్వరట. ఎకరా భూమిలో కొబ్బరి చెట్లన్నీ తిత్లీ తుపాన్ ధాటికి నేలకొరిగాయి. మందులు ఏ రోజైతే ఆపేస్తానో అవే నాకు చివరి రోజులు’’ – లమ్మత శేషగిరి, అతని భార్య సుజాత, పెద్ద శ్రీరాంపురం చనిపోతే మేలేమో అనిపిస్తోంది ‘‘నా భార్య రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటోంది. ఇంట్లో వృద్ధురాలు మా అమ్మ, మా అత్త ఉన్నారు. అనారోగ్యం వల్ల నా భార్య ఏ పనీ చేయలేదు. ఈ ముగ్గురికీ నేనే వండిపెట్టాలి. నా భార్యకు చికిత్స చేయించాలంటే చేతిలో డబ్బుల్లేవు. సర్కారు ఇచ్చే సాయం సరిపోవడం లేదు. ఈ బాధ పడే కంటే చనిపోతే మేలేమో అనిపిస్తోంది’’ – కిడ్నీ జబ్బు బాధితురాలు నాగమణి భర్త పురుషోత్తం, పలాస టౌన్ పెన్షన్ పెంచాలని ప్రతిపాదించాం.. ‘‘కవిటి మండల కేంద్రంలో మరో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ఉద్దానం కిడ్నీ బాధితులకు మందుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని లేఖ రాశాం. బస్సు పాసులు ఇవ్వాలని కూడా ప్రతిపాదన పంపిస్తాం’’ – ధనుంజయరెడ్డి, కలెక్టర్, శ్రీకాకుళం జిల్లా -
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేశ్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘పవన్ కల్యాణ్ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందసాలో సుమారు 16 కోట్ల నిధులతో ఏడు ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాం. వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతోంది. 136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లలలో డయాలసిస్ పొందుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2500 పెన్షన్ అందిస్తున్నాం. నాలుగు నెలల్లో 15 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి, ఇప్పటివరకూ లక్షమందికి పైగా స్ర్కీనింగ్ జరిగింది. సోంపేటలో నూతన ల్యాబ్ ఏర్పాటు చేసాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా పలాస, సోంపేట, పాలకొండలో మూడు రినల్ డయాలసిస్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలపై పరిశోధన, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభమైంది. ఒక నిర్ణయానికి వచ్చేముందు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు బేరీజు వేసుకోవాలి.’ అని సూచించారు. Our Government is making an honest effort to get to the root of CKD problem and is doing everything to safeguard the health of those affected. I request all to kindly verify the facts before jumping into conclusions. — Lokesh Nara (@naralokesh) 23 May 2018 కాగా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సరైన విధివిధానాలు 48 గంటల్లో ప్రకటించాలని.. లేని పక్షంలో నిరసన దీక్షకు కూర్చుంటానని ఏపీ ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. -
ఏపీ ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం!
సాక్షి, టెక్కలి : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని కాదని సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా అన్నారని, దీన్ని బట్టి చూస్తే హోదాకు తూట్లు పొడిచింది టీడీపీ ప్రభుత్వమేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సరైన విధివిధానాలు 48 గంటల్లో ప్రకటించాలని.. లేని పక్షంలో నిరసన దీక్షకు కూర్చుంటానని ఏపీ ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన తప్పులనే చంద్రబాబు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. భావనపాడు రోడ్డు విషయంలో ఏపీ ప్రభుత్వం లాలూచీ పడిందని పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య ఇప్పటికీ అలాగే ఉందన్నారు. విదేశీ వైద్యులను సైతం ప్రభుత్వం ఉపయోగించుకోలేక పోయిందంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి కూడా లేరని చెప్పారు. తాను ఇచ్చిన గడువులోగా కిడ్నీ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి సమస్యల పరిష్కారం కోసం తాను నిరసన దీక్షకు కూర్చుంటానని పవన్ ప్రకటించారు. -
తోలుమందం సర్కార్
ఉద్దానంలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కిడ్నీవ్యాధి బాధితులకు అండగా ఉంటాం - అధికారంలోకి వచ్చిన వెంటనే నెలనెలా రూ.10 వేల పింఛన్ - వ్యాధిగ్రస్తుల కేంద్రీకృత ప్రాంతాల్లో డయాలసిస్ యూనిట్లు - ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ నాటి దశను దాటి అమలు చేస్తాం - జగతి గ్రామంలో బాధితులతో ప్రతిపక్ష నేత ముఖాముఖి సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ‘‘ఉద్దానంలోని ఏడు మండలాల్లో లక్ష మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే దాదాపు 35 వేల మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వెల్లడైంది. గత మూడునాలుగేళ్లలో మూడు వేల మంది వరకు ఈ వ్యాధితో చనిపోయారు. ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది తోలుమందం సర్కార్.. సీఎం చంద్రబాబుకు బుద్ధీ జ్ఞానం ఉంటే ఈ కార్యక్రమం చూసైనా మారతారనుకుంటున్నా.’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా కవిటి మండలం జగతి గ్రామంలో శనివారం నిర్వహించిన కిడ్నీవ్యాధి బాధితులతో ముఖాముఖిలో జగన్ పాల్గొన్నారు. వారితో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ స్పందన ఆయన మాటల్లోనే.... కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10వేల పింఛన్ మన ఆందోళనలు, బాధితుల ఆక్రందనలు చంద్రబాబులో మార్పు తీసుకురాలేకపోతే నేను అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. మరో ఏడాది ఏడాదిన్నర తరువాత వచ్చేది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పథకం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం. ఆ పథకాన్ని ఆయన ఒక దశకు తీసుకెళితే రెండో దశకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నా. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ. 10 వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఏ పేదవాడు కూడా మందుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రానివ్వం. ఇంట్లో మిగిలిన వాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కిడ్నీ పేషెంట్లు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటే స్థానిక పీహెచ్‌సీల్లోనే డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయిస్తాం ఇది దారుణమైన పాలన.. చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా జరుగుతుందంటే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల అవస్థలే నిదర్శనం. ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి మహోన్నత ఉద్దేశంతో 2007లో ప్రవేశపెట్టిన ఈ పథకం కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది. అలాంటి పథకాన్ని మరింత మెరుగు పరచి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సింది పోయి చంద్రబాబు నీరుగార్చేస్తున్నారు. మొన్న ఒంగోలులో ధర్నా చేశాం. కనిగిరిలో కిడ్నీ పేషెంట్లను చూపించాం. జగతి గ్రామంలో మళ్లీ ఈ వేళ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న అవస్థలు, ఇబ్బందులను చూపెడుతున్నాం. కానీ ఆరోగ్యశ్రీని ఎంత దారుణంగా నడిపిస్తున్నారంటే ఈసారి బడ్జెట్లో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారు. దీనిలో రూ.485 కోట్లు గత ఏడాది బకాయిలు. ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా ఆసుపత్రికి వెళితే డాక్టర్లు వైద్యం చేయని పరిస్థితి. రేపు రా మాపు రా అని చెబుతున్న స్థితి. దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వం ఏడెనిమిది నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. పిల్లల ఆపరేషన్ ఖర్చు మిగుల్చుకుంటారా? కిడ్నీ పేషెంట్లకు గానీ, కాక్లియర్ ఇంప్లాంట్ పేషెంట్లకు గానీ వైద్యం అందే పరిస్థితిలేదు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లంటే మీ అందరికీ తెలుసు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు చేసి వైకల్యం తొలగించి ఆరోగ్యం ప్రసాదించడం కాక్లియర్ ఇంప్లాంట్. ఆ ఆపరేషన్ చెయ్యాలంటే దాదాపుగా రూ.6 లక్షలకు పైన అవుతుంది. 12 ఏళ్లలోపు పిల్లలందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు జరిగేవి. ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లను ఎలా కత్తిరించాలా అని ఆలోచిస్తున్నారు. ఇవాళ మూగ చెవుడు పిల్లలకు ఆపరేషన్లు చేయించాలంటే ఆ పిల్లలకు రెండేళ్ల వయసు లోపే ఉండాలట. రెండేళ్లలోపు పిల్లలకు మూగ, చెవుడు లోపాలున్నాయని తల్లి ఎలా గుర్తించగలుగుతుంది? ఒకో పిల్లాడికి ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గించుకోవాలని ఈ ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. 108 వాహనాల డీజిల్‌కూ డబ్బివ్వడంలేదు.. ఒకప్పుడు 108 నంబర్‌కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి ఆపదలో ఉన్న వ్యక్తిని పెద్దాసుపత్రిలో చేర్పించేది. అక్కడ కూడా ఉచితంగా వైద్యం అందడంతో చిరునవ్వుతో ఆ వ్యక్తి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండేది. ఇవాళ 108కి ఫోన్ చేస్తే అందులో పనిచేసే సిబ్బందికి రెండుమూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆవేదన వినిపిస్తోంది. డీజిల్ బకాయిలు చెల్లించలేదు కాబట్టి తాము 108 వాహనాలకు డీజిల్ ఇవ్వడం లేదని పెట్రోల్‌బంకుల యజమానుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే విజయనగరం జిల్లాలో రెండు రోజులు పాటు 108 వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది. 104 వాహనాలు ఎక్కడున్నాయో? రోగులకు మందులిచ్చేందుకు 104 వాహనాలతో ఆదుకోవలసిన ప్రభుత్వం ఆ బాధ్యత వదిలేసింది. కిడ్నీ పేషెంట్లు మందుల దశ దాటి డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. డయాలసిస్ దశ నుంచి ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దశకు ఆరోగ్యం దిగజారుతోంది. ప్రతి గ్రామానికి వెళ్లి నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులకు, వృద్ధులకు, బీపీ, షుగర్ రోగులకు మందులిచ్చి, కిడ్నీ రోగులకు మందులు ఇవ్వాల్సిన ప్రభుత్వం 104ను పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఇవాళ 104కు ఫోన్ చేస్తే ఆ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోలేకపోతున్నారు. కిడ్నీ పేషెంట్లపై కనికరం లేని ప్రభుత్వం సాధారణంగా రక్తపరీక్షలలో సీరం క్రియాటిన్ లెవెల్స్ 1.4 దాటితే ప్రమాదకర దశ అని అర్థం. ఆ దశకు చేరకుండా నియంత్రించడానికి మందులు, ఇంజక్షన్లు తీసుకోవాలి. ఈ దశ దాటి డయాలసిస్ దశకు వెళితే డయాలసిస్‌కు, మందులకు, ఆసుపత్రికి రానుపోను ఖర్చులు కలిపి నెలకు రూ.20వేల నుంచి రూ.25 వేలు వరకు అవుతుంది. ఇక డయాలసిస్ దశ దాటితే చివరి మార్గం కిడ్నీ మార్పిడి ప్రక్రియ ఒక్కటే. ఈ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు దాదాపు రూ.10 లక్షలు. ఈ ఆపరేషన్ చేయించుకున్నా ఆ తరువాత మందులకు మళ్లీ ప్రతినెలా ఖర్చు తప్పదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పేషెంట్లు ఉన్నప్పుడు మనం చేస్తున్న నిరసనలు, ధర్నా కార్యక్రమాల ద్వారా నైనా ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందని ఆశిస్తాం. తాము పడుతున్న కష్టాలు, బాధలు పేషెంట్ల నోటి ద్వారా విన్న తరువాతైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని, ఆయనలో కదలిక వస్తుందని ఆశ. ఒంగోలులోను, కనిగిరిలోను ఇదే ప్రయత్నం చేసినా ఆయన చర్మం చాలా మందం. కనీసం ఉద్దానం కిడ్నీ రోగుల ఆవేదన విన్నాౖకైనా ఆయనలో మార్పు రావాలి. మనం ఆశించినంత వేగంగా మార్పు రాకపోయినా ఒత్తిడి అయితే మాత్రం తీసుకురాగలం. కేంద్రం సంసిద్ధంగా ఉన్నా కనీసం ప్రతిపాదన పంపరా? ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు దారుణమైన పరిస్థితిలో ఉంటే కనీసం ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనే రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. ఈ వ్యాధులకు కారణాలేంటి, నిరోధానికి ఏమి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ పాటికే ఇక్కడ కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి ఉండాల్సింది. మూడేళ్ల పాలన గడిచిపోయినా చంద్రబాబుకు ఆ ఆలోచనే రాకపోవడం దురదృష్టకరం. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినా కనీసం రాష్ట్రం నుంచి ప్రతిపాదన కూడా పంపకపోవడం దారుణం. ఈ విషయం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించినప్పుడు వెలుగులోకి వచ్చింది. సాగునీరు, తాగునీరులోని సిలికాన్ తదితర కొన్ని మూలకాలు కిడ్నీ వ్యాధికి కారణమనే వాదన ఉన్నప్పుడు ప్రభుత్వం కనీసం తగిన చర్యలు తీసుకోవాలి కదా? ఆ విషయంలో రాష్ట్రప్రభుత్వం దారుణంగా విఫలమైంది. జిల్లాలోని నదులలో నీటిని ఒడిసిపట్టి ఉద్దాన ప్రాంతానికి మళ్లించి భూగర్భ జలాల్లో మార్పు తీసుకురావాలి. ఇదే కాకుండా ఇతర కారణాలు అన్వేషించేందుకు ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు తోలుమందం.. గట్టిగా ఒత్తిడి చేద్దాం
- ఉద్దానం కిడ్నీ బాధితులతో వైఎస్ జగన్ - శ్రీకాకుళం జిల్లా జగతిలో ప్రతిపక్షనేత ముఖాముఖి - ఏడాదిన్నరలో వచ్చేది ప్రజా ప్రభుత్వమే.. - మహానేత కలల పథకం ఆరోగ్యశ్రీని ఇంకా ఉన్నతంగా తీర్చి దిద్దుకుందాం జగతి: ఉద్ధానం కిడ్నీబాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఉద్ధానం ప్రాంతంలోని జగతి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కిడ్నీ బాధితులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ బాధలు జగన్‌కు విన్నవించుకున్నారు. ఆరోగ్యశ్రీని, 108, 104 సర్వీసులను నిర్వీర్యం చేస్తోన్న సీఎం చంద్రబాబుకు తోలు మందమని, అంతా కలిసి గట్టిగా ఒత్తిడి చేద్దామని వైఎస్ జగన్.. కిడ్నీ బాధితులతో అన్నారు. ‘ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. పేదలకు సంజీవిని లాంటి 108 వాహనాలు మూలన పడ్డాయి. 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదనే సమాధానం వస్తోంది. 104 వాహనాల పరిస్థితీ అంతే తయారైంది. గతంలో కిడ్నీ పేషెంట్లకుగానీ, మూగ, చెవిటి పిల్లలకుగానీ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసేవారు. చంద్రబాబు సర్కారు ఇప్పుడు వాటిని ఎత్తేసింది. కిడ్నీ వ్యాధి బారిన పడివాళ్లకు మొదట మందులు ఇస్తారు. బ్లడ్ లెవెల్స్ మెయింటెనెన్స్ కోసం వారం లేదా రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్ ఇస్తారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.650 ఖర్చవుతుంది. మందులకు రూ.2 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చవుతోంది. అప్పటికీ జబ్బు తగ్గకపోతే డయాలసిస్‌లోకి వెళతారు. దీనికి నెలకు రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. ఇక చివరిస్టేజ్.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ ఆపరేషన్ ఖర్చు రూ.10 లక్షలు, ఆపరేషన్ తర్వాత మందులకు అయ్యే ఖర్చు అదనం. వ్యాధికిగురయ్యేవారిలో అధికులు పేదలే. వాళ్లందరిదీ వైద్యం చేయించుకోలేని పరిస్థితే. అలాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతా తలకు మించిన భారాన్ని మోస్తున్న ఉద్దానం బాధితులు ఇంకొక్క ఏడాదిన్నర ఓపిక పట్టాలని, వచ్చేది ప్రజాప్రభుత్వమేనని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ‘ఆరోగ్యశ్రీ.. వైఎస్సార్ కలల పథకం. వచ్చే ప్రభుత్వంలో ఆ పథకాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఏ పేదవాడూ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ప్రైమరీ సెంటర్లల్లోనే డయాలసిస్ సెంటర్లు పెట్టిస్తాం’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇదీ బాబుగారి విధానం! ‘ఉద్దానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయనేదానిని పరిశోధించడానికి రీసెర్చ్ సెంటర్ పెట్టాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోలేదు. గడిచిన మూడేళ్లలో ఆ ఆలోచనైనా చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ ద్వారానైనా సెంటర్ ఏర్పాటుకు ప్రత్నించారా అంటే, అదీ చేయలేదు. గత పార్లమెంట్ సమావేశాల్లో వైసెస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఉద్దానం సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించారు. ‘ఉద్ధానంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చిందా?’ అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని కేంద్రం సమాధానం చెప్పంది. ఇదీ బాబుగారి విధానం. ఆయన తోలు మందం అన్న సంగతి మనకు తెలుసుకాబట్టి, ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూనే, రాబోయే ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసుకుందాం’ అని వైఎస్ జగన్ చెప్పారు. (కిడ్నీ బాధితులతో వైఎస్ జగన్ ముఖాముఖీ)