ugadi special
-
Tejaswini Gowda: ఉగాది సెలబ్రేషన్స్.. క్యూట్ పిక్స్‌తో సీరియల్ బ్యూటీ తేజస్విని సెన్సేషన్ (ఫోటోలు)
-
ముద్దుగుమ్మ శ్రీముఖి ఉగాది ముస్తాబు (ఫోటోలు)
-
Nabha Natesh: హీరోయిన్ నభానటేష్ ఉగాది స్పెషల్ లుక్.. (ఫోటోలు)
-
అనకాపల్లి నూకాంబిక ఆలయంలో కొత్త అమావాస్య పూజలు
-
ప్రేక్షకులకు పండగ కానుక.. కొత్త కళలు
సన్ ఆఫ్ ఇండియా సింగిల్‌గా వచ్చాడు.. నారప్ప ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చాడు.. ప్రేమికుడు విక్రమాదిత్య ప్రేమలోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జనాల్లోంచి గాల్లో పైకి లేచారు.. టక్ జగదీష్ కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు చిందించాడు... ఇలా ఉగాది సందర్భంగా నిర్మాణంలో ఉన్న చిత్రాల ఫస్ట్ లుక్స్, కొత్త పోస్టర్లు విడుదలై, పండగ కళ తెచ్చాయి. ఆ విశేషాలు డా. మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. టైటిల్‌ని బట్టి దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా న్యాయం కోసం పోరాడే పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారని ఊహించవచ్చు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విష్ణు మంచు నిర్మిస్తున్నారు. నారప్పగా వెంకటేశ్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చూశాం. పండగకి తన భార్య సుందరమ్మతో కలిసి వచ్చారు నారప్ప. సుందరమ్మ పాత్రను ప్రియమణి చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మించిన చిత్రం ‘నారప్ప’. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘అఖండ’ అనే టైటిల్ ప్రకటించి, లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది. స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం) . రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ జనాల మధ్యలోంచి గాల్లోకి ఎగురుతున్న కొత్త పోస్టర్ పండగకి వచ్చింది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ప్రేయసి ఏం చెప్పిందో ఏమో నవ్వుతూ కనిపించారు విక్రమాదిత్య (ప్రభాస్ పాత్ర పేరు). జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. సిద్ధ, నీలాంబరి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ ప్రపంచాన్ని మరచిపోయారు. వీరి ప్రేమకథను ‘ఆచార్య’లో చూడొచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ద పాత్రలో రామ్‌చరణ్, అతని సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకుంటున్నారు. అనుకున్నట్లు జరిగితే నాని ‘టక్ జగదీష్’ ఈ నెల 23న విడుదలయ్యుండేది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేశారు. కుటుంబ సమేతంగా జగదీష్ (నాని పాత్ర) తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే నాగచైతన్య, సాయి పల్లవితో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ని కూడా ఈ నెలే థియేటర్లలో చూసేవాళ్లం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశారు నిర్మాతలు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజైంది. బస్సులో ప్రేయసిని ఆరాధనగా చూస్తున్నాడు ‘గల్లీ రౌడీ’. సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఇందులో నేహా శెట్టి హీరోయిన్. షూటింగ్ జరుగుతోంది. పండగ వేళ నవ్వులు చిందించింది వెన్నెల. రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో వెన్నెల పాత్రలో కనిపిస్తారు సాయి పల్లవి. ఈ 30న సినిమాని విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా పడే అవకాశం ఉంది. అబ్బాయి, అమ్మాయి చెరోవైపు చూస్తూ నిలబడ్డారు. కథ ఏంటనేది ‘వరుడు కావలెను’ సినిమాలో చూడాలి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అద్దంలో బట్టతలతో, విడిగా చక్కని హెయిర్ స్టయిల్‌తో ప్రత్యక్షమయ్యాడు ‘101 జిల్లాల అందగాడు’. అవసరాల శ్రీనివాస్ హీరోగా రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, వై. రాజీవ్‌రెడ్డి, వై. సాయిబాబు నిర్మిస్తున్నారు. జీబీ కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ‘బ్లాక్’ లుక్ వచ్చింది. మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అలీ కీలక పాత్ర చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ బాబ, కొణతాల మోహన్, శ్రీచరణ్. ఆర్ నిర్మిస్తున్నారు. రంజాన్, ఉగాది శుభాకాంక్షలతో ఈ సినిమా కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మే 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
రుచికరమైన షడ్రుచుల ఉగాది
పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది. వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ.. ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – తగినన్ని; చింత పండు – తగినంత; చెరకు ముక్కలు – ఒక కప్పుడు; అరటి పండు – 2 (ముక్కలు చేయాలి); బెల్లం తరుగు – నీళ్లకు తగినన్ని; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (ముక్కలు చేయాలి);ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); మిరియాలు – 6 (పొడి చేయాలి) తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, పల్చ గా రసం తీసుకోవాలి ►ఒక గిన్నెలో చింతపండు రసం, తగినన్ని నీళ్లు, బెల్లం తరు గు, ఉప్పు వేసి గరిటెతో కలియబెట్టాలి ►శుభ్రం చేసి నీళ్లలో కడిగిన వేప పువ్వు, అరటి పండు ముక్కలు వేసి మరోమారు కలియబెట్టాలి ►సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి, చివరగా మిరియాల పొడి వేసి కలిపి, నివేదన చేసి, చిన్నచిన్న గ్లాసులలో ప్రసాదంగా అందించాలి. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. అయ్యంగారి పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. సేకరణ: పురాణపండ వైజయంతి -
కనుల పండువగా నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్ : ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం గురువారం భక్తులతో పోటెత్తింది. భక్తుల గోవిందనామస్మరణలతో ఆలయ పురవీధులు మార్మోగాయి. హేమలంబి నామ సంవత్సర ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు స్వామి వారి రథోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఆంజనేయ పాహిమాం.. ,పవనపుత్ర రక్షమాం.. అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆకు పూజలు , వడమాలలు ,నివేదనలతో మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ వేద పండితులు రామక్రిష్ణావధాని ,అనంతపరద్మనాభశర్మల ఆధ్వర్యంలోని అర్చక బృందం సాయంత్రం 6 గంటలకు రథం ముందు కళశ స్థాపన , రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. ఆలయ ఈఓ ఆనంద్ కుమార్ ,ఆలయ ధర్మకర్త సుగుణమ్మ ఇతర అధికారులు, పాలకమండలి సభ్యులు కొబ్బరికాయలను సమర్పించి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తిక్కస్వామి, వైస్ సర్పంచ్ శ్రీరాములు,తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీపీ రాయల్‌రామయ్య తదితరులు పాల్గొన్నారు. కసాపురం ఎస్ఐ సద్గురుడు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు చేపట్టారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
సింగర్స్ తో ఉగాది స్పెషల్
-
సినిమా పచ్చడి