Ujjwal uke
-
బాలికలపై లైంగిక నేరాలను ఉపేక్షించేదిలేదు
ముంబై : లైంగిక నేరాలను అదుపు చేయడానికి మహా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు, ఇలాంటి కేసులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గుర్తిస్తోందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. లైంగిక నేరాల అదుపు చేయడంలో భాగం గా రాష్ట్ర బాలల అభివృద్ధి విభాగం, బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్, యూనిసెఫ్ సంయుక్తంగా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడకుండా నిరోధించే పోక్సో చట్టం(20012)పై ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం లైంగికనేరాలను జీరోస్థాయికి తీసుకొని రావడమే ధ్యేయంగా ప్రకటించింది. చట్టంపై అవగాహనతోపాటు, లైంగిక నేరాల అదుపునకు అవసరమైన ప్రతిపాదనలు, సూచనలను రూపొం దించడం కోసం నిర్వహించిన ఈ సదస్సు చేసే తీర్మానాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అమలు చేయాల ని నిర్ణయించిందని సీనియర్ అధికారి తెలిపారు. మహిళా-బాలికల అభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉజ్వల్ ఉకే ఈ సదస్సులో మాట్లాడుతూ బాలికలపై నేరాలకు పాల్పడే కేసుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ చర్యలు తీసుకొంటుందని చెప్పారు. పోక్సో చట్టం పట్ల అత్యధిక ప్రజల్లో అవగాహన లేదని, అందుకే చట్టం దుర్వినియోగం అవుతోందని, నేరస్తులు సులువుగా తప్పించుకొంటున్నారని చెప్పారు. గత ఐదేళ్లకాలంలో బాలిక పట్ల లైంగిక నేరాల కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని, దీనికి కారణం చట్టం పట్ల అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. బాలికలకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవడం కత్తిమీదసాములా మారిందని, ఇది నిందితులకు అవకాశంగా మారుతోందని అన్నారు. ఈ చట్టం కింది నిందితులకు సరైన శిక్ష పడుతుందని తల్లిదండ్రులు తెసుకోవాలని, తద్వారా నిందితులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని సూచించారు. అత్యధిక సంఖ్యలో ప్రజల్ని ఈ చట్టం పట్ల చైత్యన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, దీని ద్వారా నిందితులను శిక్షించే అవకాశం ఉంటుందని అన్నారు. బాధితులు సహకరిస్తేనే బాలికలపై లైంగిక నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ల ద్వారా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా గళం వినిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ సదస్సులో ప్రముఖ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలనేరస్తుల న్యాయవిభా గం జస్టిస్, బాలికల సంక్షేమ కమిటీల స భ్యులు అభిప్రాయాలను వెల్లడించారు. బాలికలపై లైంగిక నేరాలను సహించవద్దని ముక్తకంఠంగా తీర్మానించారు. -
‘ఉట్టి’ దిగులు..!
సాక్షి, ముంబై: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్న సామెత చందంగా ఉంది ప్రస్తుతం నగర పోలీసుల పరిస్థితి.. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా పిల్లలు లేకుం డా ఉత్సవమా.. సమస్యే లేదు.. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు తప్పకుండా పాల్గొం టారని ఉత్సవ మండళ్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఈ నెల 17వ తేదీన (ఆదివారం) ఉట్టి ఉత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనే అంశం ఎటూ తేలకపోవడంతో మధ్యలో నగర పోలీసులు నలిగి పోతున్నారు. ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటే సంబంధిత ఉట్టి ఉత్స వ మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించింది. మరోపక్క పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని మండళ్లు సవాలు చేస్తున్నాయి. మండళ్ల వైఖరిపై పోలీసులు ఏ విధంగా స్పం దిస్తారనేదానిపై అందరి ధృష్టి పడింది. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంవల్ల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి పైనుంచి కిందపడడంవల్ల వారు వికలాంగులయ్యే ప్రమాదముంది. గతంలో జరిగిన ఘటనల్లో కొందరు వికలాంగులుగా మారారు. కొం దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. తాజాగా వారం కిందట నవీముంబైలోని సాన్పాడా ప్రాంతంలో ఉట్టిఉత్సవాలకు సాధన చేస్తుండగా కిరణ్ తల్కరే (14) అనే బాలుడు పైనుంచి కిందపడడంతో తలకు, చాతిలో గాయాలయ్యాయి. నేరుల్లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజులకు చనిపోయాడు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పిల్లలు ఉట్టి ఉత్పవాల్లో పాల్గొనడాన్ని బాలల హక్కుల సంఘం నిషేధించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక అలాంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని తేల్చిచెప్పిం ది. అయితే పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని నగరం, ఠాణే జిల్లాకు చెందిన సార్వజనిక ఉట్టి ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి, బాలల హక్కుల సంఘానికి సవాలు విసిరాయి. అందుకు మహిళ గోవిందాందాలు కూడా మద్దతు పలికాయి. దీంతో ఏం చేయాలో తెలియక మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. ఇదిలాఉండగా ఈ సమస్యపై త్వరలో పరిష్కారం కనుగొంటామని మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కు ల సంరక్షణ కమిషన్ అధ్యక్షుడు ఉజ్వల్ ఉకే అన్నారు. గృహనిర్మాణ శాఖ సహా య మంత్రి సచిన్ అహిర్ సైతం ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని వా రం కిందట ప్రకటించారు. కాని ఇంతవరకు సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది.