లైంగిక నేరాలను అదుపు చేయడానికి మహా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ముంబై : లైంగిక నేరాలను అదుపు చేయడానికి మహా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు, ఇలాంటి కేసులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గుర్తిస్తోందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. లైంగిక నేరాల అదుపు చేయడంలో భాగం గా రాష్ట్ర బాలల అభివృద్ధి విభాగం, బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్, యూనిసెఫ్ సంయుక్తంగా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడకుండా నిరోధించే పోక్సో చట్టం(20012)పై ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం లైంగికనేరాలను జీరోస్థాయికి తీసుకొని రావడమే ధ్యేయంగా ప్రకటించింది. చట్టంపై అవగాహనతోపాటు, లైంగిక నేరాల అదుపునకు అవసరమైన ప్రతిపాదనలు, సూచనలను రూపొం దించడం కోసం నిర్వహించిన ఈ సదస్సు చేసే తీర్మానాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అమలు చేయాల ని నిర్ణయించిందని సీనియర్ అధికారి తెలిపారు. మహిళా-బాలికల అభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉజ్వల్ ఉకే ఈ సదస్సులో మాట్లాడుతూ బాలికలపై నేరాలకు పాల్పడే కేసుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ చర్యలు తీసుకొంటుందని చెప్పారు. పోక్సో చట్టం పట్ల అత్యధిక ప్రజల్లో అవగాహన లేదని, అందుకే చట్టం దుర్వినియోగం అవుతోందని, నేరస్తులు సులువుగా తప్పించుకొంటున్నారని చెప్పారు.
గత ఐదేళ్లకాలంలో బాలిక పట్ల లైంగిక నేరాల కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని, దీనికి కారణం చట్టం పట్ల అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. బాలికలకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవడం కత్తిమీదసాములా మారిందని, ఇది నిందితులకు అవకాశంగా మారుతోందని అన్నారు. ఈ చట్టం కింది నిందితులకు సరైన శిక్ష పడుతుందని తల్లిదండ్రులు తెసుకోవాలని, తద్వారా నిందితులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని సూచించారు. అత్యధిక సంఖ్యలో ప్రజల్ని ఈ చట్టం పట్ల చైత్యన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, దీని ద్వారా నిందితులను శిక్షించే అవకాశం ఉంటుందని అన్నారు.
బాధితులు సహకరిస్తేనే బాలికలపై లైంగిక నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ల ద్వారా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా గళం వినిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ సదస్సులో ప్రముఖ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలనేరస్తుల న్యాయవిభా గం జస్టిస్, బాలికల సంక్షేమ కమిటీల స భ్యులు అభిప్రాయాలను వెల్లడించారు. బాలికలపై లైంగిక నేరాలను సహించవద్దని ముక్తకంఠంగా తీర్మానించారు.