Ummareddi
-
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
- పార్టీ పటిష్టతపై దృష్టి - వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూనే సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పార్టీ జిల్లాల అధ్యక్షులు, మహిళా, రైతు, విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షుల సమావేశం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. మహిళా, రైతు, విద్యార్థి, యువజన విభాగాలు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉన్నప్పుడే పార్టీ మరింత క్రియాశీలంగా ఉండగలుగుతుందని, అందుకే వీటి పటిష్టతపై ప్రధానంగా దృష్టి సారించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 17న జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయకర్తల సమావేశంలో నొక్కి చెప్పారు. ఆ క్రమంలోనే శనివారం ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. జిల్లాలవారీగా సమీక్షించారు. పార్టీ పోరాటాల్లో అనుబంధ సంఘాల పాత్ర కీలకమైంది కనుక.. వీటి కమిటీల నియామకాల్లో కష్టపడి పనిచేసేవారినే ఎంపిక చేయాలని నేతలు సూచించారు. స్థానికంగా ఉండే సమస్యలను గుర్తించి పోరాటాలు చేయాలని అభిప్రాయపడ్డారు. రైతు, మహిళ, యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆర్.కె.రోజా, జక్కంపూడి రాజా, మహ్మద్ సలాంబాబు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ భేటీ
విజయవాడ: కృష్ణజిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ నేత గౌతం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ త్రిసభ్య కమిటీ నేతలు విజయసాయి రెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాద రాజు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరుగనుంది. అనంతరం సత్యనారాయణపురంలోని నాడర్ కళ్యాణ మండపంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరు సాగించడానికి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి ముందస్తుగా సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు హజరు కానున్నారు. ప్రభుత్వం రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హమీల తీరుపై ప్రసంగించనున్నారు. కాగా ఈనెల 31వ తేదీ , ఫిబ్రవరి 1వ తేదీల్లో పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తలపెట్టిన దీక్షను విజయవంతం చేయడానికి త్రిసభ్య కమిటీ వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. -
నేడు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం
కృష్ణా,గుంటూరు జిల్లాల నేతలు హాజరు వేదిక విజయవాడలోని నాడార్‌స కల్యాణ మండపం విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, ప్రసాదరాజు రాక జగన్ దీక్ష నేపథ్యంలో... సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు హజరుకానున్నారు. 31వ తేదీ , ఫిబ్రవరి 1వ తేదీల్లో పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తలపెట్టిన దీక్షను విజయవంతం చేయడానికి త్రిసభ్య కమిటీ వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు సత్యనారాయణపురంలోని నాడర్ కళ్యాణ మండపంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు హజరు కానున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరు సాగించడానికి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి ముందస్తుగా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హమీల తీరుపై ప్రసంగించనున్నారు. విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం సమావేశానికి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరుగనుంది. సమావేశంలో పార్టీ త్రిసభ్య కమిటీ నేతలు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొంటారు. సమావేశంలో యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరుగనుంది. -
తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశంపార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొలి సంతకం అనేదానికి నిర్వచనం తెలుసా? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేస్తే అది మరుసటి రోజు నుంచే అమలైందని గుర్తుచేశారు. కేంద్రాన్ని ఒప్పించి మరీ రుణమాఫీ చేయించారన్నారు. చంద్రబాబు మాత్రం రుణమాఫీపై తొలి సంతకం అంటూనే కోటయ్య కమిటీని వేశారని దుయ్యబట్టారు. ఆరునెలలైనా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని చెప్పారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించి, పంట బీమా కూడా దక్కకుండా చేసిన టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఐదున కలెక్టరేట్ల ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. క్యాడర్ వైఎస్సార్సీపీవైపే ఉందని, సీనియర్ల నేతృత్వంలో పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు సాగి దుర్గాప్రసాదరాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
విద్యానగర్ (గుంటూరు), న్యూస్‌లైన్ :పార్టీలో వలసలు ప్రారంభమవ్వడంతో బెంబేలెత్తిన కాంగ్రెస్ అధిష్టానం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం చుట్టుగుంట సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ఆజ్యం పోసిన కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రజాసంక్షేమం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని.. అందుకే తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేశారని చెప్పారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్రం రావణకాష్టంలా మారిందన్నారు. ఎందరో అమాయక ప్రజలు నష్టపోతున్నారని, వారి ఉసురు కాంగ్రెస్, టీడీపీలకు తప్పక తగులుతుందన్నారు. అనంతరం చుట్టుగుంట సెంటర్ నుంచి అరండల్‌పేట వరకు నగర విద్యార్థి విభాగం కన్వీనర్ పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో బైకుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు నసీర్‌అహ్మద్, షేక్ షౌకత్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, బోడపాటి కిషోర్, విజయ్‌కిషోర్, చాంద్‌బాషా, మద్దుల రాజాయాదవ్, సురగాని శ్రీను, మేళం ఆనందభాస్కర్, ప్రేమ్‌కుమార్, సుబ్బారెడ్డి, అందుగుల రమేష్, శివారెడ్డి, గౌస్‌కుమార్, దేవరాజు, శ్రీకాంత్, హేమంత్‌గుప్తా, మార్కొండారెడ్డి, వినోదజమీర్, పునీల్, ఝాన్సీ, వనజాక్షి, రాజేష్, విఠల్, శ్యాం, వసంత్, అశోక్, ఫణీంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.