Un Employees Rally
-
నిరుద్యోగ ర్యాలీ భగ్నం
-
ర్యాలీ భగ్నం
- జిల్లాల నుంచి రాజధాని వరకు టీజేఏసీ నేతల అరెస్టులు - మంగళవారం అర్ధరాత్రి దాటాక కోదండరాం ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు - తలుపులు పగులగొట్టి అరెస్టు.. కామాటిపుర స్టేషన్‌కు తరలింపు... ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీ బందోబస్తు - ఓయూలో ర్యాలీకి విద్యార్థుల యత్నం.. ఉద్రిక్తత - జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ భగ్నమైంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం సహా పలువురు నేతలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. జిల్లాల నుంచి రాజధానికి వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,220 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌లో ఉస్మానియా వర్సిటీ, నిజాం కాలేజీతోపాటు అనేక ప్రాంతాల్లో వివిధ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరవ్యాప్తంగా 447 మందిని ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచి విడిచిపెట్టారు. నాగోల్‌లో సభ నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చినా.. అందుకు నిరాకరిస్తూ టీజేఏసీ మంగళవారం తన పిటిషన్‌ను వాపస్ తీసుకొని, బుధవారం యథాతథంగా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. కోదండరాం ఇంటి వద్ద ఉద్రిక్తత తార్నాకలో టీ–జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇంటిని బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో సహా దాదాపు వంద మంది ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు రావడంతో కిటికీలు తెరిచి కోదండరాం వారితో మాట్లాడారు. బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఇంత రాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని, ఉదయం 6 గంటలకు వస్తానని కోదండరాం సమాధానం ఇచ్చారు. అయితే కొద్దిసేపటికే కోదండరాం ఇంటి తలుపులు పగులకొట్టిన పోలీసులు లోపలకు ప్రవేశించారు. ఆయనతోపాటు దాదాపు 40 మంది జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మీడియాను కోదండరాం ఇంటి నుంచి దూరంగా పంపేశారు. దీంతో కోదండరాం తన అరెస్టు వివరాలను ఫేస్బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. కోదండరాం, జేఏసీ కన్వీనర్ కె.రఘును కామాటిపుర పోలీసుస్టేషన్‌కు, మిగిలిన నాయకుల్లో కొందరిని కంచన్‌బాగ్, అంబర్‌పేట, గోషామహల్ తదితర పోలీసుస్టేషన్లకు పోలీసులు తరలించారు. సాయంత్రం 7.10 గంటల సమయంలో కోదండరాంను విడుదల చేశారు. పోలీసుల దాడి నేపథ్యంలో ధ్వంసమైన కోదండరాం ఇంటి తలుపుల్ని ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీసులే బాగు చేయించారు. పోలీసు గుప్పిట రాజధాని ర్యాలీ నేపథ్యంలో రాజధానిలోని మూడు కమిషనరేట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌లో ఉన్న సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అనేక మంది కదలికల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్ట్ చేశారు. ఇక ర్యాలీ, సభ నిర్వహిస్తామంటూ జేఏసీ ప్రకటించిన రెండు ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ చుట్టూ భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున అదనపు బలగాలను మోహరించారు. ఈ రెండు ప్రాంతాలకూ మధ్యన ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మూడు చోట్లా అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. ర్యాలీగా ఇందిరాపార్కుకు వచ్చిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్ట్ చేశారు. ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, అడ్వకేట్ జేఏసీ నాయకులు ప్రహ్లాద్, పీడీఎస్‌యూ నాయకులతోపాటు సుమారు 90 మందిని అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జ్యోతి అనే నిరుద్యోగిని సుందరయ్య పార్కు వద్ద హల్చల్ చేసింది. అప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకొనేందుకు యత్నించగా.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. జీపులో ఎక్కించి తీసుకువెళ్తుండగా.. చున్నీతో మెడకు గట్టిగా చుట్టి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు వెంటనే అప్రమత్తమైన అమె ప్రయత్నాన్ని నిలువరించారు. సచివాలయం భద్రత కట్టుదిట్టం ర్యాలీ నేపథ్యంలో సచివాలయం చుట్టూ బారికేడ్లు, ముళ్లకంచెలు ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. సచివాలయంలోకి ఎవరు వచ్చినా ఐడీకార్డు ఉంటేనే లోపటికి పంపించారు. ఏ క్షణంలోనైనా ఆందోళనకారులు వచ్చే అవకాశాలున్నాయనే సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కెమెరాలలో పర్యవేక్షిస్తూ ప్రధాన గేటు వద్ద ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు. కామాటిపుర ఠాణా వద్ద ఉద్రిక్తత కోదండరాంను తెల్లవారుజామున అరెస్టు చేసిన పోలీసులు ఏ స్టేషన్‌కు తరలించారనేది గోప్యంగా ఉంచారు. మధ్యాహ్నానికి ఆయన కామాటిపుర ఠాణాలో ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో విపక్షాలకు చెందిన నేతలు, మాజీ ఎంపీలు ఆయన్ను కలవడానికి ప్రయత్నించారు. పోలీసుస్టేషన్ వద్దకు వచ్చిన మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, నాయకులు రవీంద్ర నాయక్, విజయరామారావు, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు పలుమార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసు చర్యల్ని నిరసిస్తూ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమిషనర్ వద్దకు కోదండరాం సతీమణి తన భర్తను వెంటనే విడుదల చేయాలంటూ కోదండరాం భార్య సుశీల, న్యాయవాది రచన బుధవారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలవడానికి యత్నించారు. ఆ సమయంలో ఆయన కార్యాలయంలో లేకపోవడంతో సాధ్యం కాలేదు. సుశీల సాయంత్రం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా... అపాయింట్మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాజ్‌భవన్ ముందు కాస్సేపు నిరసన తెలిపి వెనుదిరిగారు. బుధవారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కోదండరామ్ ఇంటికి వెళ్లారు. ‘‘ఆయనొక ప్రొఫెసర్.. తీవ్రవాది కాదు.. నక్సలైటు అంతకన్నా కాదు.. అలాంటి వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి అరెస్టు చేసి పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుతారా’’ అని ప్రశ్నించారు. జిల్లాల్లో అరెస్టుల పర్వం పలు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు జేఏసీ నేతలను గృహనిర్భందం చేశారు. కీలక నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేసి తరలించారు. పాత జిల్లా ఆదిలాబాద్‌లో 210 మంది, కరీంనగర్లో 325, వరంగల్‌లో 330, ఖమ్మంలో 180, నిజామాబాద్‌లో 235, మెదక్‌లో 220, నల్లగొండలో 276, మహబూబ్‌నగర్‌లో 256, రంగారెడ్డి జిల్లాలో 158 మందిని అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ముందుస్తు చర్యల్లో భాగంగానే..: డీజీపీ అనురాగ్ శర్మ ‘‘హైదరాబాద్‌లో జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదు. హైకోర్టు సూచించిన ప్రాంతంలో కాకుండా మరోచోట నిర్వహించడం కుదరదని జేఏసీకి తెలిపాం. అలా కాకుండా ర్యాలీ నిర్వహించి చేస్తామంటే నిబంధనలు ఒప్పుకోవు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగానే కోదండరాంతోపాటు మిగతా జేఏసీ నాయకులను అరెస్ట్ చేశాం’’ అరెస్టుపై హక్కుల సంఘంలో పిటిషన్ కోదండరాం అరెస్టుపై హైకోర్టు న్యాయవాది నవీనా రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27 లోపు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల సంఘం నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. -
ర్యాలీపై ఉక్కుపాదం.. కోదండరాం అరెస్ట్
-
రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్
-
రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్
- నిరుద్యోగ ర్యాలీపై ఉక్కుపాదం.. టీజేఏసీ చైర్మన్ అరెస్ట్ - మరో 50 మంది నేతలూ పోలీసుల అదుపులో - ఖాకీవనంగా నగరం.. రంగంలోకి 12 వేల మందికిపైగా సిబ్బంది - సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్కు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. - ఉస్మానియా ప్రాంతం అష్టదిగ్బంధం సాక్షి, హైదరాబాద్: అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు. ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న జేఏసీ చైర్మన్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనతోపాటు మరో 50 జేఏసీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారనేదానిపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రొఫెసర్ ఆచూకీపై వెంటనే ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కీలక నాయకుల అరెస్టుల సమాచారంతో రాజధాని సహా రాష్ట్రమంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇదివరకే ప్రకటించింది. అటెన్షన్.. ర్యాలీ! నిరుద్యోగ ర్యాలీకి ర్యాలీకి అనుమతిలేదని, ఎవరైనాసరే నిషేధాజ్ఞలు మీరితే అరెస్టులు తప్పవని ఈస్ట్‌జోన్ డీసీపీ రవీంద్ర అన్నారు. ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అదనపు బలగాల ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని దాదాపు అష్ట దిగ్భంధనం చేశారు. 12 వేలకు పైగా సిబ్బందిని మోహరించారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆ ప్రాంతాల్లోనే 3 వేల మంది పోలీసులను మోహరించారు. సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. నగరంలో నిషేధాజ్ఞలు జేఏసీ పిలుపు నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తయిన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వారు గుంపులుగా జన సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక మూడు కమిషనరేట్లలో పోలీసు సిబ్బందికి ‘స్టాండ్ టు’ప్రకటించి అందరూ కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ర్యాలీ, సభల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడానికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 350 వరకు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కమాండ్–కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రోడ్లపై కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. తార్నాకలోని ఆయన ఇంటి తలుపులను బద్దలుకొట్టి మరీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడంపై జేఏసీ నేతలతో పాటు.. విద్యార్థులు మండిపడుతున్నారు. -
తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపుతారా?
- ఇది దారుణం.. సమైక్య రాష్ట్రంలోనూ ఇలా లేదు: కోదండరాం - నాడు నాపై ఉన్న కేసులే కేసీఆర్‌పైనా ఉన్నాయి - ఆయన కూడా నేరానికి పాల్పడినట్టేనా? - ర్యాలీ, సభ యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటన హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం.. హింసగా, నేరంగా చిత్రీకరిస్తోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం వంటి మహత్తర ఉద్యమాలను నేరంగా చిత్రీకరించడం దారుణం, సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్య రాష్ట్రంలోనూ ఇంత ఘోరంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ‘‘మాకు నేరపూరిత చరిత్ర ఉందని, విధ్వంసం జరిగిందని, కోర్టులో చూపెట్టారు. తెలంగాణ కేసులు చూపి అనుమతిని నిరాకరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కుట్రగా చిత్రీకరిస్తున్నారు. నాపై ఆరోపణలు నిజమైతే.. నాతో పాటు ఉద్యమంలో ఉన్న కేసీఆర్‌కు కూడా వర్తిస్తాయని పోలీసులకు తెలియదా? వ్యక్తిగతంగా నాపై, జేఏసీపై నాడు పెట్టిన అన్ని కేసుల్లోనూ కేసీఆర్ ఉన్నారు. ఆయన కూడా నేరానికి పాల్పడినట్టేనా? మాపై పెట్టిన కేసులన్నీ సీఎంపై పెడతారా?’’అని ప్రశ్నించారు. ఇది యువకుల, నిరుద్యోగుల గొంతును అణిచివేయడమేనని అన్నారు. ‘‘జేఏసీ వెనుక తీవ్రవాదులు ఎవరు ఉన్నారు? నిరుద్యోగులు, తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు ఇయ్యాల తీవ్రవాదులుగా ప్రభుత్వానికి కనబడుతున్నారా? ఇదేం ప్రజాస్వామ్యం?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ర్యాలీ, సభకు ఎన్టీఆర్ స్టేడియంలో అడిగాం. అక్కడ సాధ్యం కాకుంటే నిజాం కాలేజీ గ్రౌండ్.. నెక్లెస్‌రోడ్‌లో.. కనీసం ఉస్మానియా యూనివర్సిటీలోనైనా ఇవ్వాలని కోరాం. ‘కానీ పోలీసులు నాగోల్‌లో సభ నిర్వహించుకోవాలన్నారు. వసతులు సరిగా లేకపోవడంతో మేం అక్కడ సభ పెట్టుకోలేమని చెఆప్పం. ఇదే విషయం మాతో చర్చించి, వారం రోజుల ముందుగా చెప్పినా ఆలోచించడానికి వీలుండేది. ఎల్బీ స్టేడియంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు.. కానీ దానికి అవతల ఉన్న నిజాం కాలేజీ మైదానంలో నిరుద్యోగులు నిరసన సభను జరుపుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు? ప్రభుత్వంలోని పెద్దలకో నీతి, నిరుద్యోగులకు మరో నీతా’’అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలోనూ సమైక్య రాష్ట్రంలోని అణిచివేత కొనసాగుతోందన్నారు. ఇప్పటికే 600 మందిని అక్రమంగా అరెస్టు చేశారని కోదండరాం వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్టు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్కు దాకా ర్యాలీ చేపడతామని స్పష్టంచేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి నిరసన ర్యాలీని చేపడతానని అక్కడ్నుంచి ఇందిరాపార్కు వరకు వెళ్తానని ప్రకటించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు అరెస్టు చేస్తే విద్యార్థులు ఎక్కడికక్కడే రోడ్లపై బైటాయించి శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
అటెన్షన్.. ర్యాలీ!
ర్యాలీ నిర్వహించి తీరతామన్న టీజేఏసీ.. అనుమతి లేదంటున్న పోలీసులు - పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరికలు - తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపుతారా: కోదండరాం ఫైర్ - నేడు ర్యాలీ, సభ యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టీకరణ - పోలీసుల గుప్పిట్లో హైదరాబాద్.. కట్టుదిట్టమైన భద్రత - జిల్లాల్లో జేఏసీ నేతలు, విద్యార్థుల నిర్బంధం రాజధాని వేడెక్కింది.. నిరుద్యోగుల ర్యాలీపై అటు జేఏసీ.. ఇటు పోలీసులు పట్టువీడలేదు! ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామంటూ టీజేఏసీ.. అందులో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసుల హెచ్చరికల నడుమ నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి నిరా కరణపై హైకోర్టు తలుపు తట్టిన జేఏసీ మంగళవారం చివరి నిమిషంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు దాకా ర్యాలీ నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టంచేశారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని హింసగా, నేరంగా చిత్రీకరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ‘‘నాపై, జేఏసీపై గతంలో పెట్టిన అన్ని కేసుల్లో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆ కేసులన్నీ సీఎంపైనా పెడతారా’’అని నిలదీశారు. ఇక ర్యాలీ, సభను భగ్నం చేసేందుకు పోలీసులు సన్నద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లోనూ.. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న జేఏసీ నేతలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగ ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని టీజేఏసీ మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఉపసంహరించుకుంది. ఉస్మానియా వర్సిటీలో సభ నిర్వహణకు సైతం పోలీసులు అనుమతిని నిరాకరించడం.. నాగోల్ మెట్రోరైల్ ఓపెన్ గ్రౌండ్లో సభ నిర్వహించుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు సిద్ధపడ టంతో తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుం టున్నట్లు టీజేఏసీ హైకోర్టుకు తెలిపింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. జేఏసీ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు మంగళవారం మరోసారి విచారించారు. సోమవారం నాటి విచారణలో.. సభను ఆదివారం నిర్వహించుకోవడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని టీజాక్‌ను ఆదేశించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేసు విచారణకు రాగానే... ఆదివారం సభ నిర్వహణ సంగతేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే చెబుతానని జేఏసీ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి చెప్పడంతోన్యాయమూర్తి విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆదివారం సభ సాధ్యం కాదు.. తిరిగి విచారణ ప్రారంభం కాగానే రచనారెడ్డి వాదనలు వినిపించారు. శుక్రవారం మహాశివరాత్రని, శనివారం జాగారం ఉంటారని, ఆదివారం పబ్లిక్ సర్వీస్ పరీక్ష ఉందని కోర్టుకు నివేదించారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సభ నిర్వహించుకోవడం సాధ్యం కాదన్నారు. అంతేకాక సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామన్నారు. ర్యాలీ, సభకు బయలుదేరిన పలువురుని పోలీసులు ఆయా జిల్లాల్లో అరెస్టులు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ... హైదరాబాద్ వెలుపల సభ నిర్వహించుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియాలో సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోవాలని న్యాయమూర్తి జేఏసీ న్యాయవాదికి సూచించారు. జేఏసీ దరఖాస్తుపై మధ్యాహ్నం 3 గంటలకల్లా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఈ సమయంలో రచనారెడ్డి ఆవేశంగా మాట్లాడబోతుండగా... న్యాయమూర్తి ఆమెను వారించారు. తిరిగి విచారణ ప్రారంభం కాగానే... ఉస్మానియాలో అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అన్ని హామీలు కూడా ఇచ్చామని రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు జారీ చేశామంటూ ఉత్తర్వుల కాపీని రామకృష్ణారెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం.. ‘నిన్నటి ఉత్తర్వుల్లాగానే ఉన్నాయి కదా.. పోలీసులు ప్రతిపాదిస్తున్నట్లు మియాపూర్ మెట్రోరైల్ గ్రౌండ్స్‌లో ఎందుకు సమావేశం పెట్టుకోకూడదు’అని రచనను ప్రశ్నించారు. అది సిటీకి చాలా దూరమని ఆమె చెప్పగా.. కాదని, అది ఇన్నర్ రింగ్‌రోడ్డు లోపలే ఉందని ఏజీ తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుగుతుండగానే ఓయూ జేఏసీకి చెందిన కొందరు శరణం గచ్ఛామి సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు. ఉస్మానియాలో సభకు అనుమతినిస్తే ఇలాంటి పరిస్థితులే పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఆ విగ్రహాల విధ్వంసం జేఏసీ పనే.. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. గతంలో జరిగిన ఉద్యమాల్లో టీజేఏసీ పాల్గొంది కదా అని అన్నారు. అందుకు అవునని, అప్పుడు ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసానికి వారే కారణమని ఏజీ కోర్టుకు వివరించారు. దీనికి రచనారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ... ఆ ఆందోళనల్లో ప్రస్తుత అధికార పార్టీ నేతలు కూడా పాల్గొన్నారని, విగ్రహాల కూల్చివేతలో ప్రస్తుత అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారని, ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. పోలీసులు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన నాగోల్ మెట్రోరైల్ గ్రౌండ్స్‌ను ప్రస్తావించారు. అది చాలా దూరమని రచన చెప్పబోగా.. ఎంత మాత్రం కాదని, అది సిటీ పరిధిలోనే ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద పెద్ద స్థలం ఉందని, అక్కడ సభ పెట్టుకునేందుకు అనుమతినివ్వాలని రచనారెడ్డి కోరారు. అందుకు యూనివర్సిటీ వీసీ లేదా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వాలని కదా? అని న్యాయమూర్తి అనగా.. వారు సుముఖంగానే ఉన్నారని, పోలీసులే అనుమతులు ఇవ్వకుండా చేస్తున్నారని రచనారెడ్డి వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే తమ అభిమతమని, అందువల్ల నాగోల్ గ్రౌండ్స్‌లోనే సభ పెట్టుకోవడం మంచిదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అది తమకు సమ్మతి కాదని ఆమె చెప్పగా.. మరో ప్రత్యామ్నాయం లేదంటూ న్యాయమూర్తి నాగోల్‌లో సభకు ఉత్తర్వులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ సమయంలో రచనారెడ్డి, మిగిలిన న్యాయవాదులు కోర్టు హాలులోనే చర్చించుకుని, తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి తెలిపారు. అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ
-
ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ
నగరంలో బుధవారం నాడు తెలంగాణ జేఏసీ నిర్వహించాలని తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అనుమతి లేని ర్యాలీలలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలలో పాల్గొంటే నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. అలాంటి ర్యాలీలో పాల్గొన్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఇందిరా పార్కు వద్దకు ఎవరినీ రావద్దని కూడా ఆయన చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు, నగరంలోని అందరు కమిషనర్లకు కోర్టు ఆదేశాల గురించి చెప్పామని అన్నారు. ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞానకేంద్రం లేదా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలవైపు రావాలని ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తీసుకొస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, మొత్తం యువకుల్లో నలుగురైదుగురు అసాంఘిక శక్తులు చొరబడినా విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కాగా.. రేపు తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్కు సమీపంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మరోవైపు, ఇప్పటికిప్పుడు చెప్పి నాగోలులోని మెట్రో గ్రౌండులో సభ నిర్వహించుకోమంటే ఎలా సాధ్యం అవుతుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు. ఇప్పటికే తమపై వ్యక్తిగత దాడులు మొదలయ్యాయని, ఒక్కరోజే 600 మందిని అరెస్టు చేశారంటే ఇక రేపటి నిర్బంధం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. -
టీజేఏసీది హింసాత్మక చరిత్ర
-
జేఏసీ ర్యాలీకి అనుమతించాల్సిందే: పార్టీలు, సంఘాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతి నిరాకరణపై పలు పార్టీలు, సంఘాలు సోమవారం మండిపడ్డాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనమేమన్నా నియంతృత్వంలో ఉన్నామా అని సీఎల్పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అనుమతి కోసం నిరుద్యోగులు కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితేమిటి? కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు సిగ్గుచేటు’’ అని విమర్శించారు. అనుమతివ్వకపోతే పరిణామాలకు కేసీఆర్‌దే బాధ్యతని హెచ్చరించారు. పోలీసులు కూడా విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. గతంలో ఎవరూ సభలు పెట్టని దూర ప్రదేశాల్లో సభ పెట్టుకోవాలని జేఏసీకి పోలీసులు సూచించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమని సీపీఐ ధ్వజమెత్తింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని, లేదంటే వారికి నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలివ్వగలరో ఒక కేలండర్‌ను ప్రకటించి యువతలో ఆందోళన తగ్గించే చర్యలు చేపట్టాలంది. ఏ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందో, అవే విధానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించడమే మిటంటూ సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ– చంద్రన్న నాయకుడు కె.గోవర్ధన్ తప్పుబట్టారు. ర్యాలీకి అనుమతివ్వాలని మానవ హక్కుల వేదిక ఉభయరాష్ట్రాల అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ డిమాండ్ చేశారు. ర్యాలీకి సర్పంచుల ఐక్యవేదిక, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ మద్దతు ప్రకటించాయి. -
టీజేఏసీది హింసాత్మక చరిత్ర
- నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వడం కుదరదు..హైకోర్టుకు నివేదించిన పోలీసులు - వారి సభకు వామపక్ష ఉగ్రవాద గ్రూపుల మద్దతు ఉంది - మేం సూచించిన ప్రదేశాల్లో సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు - విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ బుధవారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి, బహిరంగ సభకు అనుమ తినివ్వడం సాధ్యం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల సమస్య సృష్టించే ఉద్దేశంతోనే అనుమతి కోరుతున్నారని, అందుకు తాము ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో బహిరంగ సభ నిర్వహించుకుంటా మంటే మాత్రం అందుకు అనుమతినిస్తామన్నారు. ఈ మేరకు పోలీసుల తరఫున అడ్వొ కేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు తెలిపారు. టీజేఏసీ గతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో కూడా టీజేఏసీ ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని, అప్పుడు జంట నగరాల్లో విధ్వంసానికి, హింసకు, ఆస్తి నష్టానికి పాల్పడిందని, ఆ ఘటనల్లో పలువురు ప్రజలు, పోలీసులు గాయపడ్డారని కోర్టుకు వివరించారు. జనాలను పోగుచేసి నగరంలో జనజీవనాన్ని స్తంభింప చేసేందుకు వ్యూహరచన చేశారని, ఇందుకు వామపక్ష ఉగ్రవాద గ్రూపులు కూడా మద్దతు పలికినట్టు తమకు అత్యంత విశ్వస నీయ సమాచారం ఉందని కోర్టుకు నివేదిం చారు. శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకునే.. టీజేఏసీకి నగరంలో ర్యాలీ, బహిరంగ సభకు అనుమతినివ్వడం లేదన్నారు. అంతేకాక సభ నిర్వహిస్తున్నది పనిదినాన అని, దీంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ ఆదివారం రోజున సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏంటని టీజేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డిని ప్రశ్నించారు. దీనిపై జేఏసీ చైర్మన్‌తో మాట్లాడి చెప్పాల్సి ఉందని ఆమె చెప్పడంతో, అయితే మంగళవా రం ఉదయం 10.30 గంటలకు కేసు విచారణ చేపడతామని, అప్పటికల్లా ఆదివారం సభ నిర్వహణపై స్పష్టతనివ్వాలని చెప్పారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వ రరావు ఉత్తర్వులు జారీ చేశారు. సభలో తీవ్రవాద సంఘాలు పాల్గొనే అవకాశం?: ఏజీ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో అనుమతిని ఎం దుకు ఇవ్వకూడదని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించగా సదరు కాలేజీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని ఏజీ అన్నారు. ఇక్కడ సభ నిర్వహణ వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రం గా ఉంటుందన్నారు. ‘‘అసలు ఇవన్నీ కాదు.. సభలో తీవ్రవాద సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉందని మాకు విశ్వస నీయ సమాచారం ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది’’ అని ఏజీ చెప్పారు. సభలో పాల్గొన్న వారు పక్కనున్న భవనాలపై రాళ్లేయవచ్చని, పరిస్థితులు అదుపు తప్పడానికి అదొక్కటి చాలన్నారు. 5 వేల మంది అని వారు చెబు తున్నారని, అయితే, 15 వేల నుంచి 20 వేల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదే శాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని వివరించారు. ఈ సమయంలో రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ తాము రోజంతా సభ నిర్వహించబోమని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకల్లా సభను పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తామన్నారు. స్వామీజీలకు ఎల్బీ స్టేడియం ఇచ్చిన సర్కారు.. తమ సభకు మాత్రం అనుమతినివ్వకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తోందని రచనారెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ... ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు చేయవద్దని సున్నితంగా ఆమెకు సూచించారు. ఉగ్రవాద సంఘాలు పాల్గొంటాయన్నది కేవలం ఆరో పణ మాత్రమేనని, అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తమ గత చరిత్ర ఎన్నడూ హిం సాత్మకం కాదన్నారు. అయితే ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. గతంలో టీజేఏసీ హింసాత్మక ఘటనలకు పాల్ప డిందని, దీనికి సంబంధించి వారిపై 31 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగానే వారికి అనుమతినివ్వడం లేదన్నారు. ఈ సమ యంలో న్యాయమూర్తి పనిదినం రోజున కాకుండా ఆదివారం సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏమిటని రచనా రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పష్టతనివ్వాలం టూ తదుపరి విచారణను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది: జేఏసీ న్యాయవాది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తాము తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ... దరఖాస్తుపై నిర్ణయం వెలువరించడానికి ఇబ్బందేమిటని హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణు గోపాల్‌ను ప్రశ్నించారు. నిర్ణయం వెలు వరిస్తామని ఆయన చెప్పడంతో.. విచార ణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు విచారణ మొదలు కాగానే.. ఇందిరా పార్క్ వద్ద ర్యాలీ, బహిరంగ సభకు అనుమతినివ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాతపూర్వక నిర్ణయం వెలువరించా మంటూ, దానికి సంబంధించిన కాపీని పోలీసుల తరఫున హాజరైన ఏజీ రామకృ ష్ణారెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. ఈ సమయంలో రచనారెడ్డి స్పందిస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాలు, ర్యాలీలు, సభలకు ఉద్దేశించిన ప్రదేశమని అన్నారు. ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరగ కుండా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని స్పష్టమైన హామీనిచ్చినట్లు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఎందరిని ఆహ్వానించారు? చలో హైదరాబాద్ పేరుతో పిలుపునిచ్చినప్పుడు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది కదా..? సంఖ్యపై ఏమైనా స్పష్టత ఉందా..?’’ అని రచనారెడ్డిని ప్రశ్నించారు. సంఖ్యపై నిర్దిష్టంగా చెప్పలేమని, అయితే 5 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని రచనారెడ్డి తెలిపారు. పోలీసులు చూపిన ప్రత్యామ్నాయ ప్రదేశాలు వేరే జిల్లాల్లో ఉన్నాయన్నారు. అవి తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తమ సభకు అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, నెక్లెస్ రోడ్లలో ఎక్కడ సభ నిర్వహణకు అనుమతినిచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. ర్యాలీ వెనుక రాజకీయ ఎజెండా: ఎంపీ బాల్క సుమన్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ వెనుక టీజేఏసీ చైర్మన్ కోదండరాం రాజకీయ ఎజెండా దాగి ఉందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. అందుకే ఆయన అన్ని రాజకీయపార్టీల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కోదండరాం ర్యాలీ వెనక తెలంగాణ వ్యతిరేకశక్తుల హస్తం కూడా ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కొత్తరాష్ట్రంలో ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని, హైదరా బాద్, తెలంగాణ ప్రశాంతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు. -
'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'