తెలంగాణ జేఏసీ బుధవారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి, బహిరంగ సభకు అనుమ తినివ్వడం సాధ్యం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల సమస్య సృష్టించే ఉద్దేశంతోనే అనుమతి కోరుతున్నారని, అందుకు తాము ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో బహిరంగ సభ నిర్వహించుకుంటా మంటే మాత్రం అందుకు అనుమతినిస్తామన్నారు.