Un-reserved
-
అభ్యర్థులు దొరక్కుంటే అన్ రిజర్వుడే
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. -
అన్‌రిజర్వుడ్ టికెట్లకు రైల్వే యాప్
న్యూఢిల్లీ: అన్‌రిజర్వుడు టికెట్లను ఇకపై కౌంటర్లో చాంతాడంత క్యూల్లో నిలబడి కొనాల్సిన జంఝాటం లేకుండా మొబైల్‌ఫోన్ నుంచే కొనేలా ఓ యాప్‌ను రైల్వే శాఖ రూపొందించింది. టికెట్‌ను ప్రింట్ తీసుకోవాల్సిన అవసరంలేకుండా కాగితపురహిత టికెటింగ్‌లో భాగంగా తయారు చేసిన దీన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా టికెట్ బుక్‌చేసుకున్న ప్రయాణికుడు ప్రింట్ అవసరం లేకుండా టీటీఈకి మొబైల్లో టికెట్ సాఫ్ట్‌కాపీని చూపిస్తే సరిపోతుంది. ప్రయాణికులు ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ యాప్‌స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్ వస్తుంది. దీంతో రైల్వే ఈ-వాలెట్‌ను లోడ్చేసుకోవాలి. టికెట్ బుక్‌చేసుకున్నాక డబ్బును ఈ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ లో లేకపోతే టికెట్ కౌంటర్లో చెల్లించొచ్చు.