అన్‌రిజర్వుడ్ టికెట్లకు రైల్వే యాప్ | unreserve a ticket railway App | Sakshi
Sakshi News home page

అన్‌రిజర్వుడ్ టికెట్లకు రైల్వే యాప్

Published Wed, Apr 22 2015 12:54 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

unreserve a ticket railway App

న్యూఢిల్లీ: అన్‌రిజర్వుడు టికెట్లను ఇకపై కౌంటర్‌లో చాంతాడంత క్యూల్లో నిలబడి కొనాల్సిన జంఝాటం లేకుండా మొబైల్‌ఫోన్ నుంచే కొనేలా ఓ యాప్‌ను  రైల్వే శాఖ రూపొందించింది. టికెట్‌ను ప్రింట్ తీసుకోవాల్సిన అవసరంలేకుండా కాగితపురహిత టికెటింగ్‌లో భాగంగా తయారు చేసిన దీన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు.

ఈ యాప్ ద్వారా టికెట్ బుక్‌చేసుకున్న ప్రయాణికుడు ప్రింట్ అవసరం లేకుండా టీటీఈకి మొబైల్‌లో టికెట్ సాఫ్ట్‌కాపీని చూపిస్తే సరిపోతుంది. ప్రయాణికులు ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ యాప్‌స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్ వస్తుంది. దీంతో రైల్వే ఈ-వాలెట్‌ను లోడ్‌చేసుకోవాలి. టికెట్ బుక్‌చేసుకున్నాక డబ్బును ఈ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ లో లేకపోతే టికెట్ కౌంటర్‌లో చెల్లించొచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement