Undavalli Sridevi
-
అది కత్తి పార్టీ అని ముందే తెలీదా!
నలుగురినీ మోసం చేసేవాడు నీతో మంచిగా ఉంటున్నాడంటే దాని అర్థం.. నీతో వాడికి ఏదో అవసరం ఉన్నదని.. అవకాశవాదంతో మాత్రమే నీతో మంచిగా ఉన్నాడని!. ఈ మర్మం తెలియకుండా.. చాలా మంది.. ‘వాడు ఎలాంటి వాడైతే నాకేంటి.. నాతో మంచిగానే ఉంటున్నాడు కదా’ అనే కన్వీనియెంట్ ఆత్మవంచనతో స్నేహాలు చేస్తుంటారు, కొత్తబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ నీతో అవసరం తీరిన తర్వాత.. అవతలివారి నిజస్వరూపం బయటపడిన తర్వాత బుద్ధి వస్తుంది. అప్పటికి సరిదిద్దుకోవడానికి ఏమీ మిగలదు.. ఆ చేదు అనుభవం తప్ప! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఈ వ్యవహారం కూడా అంతే!.ఈ ఉపోద్ఘాతం మొత్తం ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి అతికినట్టుగా సరిపోతుంది. తాడికొండ ఎమ్మెల్యేగా.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి.. అనర్హురాలిగా ప్రకటింపబడిన శ్రీదేవి ఇప్పుడు గొల్లుమంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మోసం చేసి.. చంద్రబాబు పంచన చేరి దొడ్డిదారిలో ఆయనకు చేసిన మేలుకు తనకు తగిన శిక్ష పడింది. ఆమె బహుశా పశ్చాత్తాప పడుతున్నట్లే కనిపిస్తున్నారు. కానీ ఏమిటి ప్రయోజనం? గత జల సేతుబంధనం అంటే ఇదే!. ఇంతకూ ఏం జరిగిందంటే.. సీఎం జగన్ అనుగ్రహంతో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతి దందాను ప్రారంభించారు. ఇసుక దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. పోలీసు అధికారులతో చాలా దురుసుగా మాట్లాడిన ఆడియో రికార్డులన్నీ అప్పట్లో బయటకు వచ్చాయి. తీరు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుదనే ఉద్దేశ్యంతో అక్కడ ఎమ్మెల్యేగా ఆమెను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ను మార్చారు. దీంతో, ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసి, వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేశాక.. పదవిలో మాత్రం కొనసాగారు. ఇటీవల స్పీకర్ ఆమెను అనర్హురాలిగా కూడా ప్రకటించారు. అయితే.. తెలుగుదేశానికి దొడ్డిదారిలో చేసిన ఫేవర్‌కు ప్రతిఫలంగా ఆమె తిరువూరు ఎమ్మెల్యే లేదా, బాపట్ల ఎంపీ సీటును ఆశించారు. కానీ.. ఆమెతో అవసరం తీరిపోయినందున చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఆ రెండు స్థానాలనూ వేరే వారికే కేటాయించేశారు.ఈ ఘటనలతో శ్రీదేవికి జ్ఞానోదయం అయింది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’ అంటూ హ్యాష్ ట్యాగ్ బాపట్ల అని ఒక కత్తి బొమ్మతో సహా ఆమె ట్వీట్ చేశారు. ఇక్కడ కత్తి బొమ్మకు అర్థమేమిటి అనేదే చర్చ. బాపట్ల టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనేది ఆమె ఉద్దేశం కావొచ్చునని ట్వీటు చూసిన వారి ఊహ. తెలుగుదేశం వెన్నుపోటుల కత్తిపార్టీ అని కూడా ఆమె ఆగ్రహించి ఉండవచ్చు. అయితే, అది కత్తి పార్టీ అనే సంగతి ముందే తెలియదా అని, మామను కూలదోసి పార్టీని కబ్జాచేసిన చంద్రబాబు వెన్నుపోటులకు బ్రాండ్ అంబాసిడర్ అని తెలియదా? అంటూ రకరకాలుగా ఇప్పుడు ప్రజలు ఆమె ట్వీట్‌పై కామెంట్ చేసుకుంటున్నారు. అయినా కత్తి బొమ్మతో నిరసన తెలియజెప్పే హక్కు ఆమెకు లేదని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌ను వెన్నుపోటు పొడిచిన ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.-వంశీకృష్ణ -
నలుగురికీ చివరి అవకాశం ఈసారి విచారణకు రాకపోతే
-
ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి..
సాక్షి, అమరావతి: YSRCPతరపున 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇవ్వాళ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి సస్పెన్షన్‌కు గురయిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇప్పుడు ముసుగు తీసి టిడిపిలో చేరబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్న వైసిపి ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ ఢీలా పడడం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధోపాతాళానికి పడిపోవడంతో చంద్రబాబు పక్కచూపులు చూస్తున్నారు. 52 రోజులు జైల్లో గడిపిన సమయంలో పార్టీ యావత్తు నిద్రావస్థలోకి వెళ్లిపోవడంతో.. అప్పటికప్పుడు పవన్‌తో జైలు నుంచే పొత్తు ప్రకటించారు. అయినా పార్టీ కోసం ముందుకొచ్చే వాళ్లు లేకపోవడం పక్కచూపులు చూస్తున్నారు. YSRCP నుంచి సస్పెన్షన్‌కు గురయిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇద్దరిని ఇవ్వాళ పార్టీలో చేర్చుకోబోతున్నాడు చంద్రబాబు. వీరిద్దరికి టికెట్లు ఇస్తారా? లేక వెన్నుపోటేనా అన్నది త్వరలోనే తేలనుంది. ఉండవల్లి, ఆనం.. దొందు దొందే అధికారం ఇచ్చిన పార్టీకే అనాయ్యం చేయాలని చూసి.. స్వప్రయోజనాల కోసం దిగజారిపోయి.. చంద్రబాబుకు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ. తిన్నింటి వాసాలు లెక్కపెట్టాలని చూశారు.. నమ్మించి వెన్నుపోటు పొడవాలని చూశారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్ ఉల్లంఘించినందుకు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. రహస్యంగా టీడీపీకి ఓటు వేసి దొరికిపోయిన వీరిని, వైఎస్సార్సీపీ నాయకత్వం సమర్దంగా కోడింగ్ ను అమలు చేసి వారిని ఇట్టే పట్టేసింది. వారిని అంతకుముందే పిలిచి వచ్చే శాసనసభ ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ఆశపెట్టడంతో వాటికి లొంగి పోయారు. -
ఉండవల్లి శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ ముస్లిం లీడర్లు ఫైర్
-
ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై మంత్రి మేరుగ నాగార్జున రియాక్షన్
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నుదన్నుగా ఉంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పచ్చ పత్రికలో పిచ్చి రాతలు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ లైన్లో నడుస్తున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం ఆమె మాట్లాడుతున్నారు’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టొద్దు. ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు. ఆమె హైదరాబాద్‌లో కూర్చుని మాపై విమర్శలు చేస్తోంది. మా పార్టీ నాయకుడి చెమట చుక్కలతో గెలిచావ్. మాట్లాడితే దళిత మహిళనంటావ్. నువ్వు తప్పు చేసి దళిత మహిళనంటే సరిపోతుందా. ఏం తప్పుచేశావ్.. నియోజకవర్గంలో నువ్వేం చేశావో అందరికీ తెలుసు. శ్రీదేవి తప్పు చేసి సమర్థించుకునే యత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావట్లేదు. తప్పు చేసిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చదవండి: చంద్రబాబు, అచ్చెన్నా, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్ -
అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ!
ఆంద్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చూడండి. ఇక మీడియా పరిస్థితి అయితే నానాటికి నాసిరకంగా మారుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఓటు అమ్ముకుంటే, అమ్ముకున్నవారిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చేవి. చివరికి ఓటును విక్రయించారన్న ఆరోపణలు ఎదుర్కునేవారు సిగ్గుతో తలవంచుకునే విధంగా వార్తా కథనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో గమనించండి. ఓటు అమ్ముకున్నవారికి మద్దతుగా పేజీలకు, పేజీల వార్తలు వండి వార్చుతున్నారు. అబ్బో.. తాము విలువలకు కట్టుబడి ఉన్నామని పోజులిచ్చిన రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అయితే మరీ అరాచకంగా తయారైంది. ప్లేట్ పిరాయించిన ఈనాడు జర్నలిజాన్ని గాలికి వదలివేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎలాగోలా వ్యతిరేకత పెంచాలన్న నీచ మనస్తత్వంలో ఉన్న ఈనాడు పత్రిక పూర్తిగా దిగజారిపోయినట్లు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటోంది. ఏపీలో ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన విషయాన్ని ఆ పత్రికే కథనాలుగా ఇచ్చింది. దానిపై డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో తెలుగుదేశం పార్టీ ఇరుకునపడింది. అంతే .. ఈనాడు కూడా ప్లేట్ పిరాయించేసింది. తాము వైఎస్సార్సీపీకే ఓటు వేశామని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెబితే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇచ్చారు. అంతేకాక ఆ ఎమ్మెల్యేలు నలుగురు ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తే దానిని పటం కట్టి ప్రచురించారు. అంతే తప్ప.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నదానిపై వార్తలు ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, భూతద్దంలో వెదికి రాసే ఈనాడుకు ఇంత పెద్ద డీల్ గురించి తెలియకపోవడం అంటే వారి అసమర్దత అనుకోవాలా? లేక అవినీతిని సమర్ధించడం అనాలా? తనకు కూడా టీడీపీ డబ్బు ఆఫర్ ఇచ్చిందని, తాను ఒప్పుకుంటే పది కోట్లు వచ్చి ఉండేవని, తనకు సిగ్గు,శరం ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేదని చెప్పిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనను మాత్రం ఒక చిన్నపేరాగా ఎక్కడో లోపల పేజీలో కనబడి, కనబడనట్లుగా ప్రచురించారు. దీనిని బట్టి ఈనాడు అవినీతిపరుల వైపు నిలబడడానికి కంకణం కట్టుకుందని తేలడం లేదా! పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వాదన ఇవ్వదలిస్తే ఇవ్వండి.. తప్పు లేదు. కాని అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరం గురించి మరో ఎమ్మెల్యే చేసిన ప్రకటనకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి కదా! అలాగే వాస్తవం ఏమిటో పాఠకులకు తెలియచేయాలి కదా! తను భుజాన వేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే అది ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమర్దతగా, చాతుర్యంగా అభివర్ణించే అధమస్థాయి ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5వంటి మీడియా సంస్థలు రావడం అత్యంత హేయంగా కనిపిస్తుంది. అదే పని కనుక మరే పార్టీ అయినా చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈ ఎల్లో మీడియా కాని గగ్గోలుగా ప్రచారం చేసి ఉండేవారు. తమకు పదహారు మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నాయకత్వం చెబితే అది గొప్ప విషయంగా ఈ మీడియా భావించింది. అంతే తప్ప.. అదేమిటి? అలాంటివాటిని ఎందుకు ప్రోత్సహిస్తారు.. అని ప్రశ్నించలేదు. గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గబ్బు పట్టిన తెలుగుదేశానికి ఇంకా గుణపాఠం రాకపోవడంపై ఆ మీడియా ప్రశ్నించలేదు. పైగా బలం లేకపోయినా టిడిపి అభ్యర్ది గెలిచారంటూ చంకలు గుద్దుకుంటూ ఈ మీడియా సంబరపడిపోయింది. సుద్దులు చెప్పి.. ఇప్పుడేంటి ఇంత దారుణంగా.. రామోజీరావు విలువల గురించి ఎన్ని సుద్దులు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యేల తీరుతెన్నుల గురించి ధర్మోపన్యాసం చేసిన రామోజీరావు ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలకు మద్దతు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నారు. మరో మీడియా అధినేత గురించి చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఇలాంటి బ్రోకర్ పనులు చేయడంలో ఆయన ఆరితేరారని ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నదే. ఈసారి కూడా ఆయన తన వంతు పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఆయనను పెద్దగా సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కాని ఈనాడు మీడియా మోసపూరిత విధానాలపై మాత్రం మాట్లాడుకోక తప్పదు. సస్పెండైన ఎమ్మెల్యేలు ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు నలుగురు కూడా తాము వైఎస్సార్సీపీ సూచించిన అభ్యర్దులకే ఓటు వేశామని చెబుతుండడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. మీడియా ముందు తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెబితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. పైగా వీరు డబ్బుకు అమ్ముడుపోయారన్నది నిర్ధారణగా మారి ప్రజలు మరింత ఈసడించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తాము అమ్ముడుపోలేదని చెప్పుకుంటూనే వైఎస్సార్సీపీని విమర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నిజంగానే వీరు పార్టీకి ద్రోహం చేయకుండా ఉన్నట్లయితే , తాము ఎక్కడా పొరపాటు చేయలేదని, పార్టీ తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందని చెప్పేవారు. కాని వారిలో ఆ ధైర్యం కొరవడింది. అపరాధ భావనను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అయినా ఆనం రామనారాయణరెడ్డి తనకున్న రాజకీయ అనుభవంతో బాగానే నటించగలిగారు. ఆయన మొన్నటిదాకా సీఎం జగన్‌ను ఎలా మెచ్చుకున్నారు? ఇప్పుడు ఎంత ఘోరంగా విమర్శిస్తున్నారు? 2014లో రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ వైపునకు వెళ్లి, ఆ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారేమో తెలియదు కాని, 2019 ఎన్నికల నాటికి వైఎస్ జగన్‌ను ఆశ్రయించి వెంకటగిరి టిక్కెట్ పొందారు. ఆ కృతజ్ఞతను కూడా ఆనం మిగుల్చుకోకపోవడం విషాదం. తండ్రి దారిలోనే ఆనం... ఆనం ఇంతవరకు మూడుసార్లు టీడీపీలోకి ,రెండుసార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలోకి మారారు. తమకు ఎంతో చరిత్ర ఉందని ఆయన చెబుతున్నారు. నిజమే..ఆయన తండ్రి ఆనం వెంకటరెడ్డికి కూడా ఇలాగే ఫిరాయింపులు చేసిన చరిత్ర ఉంది. దానిని రామనారాయణ కూడా అనుసరిస్తున్నట్లుగా ఉంది. వచ్చేసారి బీజేపీ, జనసేన, టీడీపీ లలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో కాని, బయటకాని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగనన్న అంటూ ఎన్ని కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అమరావతి రాజధాని గురించి ఇంతకాలం ఏమి మాట్లాడింది.. ఇప్పుడు ఏమి మాట్లాడుతోంది.. వింటే నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందంటే ఇదేనేమో అనిపిస్తుంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వెలుగులోకి వచ్చాయి. ఈమె తన ఓటును టిడిపికి వేయడానికి ముందుగా ఎవరెవరి ద్వారా రాయబారాలు సాగించారన్న అంశంపై కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బయటపడిపోయినందున ఆయన ఏమన్నా పట్టించుకోనవసరం లేదు. మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై ఇటీవలికాలంలో వచ్చిన ఆరోపణలు, దానికి ఆయన ఆత్మరక్షణలో పడిన తీరు మొదలైనవి చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా, జనం నమ్మే పరిస్థితి లేదు. వీరంతా ఒక వైపు తాము వైసిపికే ఓటువేశామని చెబుతూనే , మరో వైపు వైసిపిని విమర్శిస్తున్న వైనాన్ని బట్టి వీరు ఏమి చేసింది అర్ధం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయ నేతలు విలువలు పాటించడం లేదని సంపాదకీయాలు రాసే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు సైతం అంతకన్నా ఘోరంగా , చివరికి అమ్ముడుపోయారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వడం జర్నలిజం విలువలను నిలువెత్తు గోతిలో పాతిపెట్టడమే.రాపాక వరప్రసాద్ చెబుతున్నట్లు ఈ మీడియా కూడా సిగ్గు,శరం వదలివేశాయని అనుకుంటే తప్పేముంటుంది? -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
ఆ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
నగరి (చిత్తూరు జిల్లా)/సాక్షి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం రూరల్/కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్నారు. ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందన్నారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం వేర్వేరుచోట్ల మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అది: తానేటి వనిత శ్రీదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరంలో అన్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శ్రీదేవికి వైఎస్సార్సీపీ చాలా గౌరవం, గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసిన వారి పక్షానే శ్రీదేవి చేరిందని ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ప్రయత్నిస్తానని శ్రీదేవి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆమె తెలంగాణ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. శ్రీదేవి వ్యాఖ్యలు విడ్డూరం: ఆదిమూలపు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా శ్రీదేవి వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం దళితులను అవమానిస్తోందని శ్రీదేవి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులను అక్కున చేర్చుకున్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని, దళితులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని సురేష్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. వారికి పట్టిన గతే వీరికి: నారాయణస్వామి సీఎం జగన్ అండతో గెలిచి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకూ పడుతుందన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు జైలు కూడు తప్పదన్నారు. వారికి రాజకీయంగా పుట్టగతులుండవు: రోజా సీఎం జగనన్న అండతో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కదారి పట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని రోజా అన్నారు. నీచ రాజకీయాలతో నాలుగు సీట్లు గెలిచి ఏదో సాధించినట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే తాటాకు చప్పుళ్లకు భయపడ్డానికి జగనన్న కుందేలు కాదు సింహమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఏనాడు న్యాయంగా రాజకీయం చేయలేదన్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనగలడేమోగానీ.. కోట్లాదిమంది ప్రజల గుండెల్లో జగనన్నకు ఉన్న అభిమానాన్ని కొనలేడన్నారు. 2019 మాదిరిగానే 2024లో కూడా జగనన్న అదే రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు. ఉండవల్లి శ్రీదేవి కాదు.. ఊసరవెల్లి శ్రీదేవి: అమర్నాథ్ ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగిస్తూనే ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో అన్నారు. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురుతో వచ్చి సీఎం జగన్‌తో ఫొటో కూడా తీయించుకుని సినీనటి శ్రీదేవిని మైమరిపించేలా నటించారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటువేసి.. ఇప్పుడు దళిత కులం కార్డు అడ్డుపెట్టుకుని అందరి మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ముడుపులు తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తురాలేదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనేకన్నా.. ఊసరవెల్లి శ్రీదేవి అనడం బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. -
స్వప్రయోజనాల కోసం దిగజారే బాబు వల్లే శ్రీదేవికి హాని
సాక్షి, అమరావతి: ‘క్రాస్ ఓటింగ్ చేయలేదని, ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్ చేశారు. ఆమె సవాల్‌ను స్వీకరిస్తున్నా. శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవం. ఆమె అమ్ముడుపోయి టీడీపీకి ఓటు వేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా’ అని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. మహిళలను గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని.. తమ వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదన్నారు. స్వప్రయోజనాల కోసం ఎంతవరకైనా దిగజారే చంద్రబాబు వల్లే ఆమెకు హాని పొంచి ఉంటుందన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడారు. ‘నిజంగా తప్పు చేయకపోతే.. ధైర్యంగా నిలబడొచ్చు కదా? మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు? టీడీపీ స్క్రిప్ట్ ఇప్పుడే అందిందా?’ అని ఉండవల్లి శ్రీదేవిని సురేశ్ ప్రశ్నిం చారు. సీఎం జగన్ చాలా గొప్ప వ్యక్తి అని మీడియాతో చెప్పారు కదా.. మరి అలాంటి వ్యక్తిని మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచి్చంది? అని మండిపడ్డారు. చేసిన తప్పు పనికి, కులానికి సంబంధమేంటని ప్రశ్నిం చారు. ఓటు అమ్ముకోమని అంబేడ్కర్ ఏమైనా చెప్పారా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఓటు అమ్ముకోవడం వాస్తవమని.. ఎవరితో ఎక్కడ, ఎలా రాయబారాలు చేసిందో తమకు తెలుసన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహించాలంటూ శ్రీదేవి ఆరోపించడం దారుణమని మండిపడ్డారు. ఆమెకు ప్రమాదం పొంచి ఉందంటే.. అది కచ్చితంగా టీడీపీ వల్లే అని చెప్పారు. అందుకే శ్రీదేవికి పటిష్ట భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. జగన్ ప్రభుత్వం వల్లే దళితులకు ఎంతో మేలు.. సీఎం జగన్ పాలనలో దళితులకు ఎంత మేలు జరుగుతోందో అందరికీ తెలుసని ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఎస్సీలకు ప్రాధాన్యం కలిగిన మంత్రి పదవులు ఇచ్చారా? దళితులను హోం మంత్రి చేశారా? అని ప్రశ్నిం చారు. అమరావతిలో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుతున్న శ్రీదేవి.. గతంలో అమరావతి అంశం గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. అలాగే మిమ్మల్ని ఉద్దేశించి టీడీపీ వాళ్లు ఏమన్నారో కూడా గుర్తు చేసుకోవాలన్నారు. మీదంతా మేకప్.. ప్యాకప్.. మీరెప్పుడూ బ్యూటీ పార్లర్లలో ఉంటారంటూ టీడీపీ వాళ్లు దిగజారి చేసిన మాటలు గుర్తున్నాయా? అని ప్రశ్నిం చారు. గతంలో చంద్రబాబును నమ్మి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు కూడా సరిగ్గా అక్కడే, అలాగే ఉంటారని చెప్పారు. స్కామ్‌లంటూ శ్రీదేవి ఆరోపిస్తున్న వాటిపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు. -
శ్రీదేవి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఫైర్
తాడికొండ (గుంటూరు): తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఆదివారం తుళ్లూరు తులసీ థియేటర్ ఎదుట నాయకులు, కార్యకర్తలు శ్రీదేవి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్‌ను స్వీకరిస్తున్నాం. దమ్ముంటే అమరావతి గడ్డపై అడుగుపెట్టు. నిన్ను నమ్మి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పు’ అంటూ నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అమరావతి గడ్డపై ప్రమాణం చేస్తానంటున్న శ్రీదేవి హైదరాబాద్ వెళ్లి ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. తాడికొండ నియోజకవర్గంలో దళితుల ఆత్మగౌరవానికి శ్రీదేవి భంగం కలిగించారని మండిపడ్డారు. ‘భర్తను గన్మెన్లతో కొట్టించిన ఘనురాలు’ పార్టీ నాయకుడు మేకల రవి మాట్లాడుతూ.. తనకు శ్రీదేవి రూ.1.40 కోట్లు ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని గతంలో విలేకరుల సమావేశం ద్వారా అందరికీ చెప్పినా కనికరించలేదన్నారు. శ్రీదేవికి ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఇద్దరు అని నమోదు చేసిందన్నారు. భర్త శ్రీధర్‌ను గన్మెన్లతో కొట్టించిన ఘనురాలు అన్నారు. శ్రీదేవి అక్రమాలపై ఒక ఫైల్ తయారు చేసిన ఆమె భర్త శ్రీధర్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిన శ్రీదేవికి ప్రజల్లో ప్రాధాన్యత తగ్గడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయి నీతులు చెబుతోందన్నారు. ‘ఏబీఎన్ రాధాకృష్ణ మధ్యవర్తిత్వంతో టీఎస్09 ఎఫ్ఎస్ టీఎల్ఆర్ 8876 కారులో నీ కూతురు చంద్రబాబు ఇంటికి వెళ్లలేదా? కిషోర్‌రెడ్డి, బొల్లినేని రామారావు, సుజనా చౌదరి నేతృత్వంలో చంద్రబాబు ఇంటివద్ద రూ.4.50 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నది నిజం కాదా? అని మేకల రవి నిలదీశారు. శ్రీదేవి అమ్ముడు పోయిందనడానికి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఫొటోలు, సీసీ ఫుటేజి ఆధారాలను త్వరలో డీజీపీకి, మీడియాకు అందజేస్తానని తెలిపారు. -
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లుంది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
అమరావతి రైతులది రాజకీయ యాత్ర
తాడికొండ: అమరావతి రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదని, అది రాజకీయ యాత్ర అని తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అమరావతి రైతుల పేరుతో తన హయాంలో జరిగిన అవినీతిని కాపాడుకోవాలని, చతికిలపడిన టీడీపీని బతికించుకోవాలని కొత్త ఎత్తుగడ వేశాడన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే వారిని నడిపిస్తుంది చంద్రబాబేనని చెప్పారు. 29 గ్రామాల్లో కొనసాగుతున్న అమరావతి ఉద్యమానికి ఓ సామాజికవర్గం మినహా ఇతర కులాల్లో ఆదరణ కొరవడటంతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు చంద్రబాబు పాదయాత్ర పెట్టించి పెయిడ్ ఉద్యమాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొట్టించడం సిగ్గుచేటని విమర్శించారు. అమరావతి రైతులు యాత్ర చేయాల్సింది తుళ్ళూరు నుంచి తిరుపతికి కాదన్నారు. మూడు పంటలు పండే భూమిని తీసుకుని ఈ ప్రాంత రైతులను నిలువునా ముంచి ఉండవల్లిలో ఉంటున్న చంద్రబాబు నివాసానికి వెళ్లి తాత్కాలికం పేరిట ఎందుకు దోపిడీ చేశాడో నిలదీయాలని సూచించారు. నీరుగారిన అమరావతి ఉద్యమాన్ని జాకీలు పెట్టి లేపేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు వేస్తున్న ఎత్తులను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని కుస్తీపట్లు పట్టినా జనం చంద్రబాబును నమ్మేస్థితిలో లేరన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేసి మూడు రాజధానులకు శ్రీకారం చుడితే చంద్రబాబు కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించి స్టేలు తీసుకొచ్చాడని చెప్పారు. అమరావతి రైతులతో చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా రాజధాని ముఖద్వార రహదారి నిర్మాణానికి రూ.120 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. రాజధాని రైతులు చంద్రబాబు మాటలువిని మోసపోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవిస్తే తప్పక మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. -
త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం: ఎమ్మెల్యే శ్రీదేవి
-
‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’
హైదరాబాద్/తాడికొండ: అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఏబీఎన్ చానెల్ అధినేత రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్మీ’ అని చంద్రబాబు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా దొరికినప్పుడు దాన్ని ప్రసారం చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి చానెల్లో వాటా ఉండటమే దీనికి కారణమన్నారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు బాగా అర్థమవుతోందన్నారు. మీ చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు.. చదువుకోరు అని కించపరిచారని గుర్తుచేశారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్సైట్లో పెడితే మీరు బాధపడరా అని రాధాకృష్ణను ప్రశ్నించారు. ‘ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోండి. నాకు వైఎస్ జగన్ రాజకీయ భిక్ష పెట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుంది’ అని శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు. -
నాపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది