
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుదన్నుగా ఉంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పచ్చ పత్రికలో పిచ్చి రాతలు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ లైన్‌లో నడుస్తున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం ఆమె మాట్లాడుతున్నారు’’ అని మంత్రి దుయ్యబట్టారు.
‘‘తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టొద్దు. ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు. ఆమె హైదరాబాద్‌లో కూర్చుని మాపై విమర్శలు చేస్తోంది. మా పార్టీ నాయకుడి చెమట చుక్కలతో గెలిచావ్. మాట్లాడితే దళిత మహిళనంటావ్. నువ్వు తప్పు చేసి దళిత మహిళనంటే సరిపోతుందా. ఏం తప్పుచేశావ్.. నియోజకవర్గంలో నువ్వేం చేశావో అందరికీ తెలుసు. శ్రీదేవి తప్పు చేసి సమర్థించుకునే యత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావట్లేదు. తప్పు చేసిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
చదవండి: చంద్రబాబు, అచ్చెన్నా, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్
Comments
Please login to add a commentAdd a comment