under-16 cricket
-
Vijay Merchant Trophy: అండర్–16 టోర్నీలో ద్రవిడ్ vs సెహ్వాగ్
సాక్షి, మంగళగిరి: సడెన్‌గా చూస్తే అండర్–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు. ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక అండర్–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్ ద్రవిడ్ (ద్రవిడ్ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్ సెహ్వాగ్ (సెహ్వాగ్ పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు. దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్ కీపర్, కెపె్టన్ అన్వయ్ (0) డకౌటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ (98 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్ ద్రవిడ్ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్ పైచేయి సాధించాడు. -
కాంపౌండర్ కొడుకు.. దుమ్మురేపుతున్నాడు!
మధ్యప్రదేశ్‌లో ఓ చిన్న ఊరు.. రత్లాం. అక్కడ పుట్టిన ఓ కాంపౌండర్ కొడుకు దేశవిదేశాల్లో దుమ్ము రేపుతున్నాడు. అశుతోష్ శర్మ అనే ఆ పదహారేళ్ల కుర్రాడు ప్రస్తుతం అండర్-16 విభాగంలో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ఆటలో మాత్రం దూసుకెళ్లిపోతున్నాడు. మధ్యప్రదేశ్ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అశుతోష్.. త్వరలోనే టీమిండియా బ్లూ జెర్సీ వేసుకోవాలని తహతహలాడుతున్నాడు. గత సంవత్సరం జరిగిన బంగ్లాదేశ్ పర్యటనలో అశుతోష్ తన బ్యాటింగ్‌తో దిగ్గజాల దృష్టిని ఆకర్షించాడు. తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తర్వాత మధ్యప్రదేశ్ తరఫున అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడి 600 పరుగులు చేశాడు. ప్రస్తుతం అశుతోష్ క్రిస్టియన్ ఎమినెంట్ స్కూల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఆటతో పాటు చదువుమీద కూడా దృష్టి పెడుతున్నానని, రోరజుకు ఆరు గంటలు చదువుతున్నానని చెప్పాడు. -
రాణించిన ప్రగూన్
ఫైనల్లో సెయింట్ జాన్స్ జట్లు ఎఫ్సీఏ అండర్-16 క్రికెట్ సాక్షి, హైదరాబాద్: ప్రగూన్ దుబే (60 బంతుల్లో 73 నాటౌట్, 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో సెయింట్ జాన్స్ (గ్రీన్) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో కూడా సెయింట్ జాన్స్‌కు చెందిన రెడ్ జట్టే గెలవడంతో టైటిల్ పోరు ఈ జట్ల మధ్య జరగనుంది. క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్సీఏ) అండర్-16 క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సెయింట్ జాన్స్ ఫౌండేషన్ జట్టు 8 వికెట్ల తేడాతో రాబిన్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌పై ఘనవిజయం సాధించింది. మొదట రాబిన్ స్పోర్ట్స్ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సయ్యద్ అఫ్జల్ (76) అర్ధసెంచరీ సాధించగా, ఫహీమ్ 35 పరుగులు చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ జాన్స్ (గ్రీన్) జట్టు 22.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. ప్రగూన్‌తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (47) రాణించాడు. రెండో సెమీఫైనల్లో సెయింట్ జాన్స్ (రెడ్) జట్టు 8 వికెట్ల తేడాతో ఎస్‌కేఎన్‌సీఏ జట్టుపై గెలిచింది. మొదట ఎస్కేఎన్ జట్టు 28.4 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. జైదేవ్ (62) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. సెయింట్ జాన్స్ బౌలర్లలో భగత్, మిఖిల్ జైస్వాల్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ జాన్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. భగత్ (51) బ్యాటింగ్‌లోనూ రాణించాడు.