Underground drainage system
-
ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం సమీక్షించారు. అక్రమ కట్టడాలతో దుర్భర పరిస్థితులు... వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో అంతా చూస్తున్నామని, కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నగరాల్లో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని, మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదన్నారు. వరదనీరు ప్రవహించే మార్గాల్లో అక్రమ నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయని, కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలతో మనమే సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పైగా వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా కూడా రాదని, చట్టాలు కూడా దీనికి అంగీకరించవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలు, సామాన్యుల పట్ల ఉదారంగా వ్యవహరించి, వారికి కావాల్సిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలంగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు సమస్యలు తీర్చేలా సచివాలయాలు.. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదని, వీటి విషయంలో వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, విద్యుత్తు, రేషన్‌కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ లాంటివి సమకూర్చే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేలా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండాలన్నారు. ఎలాంటి విజ్ఞప్తులు అందినా పరిష్కరించేలా ఉండాలని పేర్కొన్నారు. ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి, మంగళగిరిని ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లి, మంగళగిరిలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని, తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, భూగర్భ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు తదితర మౌలిక వసతులతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని సీఎం సూచించారు. పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆదర్శ మున్సిపాల్టీలు సాధ్యమన్నారు. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాల్లో లంచాల పేరు కూడా వినపడకూడదని హెచ్చరించారు. ఏ పౌరుడూ, ఏ బిల్డరూ లంచం ఇచ్చి పనులు చేయించుకునే దుస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. కరకట్ట పేదలకు ఉచితంగా ఇళ్లు... కృష్ణా నది కట్టమీద, కరకట్ట లోపల, కాల్వ గట్ల మీద నివసిస్తున్న వారికి ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఉగాది నాటికి వారికి పట్టాలు ఇచ్చి మంచి డిజైన్‌తో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. వారి సమస్యను శాశ్వతంగా తీర్చాలన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర స్థలం కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. ఎక్కడో దూరంగా కాకుండా వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, నదీ పరీవాహక చట్టాల అమలు కారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. బకింగ్ హాం కెనాల్ కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని కాల్వ గట్లపై విస్తారంగా చెట్లను పెంచాలన్నారు. -
పట్టణానికి పట్టం !
* మూడంచెల వ్యూహంతో తుమ్మల కమిటీ నివేదిక * అభివృద్ధికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన * ఏడాదిలో పూర్తయ్యే పనులకు రూ. 565.35 కోట్లు అవసరమని అంచనా * రూ.126 కోట్లతో మున్సిపాలిటీలకు కొత్త వాహనాలు * లక్షకుపైగా జనాభాగల 8 పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ * ఏక రూప నమూనాలతో మార్కెట్లు, శ్మశానాలు, కార్యాలయ భవనాల నిర్మాణం ‘చెత్త’కు పర్యాయపదంగా మారిన పురపాలక సంస్థలను గాడిలో పెట్టి.. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అనుసరించనుంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, జంక్షన్ల విస్తరణ నుంచి మున్సిపల్ ఉద్యోగులకు ఏకీకృత సర్వీసు రూల్స్ దాకా వివిధ అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. పురజనులకు సౌకర్యాల కోసం చేయాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి.. మూడు నెలలు, ఏడాది, ఐదేళ్ల వ్యవధిలో పూర్తిచేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను చేపట్టాలని సూచించింది. కొత్త ఒరవడికి ప్రణాళిక.. పురపాలన, పట్టణాభివృద్ధి అంశాలపై అధ్యయనం కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి టి.శ్రీనివాస్‌గౌడ్‌లతో గత నెల 14న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ... తాజాగా ప్రభుత్వానికి అధ్యయన నివేదికను సమర్పించింది. పురపాలనలో మూస విధానాలకు స్వస్తి పలుకుతూ... కొత్త ఒరవడిని సృష్టించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలు, నిధులు, నిధుల సమీకరణ మార్గాలు, కాలం చెల్లిన పురపాలక చట్టాలకు సవరణలు తదితర అంశాలను తమ నివేదికలో క్రోడీకరించింది. ఏడాదిలోపు వ్యవధిలో అమలుచేయాల్సిన స్వల్ప కాలిక ప్రణాళికల కోసం రూ. 565.35 కోట్లు అవసరమని తేల్చింది. ఒకటి నుంచి ఐదేళ్ల వ్యవధిలో అమలుచేయాల్సిన మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలకు అయ్యే వ్యయాన్ని తేల్చేందుకు అధ్యయనం జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. స్వల్పకాలిక ప్రణాళికలు వేసవి వస్తే పలు పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోంది. నీటి సరఫరా పథకాల మరమ్మతుల కోసం రూ. 21.16 కోట్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ. 15.22 కోట్లు కేటాయించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు జంక్షన్ల అభివృద్ధి కోసం రూ. 25 లక్షలు, మున్సిపాలిటీల్లో మూడు జంక్షన్ల అభివృద్ధి కోసం రూ. 10 లక్షలు చొప్పన మొత్తం రూ.7.55 కోట్లు కేటాయించాలి. మౌలిక వసతుల అభివృద్ధిపై కమిటీ సూచనలు మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు - నీటి సరఫరా పరిమాణాన్ని మున్సిపాలిటీల్లో రోజుకు ఒక్కొక్కరికి 60 లీటర్ల నుంచి 135 లీటర్లకు, కార్పొరేషన్లలో 100 నుంచి 150 లీటర్లకు పెంచాలి. నీటి సరఫరా నిర్వహణ, అమలు వ్యయాన్ని తగ్గించుకొంటూనే... మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే విధంగా నీటి చార్జీలు నిర్ణయించాలి. - మున్సిపాలిటీల్లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు లక్షకుపైగా జనాభా గల పట్టణాలకు రవాణా ప్రణాళికలను తయారుచేయాలి. సీఎం హామీ మేరకు 5 మున్సిపాలిటీలకు రింగ్రోడ్లను నిర్మించాలి. - లక్షకు పైగా జనాభా గల 8 నగరాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. వర్షాకాలంలో నీరంతా వెళ్లిపోయేలాగా డ్రైనేజీల వ్యవస్థను బాగు చేయాలి. నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణ, తరలింపు కోసం రూ. 126.87 కోట్లతో పరికరాలు/వాహనాలను కొనుగోలు చేయాలి. సామాజిక సౌకర్యాలు స్వల్పకాలిక ప్రణాళికలు(ఏ) - 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లోని 3,34,630 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు వ్యయంగా నిర్ణయించగా... కేంద్రం రూ. 4 వేల చొప్పున ఇస్తోంది. మిగతా రూ. 11 వేలలో లబ్ధిదారువాటా రూ. 3 వేలుపోగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 వేలు చెల్లించాలి. దీనికి నాలుగేళ్లలో రూ. 267.70 కోట్లను కేటాయించాలి. రూ. 51.8 కోట్లతో 1,038 సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలి. - రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 18 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం లో మార్కెట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 10 లక్షల మీటర్లకే పరిమితమయ్యాయి. ఈ మార్కెట్ల ఆధునీకీకరణ కోసం రూ. 108 కోట్లు అవసరం. ఇక పట్టణాల్లో 112 జంతు వధశాలలు నిర్మించాల్సి ఉంది. - కబ్జాలు, సౌకర్యాల లేమితో పట్టణ ప్రాంత శ్మశాన వాటికలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిలో సౌకర్యాల కోసం లక్షలోపు జనాభా గల పట్టణాలకు రూ. 15 లక్ష లు, లక్షపైన జనాభా గల పట్టణాలకు రూ. 25 లక్షల చొప్పున మొత్తంగా రూ. 11.30 కోట్లు ఇవ్వాలి. కొత్త శ్మశానాల నిర్మాణం కోసం రూ. 71.70 కోట్లు కేటాయించాలి. - కొత్తగా ఏర్పడిన 25 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ. 2 కోట్లు చొప్పున రూ.50 కోట్లు కేటాయించాలి. ఇక రాష్ట్రం లోని మున్సిపాలిటీల్లో 1,949 ఖాళీ స్థలాలు ఉండగా.. 1,448 స్థలాలకు రక్షణ లేదు. వాటికి ప్రహరీ గోడలను నిర్మించేందుకు రూ.60 కోట్లు అవసరంకాగా.. తొలివిడత కింద రూ. 10 కోట్లు ఇవ్వాలి. -
జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ప్రగతినగర్ :జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూ పొందిస్తున్నామని పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇందుకోసం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్‌తో కలిసి సమష్టి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. గత పాల కుల ని ర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ అభివృద్ధి కుం టుపడిందన్నారు. 1974 సంవత్సరంలోనే నిజామాబాద్ మాస్టార్ ప్లాన్ తయా రు చేశారని, ఇప్పుడు 2014 సంవత్సరంలో ఉన్నామన్నారు. 40 సంవత్సరాల తేడా కనిపిస్తున్నా నగరం మాత్రం అలాగే ఉండిపోయిం దన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ తీరు అధ్వానంగా మారిన విషయం అందరికీ తెలుసేనన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, బైపాస్ నిర్మాణాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. గత పాలకులు చేశామా...అంటే చేశామా అన్నట్లుగా నిజామాబాద్ మున్సిపాలిటీని,మున్సిపాల్ కార్పొరేషన్‌గా మార్చారన్నారు. బంగా రు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ అర్బన్‌ను స్మార్ట్‌సిటీగా, మాస్టర్ ప్లాన్ నిర్మాణం, పెం డింగ్‌లో ఉన్నా బైపాస్‌రోడ్డు నిర్మాణాలపై నా లుగు గంటలపాటు ఎమ్మెల్యే లు, మేయర్ సుజాత, కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. వీలైనంత తొం దరగా నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ కు టెండర్లు పిలవనున్నామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ నిజామాబాద్‌గా మార్చాలంటే 12 గ్రామాలు విలీ నం చేయాల్సి ఉంటుందన్నారు. నగరాన్ని అర్బన్ డెవలప్మెంట్ సొసైటీగా మార్చాలంటే గ్రా మాలు పంచాయతీలుగానే ఉండాల్సి వస్తుందన్నారు. స్మార్ట్ సిటీ ప్లాన్ కోసం హైదరాబాద్ నుంచి అధికారులను పిలిపించామని కవిత తెలిపారు. ఐఏఎస్‌ల విభజనలో కొంత మంది జిల్లా అధికారులు ఆంధ్రాకు కేటాయిం చబడ్డారనీ కవిత పేర్కొన్నారు. జిల్లాలో ముఖ్య మైన ఐఏఎస్ పోస్టులు కలెక్టర్, మున్సిపాల్ కమిషనర్,డ్వామా పీడీల కేటాయింపు కేంద్రం పరిధిలో ఉందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధికి ఎప్పటికప్పు డు అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని,అయితే వైద్య సేవల్లో ఎలాంటి లోటు కలుగకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలి పారు. నిజామాబాద్ నగర జనాభా దృష్ట్యా మరో తహశీల్ కార్యాలయం ఏర్పాటు కోసం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రూరల్ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు లో బ్రిడ్జికి ఇరువైపుల రోడ్డు నిర్మాణానికి చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రిడ్జిపై చిన్న చిన్నపాటి మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు.సమావేశంలో నగర మేయర్ సుజా త, డిప్యూటీ మేయర్ ఫయీమ్ పాల్గొన్నారు. 90 శాతం దరఖాస్తుల పరిశీలన ప్రభుత్వ పథకాల అమలు కోసం నిరంతరం జిల్లా యం త్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ రోనాల్డ్రో స్ అన్నారు. సమగ్ర సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులను 90 శాతం పరి శీలించామని తెలిపారు. వికలాంగుల కోసం గత నెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేయగా 12 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 6,500 మంది వికలాంగుల ను అర్హులుగా గుర్తించామన్నారు. ఈ నెల ఎవరికైనా పింఛన్లు రాకుంటే వచ్చేనెల రెం డు నె లల పింఛన్ పంపిణీ చేస్తామన్నారు.ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌళిక వసతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.