Union Railways
-
30 కి.మీ. మెట్రో పరుగులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.) మార్గంలో భద్రతా ధ్రువీకరణ జారీ చేయడంతో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమమైంది. మెట్రో ప్రాజెక్టును ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే నాగోల్–మెట్టుగూడ, మియాపూర్–ఎస్.ఆర్. నగర్ రూట్లో భద్రతా ధ్రువీకరణ మంజూరైంది. తాజాగా సోమవారం మెట్టుగూడ–ఎస్.ఆర్.నగర్ మార్గానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మార్గానికి సంబంధించి ఇటీవల ట్రాక్, సిగ్నలింగ్, విద్యుదీకరణ వ్యవస్థను కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత భద్రతా ధ్రువీకరణ జారీచేసింది. కాగా మరో వారంలో ప్రారంభంకానున్న రెండు మార్గాల్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. రెండు రూట్లలో 20 రైళ్లను నడపనున్నారు. ఈ 30 కి.మీ. మార్గంలో 24 స్టేషన్లున్నాయి. కాగా భద్రతా ధ్రువీకరణ రాకతో ఇప్పుడు అందరి దృష్టి మెట్రో రైలు కనిష్ట, గరిష్ట చార్జీలు, పార్కింగ్ ఫీజులపైకి మళ్లింది. నేడో రేపో ఈ ధరలను సైతం ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. -
అమరావతికి లైన్ క్లియర్
రాజధానికి రైలు మార్గం రూ.2,680 కోట్ల నిధులు కేటాయింపు విజయవాడ – అమరావతి – గుంటూరు కలిపి రైల్వే లైను 106 కిలోమీటర్ల మేర నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ నడికుడి – శ్రీకాళహస్తి పనులకు రూ.340 కోట్లు మంజూరు తెనాలి–గుంతకల్ డబ్లింగ్ పనులకు రూ.174 కోట్లు మచిలీపట్నం పోర్టు వరకు గుడివాడ రైల్వే లైన్ పొడిగింపు కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి సాక్షి, విజయవాడ : రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి రైలు మార్గం ఖరారైంది. రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం చేసిన వినతులకు ఎట్టకేలకు కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో రైల్వే బడ్జెట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించారు. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఇప్పటికే కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వాటికి నిధుల కేటాయింపుతో పాటు, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశారు. ప్రధానంగా విజయవాడ – అమరావతి – గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వల్పంగా పెరిగిన కేటాయింపులు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పార్లమెంటు సభ్యులు పలు ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు, కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ క్రమంలో వాటిలో కొంతమేర కేటాయింపులు జరిగాయి. గత ఏడాది కంటే కేటాయింపుల సంఖ్య కొంత పెరిగింది. గత రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.2,195 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించగా, ఈసారి రూ.3,406 కోట్ల నిధులు కేటాయించారు. రాజధానికి రైల్వే లైన్... రైల్వే బడ్జెట్లో ప్రధానంగా రాజధాని ప్రాంతమైన అమరావతికి రైలు మంజూరైంది. సీఎం చంద్రబాబు సహా రెండు జిల్లాల ఎంపీలు రైలు మార్గం కోసం అనేక పర్యాయాలు వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేశారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు మార్గాన్ని రాజధాని వరకు కొనసాగించే విషయంపైనా తర్జనభర్జనలు, పరిశీలన జరిగింది. ఈ పరిణామాల క్రమంలో రైల్వే బడ్జెట్లో కొత్త రైలు మార్గానికి నిధులు మంజూరయ్యాయి. విజయవాడ నుంచి రాజధాని ప్రాంతమైన అమరావతి (తుళ్లూరు), అక్కడి నుంచి గుంటూరుకు సర్క్యూట్ రైలు తరహాలో రాకపోకలు నిర్వహించడానికి వీలుగా రైల్వే లైను నిర్మించనున్నారు. మొత్తం 106 కిలోమీటర్ల నిర్మించే లైనుకు రూ.2,680 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించి కేటాయింపులు జరిపారు. ప్రాజెక్టు ఖరారు చేసి బడ్జెట్లో కేటాయింపులు జరగడంతో మరో రెండు నెలల కాలవ్యవధిలో టెండర్ల దశ దాటి పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. నడికుడి లైనుకు రూ.340 కోట్లు నిర్మాణ పనులు ప్రారంభమైన నడికుడి– శ్రీకాళహస్తి రైల్వేలైనుకు 2017–18 సంవత్సరానికి రూ.340 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.2,330 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు గత రెండు బడ్జెట్లు కలిపి రూ.290 కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 42 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైలు మార్గానికి సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లకు రెండు వర్కులుగా విభజించి కేటాయించారు. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి మామూళ్ళ వేధింపులతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వ్యవహారం కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వెళ్ళింది. గత నెల రోజులుగా పనులు నిలిచిపోయిన క్రమంలో బడ్జెట్లో కేటాయింపులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటాయింపులు ఇవే... విజయవాడ – గుడివాడ లైనును మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలని నిర్ణయించి దానికి రూ.130 కోట్లు కేటాయించారు. దీనివల్ల మచిలీపట్నం పోర్టు నుంచి సరకు రవాణా సులభం అవుతుంది. పది కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైలు మార్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తాయి. ► కాజీపేట–విజయవాడ మధ్య మూడో లైను ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. దీనికి రూ.100 కోట్లు కేటాయించారు. అంతేగాక కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైను ఏర్పాటుకు సర్వే చేయించేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. ► విజయవాడ – గూడూరు మధ్య 287.67 కిలోమీటర్ల మేర మూడో ట్రాక్ నిర్మాణానికి సంబంధించి రూ.100 కోట్లు కేటాయింపు ► కొండపల్లి – కిరండోల్ మధ్య రైల్వే లైనుకు అనుమతి లభించింది. ► కోటిపల్లి– నర్సాపురం– మచిలీపట్నం మార్గానికి రూ.430 కోట్లు కేటాయించారు. ► గుంటూరు– తెనాలి రైల్వే లైన్ మధ్య 24.38 కిలోమీటర్లు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులకు రూ.36 కోట్లు కేటాయింపు ► గుంటూరు – గుంతకల్లు మధ్య 463 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు రూ.124 కోట్ల కేటాయింపు ► రాయనపాడు రైల్వే కోచ్ మెయింటెనెన్స్ పనులకు రూ.8.7 కోట్లు కేటాయింపు ► గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 72 రైల్వే స్టేషన్లలో సుమారు రూ.1.2 కోట్ల నిధులతో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ► రూ.79 కోట్లతో జగ్గయ్యపేట, మేళ్ళచెరువు, జాన్ఫహాడ్ల మధ్య 24 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి అనుమతి -
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. శనివారం ఇక్కడి రైల్వే భవన్లో దక్షిణాది రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోన్ ఏర్పాటుకు సంబంధిత రాష్ట్రాలతో, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అలాగే విశాఖ-ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు గమ్యాన్ని చేరుకునేందుకు దాదాపు 36 గంటలు పడుతోందని, దీని సమయాన్ని కుదించాలని వస్తున్న వినతులను పరిశీలిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష లేదని, యూపీఏ హయాంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ కేటాయింపులు చేశామన్నారు. రైల్వే బోర్డులోని ఉన్నతాధికారులతో రాష్ట్రాలకు సమన్వయ కర్తలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేశాఖ సమన్వయ కర్తగా రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్రతానాథ్‌ను నియమించినట్టు వివరించారు. -
రైల్వే పథకాలకు మంగళం
రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో, అమలుకు నోచుకోకుండా ఉన్న రైల్వే పథకాలకు మంగళం పాడేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రూ.19,500 కోట్ల విలువగల పథకాల్ని కేంద్ర రైల్వే శాఖ రద్దు చేసిన సమాచారంతో పీఎంకే అధినేత రాందాసు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న కాలంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సాక్షి, చెన్నై: ఏటా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే వస్తోంది. కొత్త రైల్వే పథకాలను ప్రకటిస్తున్నారే గానీ అందుకు తగ్గ నిధుల్ని మాత్రం రాల్చడం లేదు. దీంతో దక్షిణ తమిళనాడులో అనేక రైల్వే పథకాలు అమలుకు నోచుకోకుండా మూలనపడి ఉన్నాయి. 1990 నుంచి 2009 మధ్య కాలంలో ప్రకటిం చిన అనేక పథకాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2002-2007 మధ్య కాలంలో రాష్ట్రానికి కాస్త ఊరటనిచ్చే పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు కారణం రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులుగా పదవులు చేపట్టడమే. తొలుత పీఎంకే ఎంపీ ఏకే మూర్తి కొన్నాళ్లు సహాయ మంత్రిగా, మరో ఎంపీ ఏవి వేలు మరికొన్నాళ్లు మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో కొత్త పథకాలను తీసుకొచ్చారు. తమకు పట్టున్న ఈరోడ్, సేలం, కృష్ణగిరి, ధర్మపురి పరిసరాల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా రైల్వే పథకాలకు చర్యలు చేపట్టారు. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పథకాలకు నిధుల్ని సమకూర్చారు. కొత్త రైల్వే సేవలకు చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని అమల్లోకి వచ్చినా, చాలా వరకు కదల్లేదు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ప్రకటించి అమలుకు నోచుకోకుండా ఉన్న పథకాలకు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడి ఉన్న మరికొన్ని ప్రాజెక్టులకు మంగళం పాడే విధంగా కేంద్ర రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు తగ్గ వివరాల్ని పార్లమెంట్ సమావేశాలు దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసిన రైల్వే శాఖ ఆర్థిక నివేదికలో పొందుపరచి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. 14 రైళ్లతో పాటుగా రూ.19,500 కోట్లు విలువగల 160 పథకాలకు మంగళం పాడే విధంగా ఆ నివేదిక ఉన్నట్టుగా ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలతో పీఎంకే అధినేత రాందాసు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం: తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న సమయంలో తమిళనాడుకు అనేక రైల్వే ప్రాజెక్టులు వచ్చాయంటూ తన ప్రకటనలో సోమవారం రాందాసు వివరించారు. కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత తమ వాళ్లకే దక్కుతుందన్నారు. అయితే, తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర రైల్వే శాఖ వ్యవహరిస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే మంత్రి తన బడ్జెట్ ద్వారా తమిళనాడు మీద చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ శాఖలో తమిళనాడుకు చెందిన మంత్రులెవ్వరూ లేని దృష్ట్యా, అన్యాయం తలబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 2002-09 మధ్య కాలంలో తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పథకాలు సైతం రద్దు చేయడానికి కేంద్రం నిర్ణయించినట్టుగా తన దృష్టికి వచ్చిందని మండి పడ్డారు. దక్షిణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను కలుపుతూ సత్యమంగళం మీదుగా బెంగళూరుకు 260 కి.మీ మేరకు రూ.13 వేల కోట్లతో చేపట్టదలచిన రైల్వే పథకాన్ని పర్యావరణ అనుమతి సాకుతో రద్దు చేసినట్లుగా సమాచారం వచ్చిందన్నారు. అలాగే, మరెన్నో పథకాలను స్థల సేకరణ పేరిట, వంతెనల నిర్మాణాల్ని అడ్డుకునే విధంగా లెవల్ క్రాసింగ్లను మూసివేస్తూ, కొన్ని ట్రాక్‌ల విస్తరణ, మరికొన్ని చోట్ల స్టేషన్ల అభివృద్ధి, డబుల్ ట్రాక్ పనులను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోందని వివరించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తమిళనాడుకు అన్యాయం తలబెట్టితే సహించబోమని హెచ్చరించారు.