Union territory status
-
మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
ఇంఫాల్: మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో సోమావారం కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన రాల్యీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తామను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు.మణిపూర్‌లో తరచూ చెలరేగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు పరిష్కారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుకీ తెగ ప్రజలు పెద్దఎత్తున చురచంద్‌పూర్, కాంగ్పోక్పి, చందేల్, ఫెర్జాల్-జిరిబామ్, తెంగ్నౌపాల్ పర్వత జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ.. కుకీ జో తెగ సంఘాలు జిల్లా అధికారుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమరర్పించినట్లు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లా బీజేపీ ఎమ్యెల్యే పౌలియన్‌లాల్ హాకిప్ మీడియాతో మాట్లాడారు. ‘ కుకీ జో ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలవాలని ఏడాది క్రితం విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికీ మాకు అనుమతి లభించలేదు. ఇక.. ఇప్పడు ప్రధాని మోదీ మా తెగల ఘర్షణకు పరిష్కారం చూపాలనుకుంటే ఇక్కడికే( మణిపూర్) రావాలి’అని అన్నారు. వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు మార్చ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. ‘ప్రత్యేక పరిపాలన వద్దు. గ్రామ వాలంటీర్ల అరెస్టు చేయొద్దు’ అనే నినాదాలతో భారీ సంఖ్యలో మహిళలు డిమాండ్ చేశారు. ఇక.. మే 3, 2023 నుంచి మణిపూర్‌లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగ, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగల మధ్య అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లర్లతో ఇరు తెగల మధ్య తీవ్రమైన హింస చెలరేగటంతో 220 మంది మృతి చెందారు. ఈ ఘర్షణల్లో వేలమంది గాయపడ్డారు. ఘర్షణలు తట్టుకోలేక వేలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. -
ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేయనని కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు. ‘జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అత్యంత సాధికారత కలిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సభ్యుడిగా ఉన్నాను. ఆరేళ్లపాటు సభానాయకుడిగా విధులు నిర్వర్తించాను.సాధికారతలేని అసెంబ్లీలో సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదు. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాను’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంది. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయబడింది. కానీ, జమ్మూ కశ్మీర్‌కి ఇచ్చిన వాగ్దానం మాత్రం నెరవేరలేదన్నారు. ఆర్టికల్ 370ని తొలగించడం జనాదారణ పొందిన చర్య అయి ఉండవచ్చు. కానీ, దేశ సార్వభౌమ విధానానికి చాలా వ్యతిరేకమని తెలిపారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించడం సరికాదన్నారు. (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా) ఒమర్ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. -
'సీమాంధ్రుల ప్రేమ గోదావరిపైనే కానీ భద్రాద్రి రాముడిపై కాదు'
సీమాంధ్రుల ప్రేమ భద్రాచలంలో కొలువైన సీతారాములపై కాదని... గోదావరి నీటిపైనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నారాయణ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఊరుకోమని నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని జోస్యం చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దళారి వ్యవస్థలా మారిందని ఆరోపించారు. జీవోఎంకు ఇచ్చిన లేఖకు తమ పార్టీ కట్టుబడి ఉందని నారాయణ స్పష్టం చేశారు.