'సీమాంధ్రుల ప్రేమ గోదావరిపైనే కానీ భద్రాద్రి రాముడిపై కాదు' | Union territory status to Hyderabad unnecessary, says Narayana | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రుల ప్రేమ గోదావరిపైనే కానీ భద్రాద్రి రాముడిపై కాదు'

Published Wed, Nov 27 2013 2:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Union territory status to Hyderabad unnecessary, says Narayana

సీమాంధ్రుల ప్రేమ భద్రాచలంలో కొలువైన సీతారాములపై కాదని... గోదావరి నీటిపైనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నారాయణ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఊరుకోమని నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

విభజన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని జోస్యం చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దళారి వ్యవస్థలా మారిందని ఆరోపించారు. జీవోఎంకు ఇచ్చిన లేఖకు తమ పార్టీ కట్టుబడి ఉందని నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement