రండి పెళ్లి చేస్తాం...
ఖాళీగా అవసరం లేకుండా అలా పడిఉన్న రైల్వే స్టేషన్లను పెళ్లి మండపాలుగా మార్చితే ఎంత బాగుంటుంది. ఇలాంటి ఐడియాతోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ముందుకొచ్చారు. ఖాళీగా పడిఉన్న రైల్వే స్టేషన్లను వేరే ప్రాంతాలకు తరలించే బదులు వాటిని పెళ్లి వేడులకు, ఇతర గ్రాండ్ ఈవెంట్లకు వాడాలని నిర్ణయించారు. వెడ్డింగ్ ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లకు రైల్వే స్టేషన్లను అద్దెకివ్వాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. గత నెల న్యూఢిల్లీలో జరిగిన రైల్ వికాస్ శివిర్ మీటింగ్లో ఈ అద్భుతమైన ఆలోచనను ఎంపికచేశారు.
రవాణా వ్యవస్థలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్న రైల్వే కార్యకాలపాల అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ ఈ మీటింగ్లో అధికారులకు పిలుపునిచ్చారు. రైల్వే అభివృద్ధికి రోడ్ మ్యాప్ చేయాలని ఆదేశించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే బోర్డు అడ్వయిజర్ అలోక్ రాజన్ తెలిపారు.