United Nation Agency
-
‘యూఎన్’ ఏజెన్సీపై ఇజ్రాయెల్ ఆగ్రహం.. సంచలన ఆదేశాలు
జెరూసలెం: గాజాలో శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఏజెన్సీ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’పై ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. తమ భూభాగంలోని ఏజెన్సీ కార్యాలయాలను వెంటనే మూసేయాలని ఇజ్రాయెల్ గృహనిర్మాణ శాఖ మంత్రి తాజగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి ఆ సంస్థతో ఉన్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు, భవిష్యత్తులో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాల్లో తెలిపారు. దీంతో ఇజ్రాయెల్‌లో యూఎన్ఆర్డబ్ల్యూఏ ఇప్పటికే వాడుతున్న, లీజుకు తీసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టని ప్రదేశాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హమాస్‌కు యూఎన్ఆర్డబ్ల్యూఏకు మధ్య ఎప్పటినుంచో సంబంధాలున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆరోపిస్తుండటమే ఈ చర్యలకు కారణమైనట్లు తెలుస్తోంది. యూఎన్ఆర్డబ్ల్యూఏకు చెందిన కొందరు ఉద్యోగులు గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు ఆధారాలు ఇజ్రాయెల్ సైన్యానికి లభించాయి. ఓ మహిళ కిడ్నాప్లోనూ వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏజెన్సీ వారిని విధుల నుంచి తొలగించింది. ఇదీ చదవండి.. పాకిస్థాన్‌లో పవర్ షేరింగ్ -
ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం..
న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనా మరోసారి భారత్ కు అడ్డంకిగా నిలిచింది. 26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్ ను నిషేధిత జాబితాలో చేర్చి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి భారత్ అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టనీయకుండా చైనా అడ్డుకుంది. ముఖ్య సూత్రధారి.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు సాజిద్ మీర్. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రధాన పాత్ర పోషించి ఆ మారణకాండలో 166 మంది మరణానికి కారణమయ్యాడు. దీంతో సాజిద్ మీర్ ను నిషేదిత వ్యక్తుల్లో చేర్చాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అమెరికా అతడిపైన 5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ప్రకటించింది. తోడుదొంగలు.. ఒక పక్క భారత్, అమెరికా సాజిద్ కోసం గాలింపు చేస్తోంటే.. పాకిస్తాన్ మాత్రం సాజిద్ చనిపోయినట్టు కట్టుకథ సృష్టించింది. అమెరికా ఆధారాలు చూపించమని కోరగా ప్లేటు ఫిరాయించి అతడికి 8 ఏళ్ళు జైలు శిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా సాజిద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చేందుకు భారత్, అమెరికా సంయుక్తంగా ఒక ప్రతిపాదనను సిద్ధం చేశాయి. కానీ ఐక్యరాజ్యసమితిలోని అల్ ఖైదా ఆంక్షల కమిటీ ముందు ఈ ప్రతిపాదన చేయనీయకుండా చైనా అడ్డుకుంది. ఉగ్రవాదుల్ని కాపాడే విషయంలో పాకిస్తాన్, చైనా రెండు దేశాలూ ఒక్కటే ధోరణితో వ్యవాహరిస్తున్నాయని, సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తోన్న ఇటువంటి వ్యక్తులను మనం నిషేధించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రమూకలను అణచడం కష్టమని తెలిపారు ఐక్యరాజ్యసమితి MEA జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ గుప్తా. #WATCH | "...If we cannot get established terrorists who have been proscribed across global landscapes listed under security council architecture for pure geopolitical interest, then we do not really have the genuine political will needed to sincerely fight this challenge of… pic.twitter.com/mcbw3bV13W — ANI (@ANI) June 21, 2023 ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు.. వైరల్ వీడియో -
ప్లీజ్.. ఇకనైనా మౌనం వీడండి.. మా బాధను అర్థం చేసుకోండి
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి ఆ దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అరాచక పాలనలో తమ బతుకులు బుగ్గిపాలవడం ఖాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే పరిస్థితి ఉందంటూ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది అఫ్గన్లు దేశం విడిచి పారిపోతుండగా.. మరికొందరు తాలిబన్లను ఎదురించే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, అఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న మెజారిటీ దేశాలు.. అమాయక ప్రజలకు అండగా నిలుస్తూనే.. తాలిబన్ల తీరు పట్ల వ్యూహాత్మక మౌనం, సమదూరం పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశం విడిచి భారత్‌కు చేరిన శరణార్థులు సోమవారం ఢిల్లీలోని యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యజీస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తాలిబన్ల అరాచకాలపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండొద్దని నినాదాలు చేశారు. అఫ్గన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని తమను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు మెరుగైన భవిష్యత్తు కావాలి’’, ‘‘న్యాయం కావాలి’’, ‘‘ఇకనైనా మౌనం వీడండి. మా బాధను అర్థం చేసుకోండి’’ అంటూ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. చదవండి: ‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’ -
సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, ముంబై: రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్లో చాలాకొద్దిమందికి దక్కిన అరుదైన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం. (రియల్ హీరో సోనూ సూద్‌కు గ్రాండ్ వెల్కమ్) నిస్వార్ధంగా, అలుపెరగకుండా లక్షలాది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం, వారిని ఆర్థికంగా ఆదుకున్న సోనూ సూద్ అక్కడితో ఆగిపోలేదు. విదేశాలలో చిక్కుకున్న వేలాదిమంది విద్యార్థులకు సహాయం, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన వారికి ఉచిత ఉపాధి అవకాశాలను కల్పించడం లాంటి అనేక సేవలకుగాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆయనకు ట్విటర్ లో అభినందన వెల్లువ కురుస్తోంది. హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలీ, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హాం, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాంటి వారిని ఐక్యరాజ్యసమితి పలు అవార్డులతో సత్కరించింది. మరోవైపు ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. తన దేశీయుల కోసం తనకున్న దాంట్లో తాను చేసిన చిన్న సాయమని పేర్కొన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనలో యుఎన్‌డీపీకి తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. -
మరియా షరపోవాకు మరో షాక్!
డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు మరో షాక్ తగిలింది. డోపింగ్ కేసు వివాదం నేపథ్యంలో తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మారియా షరపోవాను సస్పెండ్ చేసినట్టు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. రక్తప్రసరణను పెంచేందుకు ఉద్దేశించిన నిషేధిత మెల్డోనియం ఉత్ర్పేరకాన్ని తీసుకున్నట్టు డోపింగ్ పరీక్షల్లో షరపోవా పట్టుబడటంతో ఆమె నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది. ప్రస్తుతం ఆమెపై ప్రపంచ టెన్నిస్ సమాఖ్య తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. 'షరపోవా తాజా ప్రకటన నేపథ్యంలో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె హోదాను సస్పెండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగినంతకాలం ఆమెతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోం' అని న్యూయార్‌లోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం ఓ ప్రకటనలో తెలిపింది. చెర్నాబిల్ అణువిపత్తు వ్యవహారంలో తమ సహాయ కార్యక్రమాలకు మద్దతు తెలిపినందుకు షరపోవాకు కృతజ్ఞతలు తెలిపింది. 2007 నుంచి పేదరికం, అసమానతలపై పోరాడేందుకు ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా షరపోవా కృషి చేస్తున్నది. చెర్నాబిల్ అణువిపత్తు వల్ల బెలారస్లో ప్రభావితమైన ప్రజలకు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు అందించేందుకు అవసరమైన విరాళాలు సేకరించేందుకు యూఎన్డీపీతో కలిసి షరపోవా చారిటబుల్ ట్రస్టు కృషి చేసింది.