United States Ambassador to India
-
కరోనాతో చిన్నారి మృతి; తొలి కేసు!
చికాగో: అమెరికాలో కరోనా విలయానికి ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్) శనివారం వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ మూలంగా అమెరికాలో ఇంతవరకు వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా మరణించగా.. పసివాళ్లు చనిపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్ డైరెక్టర్ ఎంగోజి ఎంజికె చెప్పారు. కరోనా కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జకర్ తెలిపారు. చిన్నారి మరణం కలచివేసిందని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మహమ్మారి కరోనాతో చనిపోయిన వారి కుంటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రాణాంతక వైరస్‌తో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధానంగా వయసు మళ్లినవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇల్లినాయిస్లో మరణించిన వారిలో 85 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని తెలిపారు. కాగా, అమెరికా వ్యాప్తంగా లక్షా 20 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 2 వేల మరణాలు సంభవించాయి. ఇక ఇల్లినాయిస్లో 3491 కేసులు.. 47 మంది మరణించారు. మరణాల పరంగా ఇటలీ, స్పెయిన్, చైనా తరువాతి స్థానంలో అమెరికా నిలిచింది. -
'భారత విద్యార్థులను ఉద్దేశ పూర్వకంగా అవమానించలేదు'
విశాఖపట్నం : యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం పెరిగిందని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో స్మార్ట్సిటీపై జరిగిన భాగస్వామ్య సదస్సులో రిచర్డ్ ఆర్ వర్మ ప్రసంగించారు. యూఎస్టీడీఏతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. భారత్, యూఎస్‌ల మధ్య సహకారానికి స్మార్ట్‌సిటీతో పునాది పడిందన్నారు. యూఎస్‌లో భారతీయ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా అవమాన పర్చలేదని రిచర్డ్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. ప్రవేశాల్లో రెండు అంకెల పద్దతిపై అవగాహన లేకే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. జెట్ విమానాల తయారీకి పరస్పర సహకారంతో పనిచేసేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇరు దేశాల వాణిజ్యవ్యాపారాల్లో 500 బిలియన్ డాలర్లు చేసుకోవాలన్నదే లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా ఎగుమతులు, దిగుమతుల్లో భారత్ వాటా 2 శాతం మాత్రమే అని వెల్లడించారు. పౌర అణురంగంలో భారతదేశంతో మరింత సంబంధాలు పెంచుకుంటామన్నారు.