University officials
-
ఆ ఆన్సర్ షీట్లు చూసి టీచర్లు షాక్
ఆగ్రా : పరీక్షలకు ముందు సరైన సన్నద్ధత లేక, సమాధాన పత్రాల్లో దేవుడి బొమ్మలు వేస్తూ.. దేవుడా మమ్మల్ని పాస్ చేయించూ అంటూ కోరుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాల్లో మాదిరే భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమాధాన పత్రాలు చూసి పేపర్ మూల్యాంకన చేసే టీచర్లే షాకైపోయారు. వర్సిటీ 2017-18 సంవత్సరానికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ సమాధాన పత్రాల్లో విద్యార్థులు హనుమాన్ భజన్లు, హారతి పాటలు రాశారు. భక్తి పాటలు, హారతి లైన్లతో విద్యార్థులు తమ సమాధాన పత్రాలను నింపేశారని పేపర్లు మూల్యాంకన చేసిన టీచర్లు పేర్కొన్నారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా హారతి లైన్లకు అర్థం కూడా రాసినట్టు ఓ టీచర్ చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్ తనని చదువుల్లో మంచి ప్రతిభ గల వాడిగా భావిస్తుందని, తనని పాస్ చేయాలని లేదంటే ఆమె తనని విడిచిపెడుతుందంటూ ఓ విద్యార్థి తన మనోవేదనను వెల్లబుచ్చాడు. ఇలా సమాధాన పత్రాల్లో వింత వింత జవాబులతో పేపర్లు దిద్దే టీచర్లకే చుక్కలు చూపించారు. కొన్ని కేసుల్లో 20 పేజీల సమాధాన పత్రాలను సినిమా స్క్రిఫ్ట్‌లు, కవితలు, పాస్ మార్కులు వేయాలంటూ అభ్యర్థనలు ఇవే కనిపించాయని, కొంతమంది విద్యార్థులైతే ఏకంగా టీచర్లను ప్రలోభపెట్టేందుకు కరెన్సీ నోట్లను కూడా ఆఫర్ చేసినట్టు ఓ సీనియర్ టీచర్ చెప్పారు. వింత వింత సమాధానాలు రాసిన విద్యార్థుల తుది ఫలితాలు జూన్ 15న వర్సిటీ అధికారులు వెల్లడించనున్నారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకుండా.. ఇలాంటి సిల్లీ సిల్లీ అంశాలు రాసి పాస్ కావాలని విద్యార్థులు యోచిస్తున్నారని భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జీఎస్ శర్మ అన్నారు. ప్రతి రోజు టీచర్లు 5000కు పైగా సమాధాన పత్రాలను దిద్దుతారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫైనల్ ఎగ్జామ్స్‌కు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. -
నిధులున్నా.. విడుదల కావు
- కేయూ పరిధిలో వింతపోకడలు - బిల్లుల కోసం నిరీక్షిస్తున్న ప్రోగ్రాం ఆఫీసర్లు - ప్రారంభంకాని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు - మూలుగుతున్న రూ.1.69కోట్లు - ఇన్చార్జీల పాలనతోనే అస్తవ్యస్తం..! కేయూక్యాంపస్ : కేయూ పరిధిలో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ప్రోగ్రాం ఆఫీసర్లకు బిల్లుల చెల్లింపులో యూనివర్సిటీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రోగ్రాం అధికారులు ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి యూనివర్సిటీ ద్వారా రూ.22,500 చొప్పున ఎన్ఎస్ఎస్ ద్వారా చెల్లిస్తుంది. విద్యార్థులు వారంపాటు గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. వీరికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భోజనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరం ముగిశాక ఖర్చుకు సంబంధించిన బిల్లులను యూనివర్సిటీకి సమర్పిస్తారు. అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. మంజూరైన నిధులు.. కేయూ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరం లో వివిధ కళాశాలల్లో 350కిపైగా ఎన్ఎస్ఎస్ యూనినట్లు నమోదై ఉన్నాయి. గతేడాది అక్టోబర్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రో గ్రాం ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. వీటి తాలూకు వివరాలు, బిల్లుతో కూడిన ఫైలును ప్రోగ్రాం ఆఫీసర్లు యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ముగ్గురు ఇన్చార్జీ వీసీలు మారారు. వారి వద్ద ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఇటీవల ఇన్చార్జీ వీసీగా చిరంజీవులు బాధ్యలు చేపట్టగా ఆయన వద్దకు ఈ ఫైలు వెళ్లింది. సుమారు 200 కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ యూనిట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలు గడిచినా ఒక్కరూపారుు విడుదల కావడంలేదు. విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీకి రూ.1.69 కోట్లు మంజూరైనా విడుదల ఎందుకు చేయడంలేదో అర్థం కావడంలేదు. బిల్లులపై ఆడిట్‌తోనే..! గత విద్యాసంవత్సరంలోని బిల్లులు కావడంతో ఇవి సరైనవా, కాదా? అనే విషయంపై ఆడిట్ చేరుుంచారని తెలిసింది. ఇదే బిల్లుల విడుదలలో జాప్యానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు.. తమకు బిల్లులు చెల్లించాలంటూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు నెలల కొద్దీ కేయూ ఆర్డినేటర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది బిల్లులు అందకపోవడంతో ఈవిద్యాసంవత్సరంలో ఒక్క ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం కూడా నిర్వహించలేకపోయూరు. మిగతా అంశాల మాదిరిగానే ఇన్చార్జీల పాలనలో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు సైతం నీరుగారిపోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. -
10న ఓయూ డిగ్రీ ఫలితాలు!
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షా ఫలితాలు ఈ నెల 10 లేదా 11న ప్రకటించనున్నట్లు సమాచారం. మూల్యాంకనం పనులు ముగిసినట్లు సోమవారం వర్సిటీ అధికారులు తెలిపారు. ఇన్ఛార్జ్ వీసీ ఆర్ఆర్ ఆచార్య అనుమతి లభించిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నట్లు చెప్పారు. -
పరీక్ష రాయకున్నా పాస్!
శాతవాహన యూనివర్సిటీ : తప్పులమీద తప్పులు చేయడం శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగానికి అలవాటుగా మారింది. బీఈడీ విద్యార్థులకు ఒక ఫెయిల్ మెమో, మరో పాస్ మెమో ఇచ్చి కన్సాలిడేటెడ్ మెమో ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న వర్సిటీ తాజాగా పరీక్ష రాయకున్నా విద్యార్థులను పాస్ చేస్తూ మెమోలు ఇస్తోంది. డిగ్రీలో విద్యార్థులకు ఇంటర్నల్‌గా పరీక్ష నిర్వహణ ఉంటుంది. ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ నుంచి పంపిస్తారు. ఎలాగూ పరీక్షలను యూనివర్సిటీ అధికారులు తనిఖీ చేయబోరని కాబోలు... పలు కళాశాలలలు కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేదు. పరీక్ష రాయకుండానే ఏకంగా 300 మంది విద్యార్థులు పాసైనట్లు వెల్లడైంది. ‘పరీక్షే రాయలేదు... ఎలా పాసయ్యానని సదరు విద్యార్థులే నోరు వెళ్లబెట్టే వింత పరిస్థితి దాపురించింది. ఇంటర్నల్స్ ఇష్టారాజ్యం డిగ్రీలో విద్యార్థులకు ఆయా కోర్సు మెయిన్ సబ్జెక్టులతోపాటు వర్సిటీ అధికారులు అందరికీ కామన్‌గా ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు కాంటెంపరరీ ఇండియా (సీఐఈపీఎస్), సెకండియర్ విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫైనలియర్ విద్యార్థులకు సైన్స్ అండ్ సివిలైజేషన్ పరీక్షలను కళాశాలలో ఇంటర్నల్‌గా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలతో విద్యతోపాటు సామాజిక దృక్పథం అలవడుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంటోంది. కానీ, కొన్ని కళాశాలలు పరీక్ష నిర్వహించకుండానే మార్కులు వేసి పంపించారు. దీంతో తాము అసలు పరీక్ష రాయకుండానే ఎలా పాసయ్యామని అవాక్కవుతున్నారు. కామన్ పరీక్షగా నిర్వహించినా... ఈ మార్కులు జాబితాలో రావని, కేవలం ఇంటర్నల్ అని యూనివర్సిటీ ముందుగా ప్రకటిస్తుండడంతోనే విద్యార్థులు పరీక్షలు రాయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు తాము పరీక్షే రాయలేదని విద్యార్థులు చెబుతుండగా... వీరి జవాబు పత్రాలను విధిగా స్వీకరించామని అధికారులు చెబుతుండడం... అనుమానాలకు దారితీస్తోంది. యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణాలోపంతోనే ఇలా జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.