University of Waterloo
-
నీళ్లు తాగకుండా మందులా..?
టొరంటో: తగినంత నీరు తాగకపోవటమూ కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది!! మరి అలాంటి వారు ఇతరత్రా మందులు తీసుకుంటే అది కిడ్నీని మరింత దెబ్బ తీస్తుందా? ఇదిగో... ఇలాంటి విషయాల్ని లోతుగా శోధించే కొత్త ‘కంప్యూటర్ కిడ్నీ’ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ‘అధిక రక్తపోటు ఉన్న వారికి నీటితో కూడిన మాత్రలిస్తారు. దాంతో వారు ఎక్కువగా మూత్రవి సర్జన చేస్తారు. అలా వారి రక్త పోటు అదుపులోకి వస్తుంది’ అని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనితా లేటన్ చెప్పారు. ఈ పేషెంట్లకు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపే మరో మందును కూడా తరచు ఇస్తారు. దాంతోపాటు ఆస్ప్రిన్ కూడా ఇస్తుంటారు. ఇవనీన కిడ్నీపై ప్రభావం చూపిస్తుంటాయి. ‘శరీరంల్లో నీరు తక్కువయినప్పుడు అతితక్కువ నీటితో మూత్ర విసర్జన జరిగేలా చేసేది కిడ్నీయే. కాకపోతే వృద్ధులు, కిడ్నీ సమస్యలతో మందులు తీసుకునేవారు ఇబ్బంది ఎదుర్కోవచ్చు. మూత్రాన్ని కిడ్నీ నుంచి బ్లాడర్‌కు తీసుకెళ్లే కండరాలు సరిగా సంకోచించకపోవటమే దీనికి కారణం’ అని చెప్పిన లేటన్... ఈ సంకోచాల స్టిమ్యులేషన్‌ను లెక్కించే తొలి మోడల్‌ను రూపొందించారు. కిడ్నీకి కాంబినేషన్ మందులు తీసుకునే వారు తగినంత నీటిని తప్పకుండా తీసుకోవాలని, లేనట్లయితే ఆస్ప్రిన్‌తో కిడ్నీ దెబ్బతింటుందని తమ కంప్యూటర్ మోడల్ గుర్తించిందన్నారు. -
జ్ఞానంపై ఒంటరితనం ప్రభావం
టొరంటో: పరిస్థితులనుబట్టి మనలోని జ్ఞానపుస్థాయి మారుతూ ఉంటుంది. అయితే దీనిపై ఒంటరితనం ప్రభావం పడుతుందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. దైనందిన జీవితంలోని పరిస్థితులనేవి వ్యక్తిత్వంపైనా, తెలివిగా ఆలోచించడంపైనా ప్రభావం చూపుతాయని కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇగోర్ గ్రాస్మేన్ చెప్పారు. ఇక కొంతమంది వ్యక్తుల విషయంలో కొన్ని కొన్ని పరిస్థితులు వారికి అత్యంత అనుకూలంగా మారతాయని, తెలివితేటలు పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని, కొంతమంది అద్భుతమైన చతురతను కలిగిఉంటారని తెలిపారు. ఈ ఉదాహరణలు అసాధారణమైనవేమీ కావని తాజా అధ్యయనంలో తేలిందన్నారు. ఆటలో ప్రతిసారి ఏ ఒక్కరిదీ పైచేయిగా ఉండదని తెలిపారు. కాగా సోషల్ సైకలాజికల్ పర్సనాలిటీ సైన్స్ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.