పరిస్థితులనుబట్టి మనలోని జ్ఞానపుస్థాయి మారుతూ ఉంటుంది. అయితే దీనిపై ఒంటరితనం ప్రభావం పడుతుందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.
టొరంటో: పరిస్థితులనుబట్టి మనలోని జ్ఞానపుస్థాయి మారుతూ ఉంటుంది. అయితే దీనిపై ఒంటరితనం ప్రభావం పడుతుందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. దైనందిన జీవితంలోని పరిస్థితులనేవి వ్యక్తిత్వంపైనా, తెలివిగా ఆలోచించడంపైనా ప్రభావం చూపుతాయని కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇగోర్ గ్రాస్‌మేన్ చెప్పారు. ఇక కొంతమంది వ్యక్తుల విషయంలో కొన్ని కొన్ని పరిస్థితులు వారికి అత్యంత అనుకూలంగా మారతాయని, తెలివితేటలు పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు.
ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని, కొంతమంది అద్భుతమైన చతురతను కలిగిఉంటారని తెలిపారు. ఈ ఉదాహరణలు అసాధారణమైనవేమీ కావని తాజా అధ్యయనంలో తేలిందన్నారు. ఆటలో ప్రతిసారి ఏ ఒక్కరిదీ పైచేయిగా ఉండదని తెలిపారు. కాగా సోషల్ సైకలాజికల్ పర్సనాలిటీ సైన్స్ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.