unruly passengers
-
Pee Gate Row: రెచ్చిపోతే ఇకపై ఊరుకోరు!
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్ ఛాటింగ్ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్స్ సంస్థలతో పేర్కొంది. అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్ కంట్రోల్‌కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్‌ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు సూచించింది. బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. నవంబర్‌లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్ ఇండియా ఇంతకాలం భావించిందట!. కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్‌లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి. -
మీవల్ల ఆలస్యమైతే.. 15 లక్షల ఫైన్!
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసేటపుడు ఇకమీదట జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం గొడవలు పడినా ఇక మీదట క్రిమినల్ చర్యలను ఎదుర్కోవడంతో పాటు భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికుల ప్రవర్తన కారణంగా విమానం గంట ఆలస్యమైతే రూ. 5 లక్షలు, రెండు గంటలలోపు అయితే రూ. 10 లక్షలు, రెండు గంటలు దాటి ఆలస్యమైతే రూ. 15 లక్షల జరిమానా విధించాలని ఎయిరిండియా భావిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన, ఎయిరిండియా ఉద్యోగుల మీద దాడులు చేయడం (వీవీఐపీలు గానీ, మామూలు ప్రయాణికులు గానీ) లాంటి ఘటనల వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం బాగా దెబ్బతిందని, చివరకు హోటళ్లలో కూడా ఎవరు రావాలి, ఎవరు రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం ఉన్నప్పుడు ఎయిరిండియాకు కూడా ఇలాంటి అనుచిత ప్రవర్తన కలిగి ఉండే ప్రయాణికుల విషయంలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని ఓ అధికారి చెప్పారు. ఇటీవలి కాలంలో పలువురు నాయకులు తమ ఆధిపత్యాన్ని చూపించడం కోసం ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థల సిబ్బందితో గొడవ పడటం, వాళ్లపై శారీరకంగా దాడి చేయడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అయితే ఏకంగా 60 ఏళ్ల ఉద్యోగి ఒకరిని పాతికసార్లు చెప్పుతో కొట్టారు. అలాగే తన తల్లి ప్రయాణం విషయంలో కేబిన్ సిబ్బందితో గొడవ పడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ విమానాన్ని బాగా ఆలస్యం చేశారు. ఈ వీవీఐపీ సంస్కృతి విమాన సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. అంత చేసినా చివరకు వాళ్లు ఏమీ లేకుండానే బయటపడిపోతున్నారు. అందుకే ఇప్పుడు భారీ జరిమానాలతో కూడిన శిక్షలు పడేలా చూడాలని ఎయిరిండియా భావిస్తోంది. జరిమానా విధించే అధికారం ఎయిరిండియా చేతుల్లోనే ఉంటుంది గానీ, క్రిమినల్ చర్యల కోసం మళ్లీ పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటంఉది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని యాజమాన్యం భావిస్తోంది. -
విమానాల్లో ఇక ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే!
సియోల్: ఇటీవల ఫ్లైట్లలో ఉన్మాదులు రెచ్చిపోతున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. విమానం గాల్లో ఉండగానే సిబ్బంది, తోటి ప్రయాణికులపై సైకోలు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. రెచ్చిపోతున్న ఇలాంటి దుండగులను ఆపడం విమాన సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. అయితే ఇక నుంచి మాత్రం ఇలాంటి వారు విమాన ప్రయాణాల్లో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందని దక్షిణ కొరియా ఎయిర్ లైన్స్ చెబుతోంది. విమానాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది దక్షిణ కొరియా. ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న సమయంలో విమాన సిబ్బంది ఇక నుంచి స్టన్ గన్స్ వాడుతారని కొరియన్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు స్టన్ గన్స్ వాడటానికి ఎలాంటి సిబ్బందికి అభ్యంతరం ఉండదని వెల్లడించారు. గతవారం అమెరికా సింగర్ మార్క్స్ వియత్నాం నుంచి దక్షిణ కొరియాకు ప్రయాణిస్తున్న సమయంలో ఓ సైకో ఇలాగే రెచ్చిపోయాడు. ఆ సైకోను బంధించడంలో విమాన సిబ్బంది విఫలం కావడంతో మార్క్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో.. విమాన సిబ్బందికి రక్షణ విషయంలో కనీస అవగాహన ఉండటం లేదని మార్క్స్‌తో పాటు అతడి భార్య విమర్శలు గుప్పించారు. దీనిపై కొరియన్ ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందిస్తూ.. సిబ్బంది దగ్గర అప్పుడు టేజర్ గన్స్ ఉన్నప్పటికీ వాటిని అత్యంత క్లిష్టమైన, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడే వాడాలని ఆదేశాలు ఉన్నందున వారు వాటిని ఉపయోగించలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సిబ్బందికి స్టన్ గన్స్ వాడే అవకాశం కల్పించారు.