upendra tiwari
-
నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి
యూపీ క్రీడా మంత్రి ఫెఫ్నా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి పరుగులు పెడుతు వెళ్తున్నట్లు కనపించారు. అయినా ఫిబ్రవరి 11 చివరితేది అయినప్పటికీ యూపీ క్రీడా మంత్రి ఉపేంద్ర తివారి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గడవు కావలని అడిగేందుకు పరుపరుగున బల్లియా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. భారతీయ జనతాపార్టీ(బీజేపీ) తివారీని ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ప్రకటించింది. ఉత్తరప్రేదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు చేయడానికి ఒకరోజు గడువు ముగియడంతో క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ పరుపరుగున బల్లియా కలెక్టరేట్ కార్యాలయానికి దూసుకుపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పైగా ఆ వీడియోలో కాషాయారంగు తలపాగ పార్టీ కండువ, దండ ధరించి పరుగుపరుగున వెళ్తున్నట్లు కనిపించారు. #WATCH | UP Sports Minister Upendra Tiwari sprinted to Collectorate Office in Ballia y'day as he was running late to file his nomination. Y'day nominations were scheduled to be filed by 3 pm & the minister was running late, nomination process still ongoing#UttarPradeshElections pic.twitter.com/99HSIPHwoA — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022 (చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!) -
మంత్రి గారికి కోపం వచ్చింది..
ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్పీడు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మంత్రివర్గంలోని ఒక మంత్రికి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఒక చీపురు తీసుకుని, తన కార్యాలయాన్ని, కారిడార్‌ను కూడా చకచకా తుడిచి శుభ్రం చేసేశారు. ఆయన పేరు ఉపేంద్ర తివారీ. కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అసెంబ్లీలోని తన కార్యాలయంలో పరిశుభ్ర పరిస్థితులను చూసి ఆయనకు ఒక్కసారిగా ఒళ్లు మండిపోయింది. అధికారులు అందరూ చూస్తుండగానే ఆయన స్వయంగా చీపురు పట్టుకుని మొత్తం ఊడ్చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ (44) తన కేబినెట్ సహచరులు అందరితో సోమవారం నాడు ఒక ప్రమాణం చేయించారు. అందులో తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతామన్న ప్రతిజ్ఞ కూడా ఉంది. ఇందుకోసం ఏడాదిలో కనీసం 100 గంటలు కేటాయించాలని వాళ్లను కోరారు. స్వయంగా ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ గుట్కా మరకలు చూసిన ఆయన.. తక్షణం ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో గుట్కాలు, పాన్ మసాలాల వాడకాన్ని నిషేధించారు. తక్షణం కార్యాలయాల గోడలు, నేల మీద ఉన్న పాన్ మసాలా మరకలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆయన బాటలోనే మంత్రి ఉపేంద్ర తివారీ కూడా స్పందించి, చీపురుతో తన కార్యాలయాన్ని స్వయంగా శుభ్రం చేసుకున్నారు.