రాజపక్సకు తొలగిన అడ్డంకులు..
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలలో ఆశ్చర్యకర పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశ ప్రధాని పదవికి పోటీ పడేందుకు మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన చేతిలో రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత సిరిసేన పార్టీ సంకీర్ణకూటమిలోనే రాజపక్స పార్టీ కొనసాగుతోంది.
ఇప్పటివరకు రాజపక్స అభ్యర్థిత్వాన్ని ఖండిస్తూ వచ్చిన అధ్యక్షుడు సిరిసేన గత రాత్రి మనసు మార్చుకున్నారు. ఆగస్టు 17 న శ్రీలంకలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. యూపీఎఫ్ఏ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా రాజపక్స బరిలో ఉండనున్నారు.