Urban Planning Department
-
నగరాలకు నయా లుక్..! ఎన్‌ఎంఎస్‌హెచ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఎనిమిదేళ్లలో దేశంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చాలని అందుకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలో మార్పులు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ రిపోర్టులో పట్టణ ప్రణాళికలపై పలు ఆసక్తికరమైన వివరాలను పొందుపరిచింది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలోని పట్టణాల్లో నివసించే జనాభా 40% కంటే అధికంగా పెరుగుతుందని.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేసింది. చదవండి: ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ ఫలితంగా ఇక్కడి నుంచి వాతావరణానికి హానిచేసే ‘గ్రీన్హౌస్ వాయువులు’ కూడా అధికంగా ఉత్పత్తయ్యే అవకాశముందని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు నగర, పట్టణాల మాస్టర్ ప్లాన్లు అవసరమని పేర్కొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రణాళిక విభాగం ఇప్పటికే ఈ తరహా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధంచేసి, అమలుచేస్తుండడం గమనార్హం. 2,843 నగరాలకే సరైన మాస్టర్ ప్లాన్ దేశంలో జూలై 2019 నాటికి 7,933 నగరాలు, పట్టణాలు ఉండగా, వాటిలో 2,843 వాటికి మాత్రమే చట్టబద్ధమైన మాస్టర్ ప్లాన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు, లోకల్ ఏరియా ప్లాన్లు, లేఅవుట్ ప్లాన్లు సైతం సక్రమం గాలేవని, చాలా నగరాలు, పట్టణాలకు సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు, ఉన్నవాటిపై కూడా ఏళ్ల తరబడి సమీక్షలు చేయలేదని వివరించింది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా వసతులు సమకూర్చడం పట్టణ స్థానిక సంస్థలకు కష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. దీంతోపాటు జనాభా, నివాసాలపై సరైన డేటా లేకపోవడం కూడా మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకంగా మారిందని పేర్కొంది. వీటిని అధిగమించేందుకు ఆధునిక పద్ధతుల్లో పట్టణ ప్రణాళికలు రూపొందించి అమలుచేసి 2030 నాటికి పూర్తిచేయగలిగితే వాతావరణ మార్పులవల్ల తలెత్తే ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని సూచించింది. అందుకోసం పట్టణ ప్రణాళికలకు సంబంధించి పూర్తి భౌగోళిక సమాచారం (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ పద్ధతులను అనుసరించాలని ఆ నివేదిక సూచించింది. దీనిద్వారా ఆయా పట్టణాల్లోని చెరువులు, నీటి కొలనులు, రోడ్లు, కాలువలతో పాటు బహిరంగ ప్రదేశాలను మెరుగ్గా గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి సమర్థంగా అడ్డుకోవచ్చని వివరించింది. పచ్చదనానికి ప్రాధాన్యం ఇక పట్టణాలను భయపెడుతున్న వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడు గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించగలమని ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ నివేదిక పేర్కొంది. సాధ్యమైనంత మేర గ్రీన్ జోన్లను అభివృద్ధి చేసినట్లయితే మైక్రో క్లైమేట్ నియంత్రణలో ఉంటుందని, అందువల్ల అన్ని నగరాలు తమ సామర్థ్యం మేరకు మార్పులు తీసుకురావాలని సూచించింది. పైగా అత్యవసర పరిస్థితుల్లో సహాయ కార్యకలాపాల కోసం క్విక్ రెస్పాన్స్ మెకానిజాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఏర్పాట్లుచేసింది. ముఖ్యంగా అన్ని పట్టణాల్లోను పచ్చదనం అభివృద్ధి చేసేందుకు ‘జగనన్న గ్రీన్‌సిటీ చాలెంజ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి తొలివిడతలో 45 పట్టణాల్లో అమలు చేస్తున్నారు. అలాగే, వరదలవల్ల వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు స్పాంజీ సిటీల నిర్మాణానికి సంకల్పించింది. మరోవైపు.. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర పట్టణ సర్వే పూర్తయితే, రాష్ట్రంలోని మొత్తం 123 యూఎల్బీల్లోని జనాభా, నివాసాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, చెరువులు, కాలువలు, రోడ్లతో సహా సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. పణాళికలో మార్పులు తప్పదన్న ‘ఎస్సీఎం’ ♦మరోవైపు.. ప్రజలకు సౌకర్యవంతమైన స్థిరమైన జీవనం గడిపేందుకు పట్టణ ప్రణాళికలో కీలకమైన పలు మార్పులు అవసరమని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ♦పరిధిలోని ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ సూచించింది. ఇందులో గ్రీన్ కవర్, జీవవైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. ♦ఆయా పట్టణాల్లోని ఎకో–సెన్సిటివ్ జోన్లను మ్యాపింగ్ చేయాలని, హాట్స్పాట్లు, నగరంలోని సహజ వనరులు సహా నీటి వనరులు, వాటి పరీవాహక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వంటి అన్ని రకాల ప్రాం తాలను డిజిటలైజేషన్ చేయాలని సూచించింది. ♦విపత్తులు సంభవించినప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు యూఎల్బీ (అర్బన్ లోకల్‌బాడీలు–పట్టణ స్థానిక సంస్థలు)ల పరిధిలో యంత్రాంగం ఉండాలని తెలిపింది. ♦వరదలు సంభవించినప్పుడు ప్రవాహం పారేందుకు అనువుగా నిర్మాణాలు ఉండాలని.. కాలువలు, చెరువులపై ఆక్రమణలను నిరోధించాలని, సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పచ్చదనాన్ని అభివృద్ధిచేయాలని సూచించింది. ♦ఇందులో ప్రధానంగా స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. విపత్తుల నివారణకు సరైన ప్రణాళికలు సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న సహజ నీటివనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ♦అన్ని పట్టణాలు, నగరాల్లో డ్రైనేజీ నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేసి ఉంచడంతో పాటు డ్రైనేజీ మాస్టర్ ప్లాన్లను సిద్ధంచేసుకోవాలని సూచించింది. ♦అంతేగాక.. నగర విస్తీర్ణంలో 10–12 శాతంవాటర్ బాడీలను వినోద కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ అండ్ రీజినల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ గైడ్‌లెన్స్‌ను అమలుచేయాలని సూచించింది. ♦మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్న పరిశ్రమల చుట్టూ గ్రీన్‌బెల్ట్ బఫర్ జోన్లను అభివృద్ధి చేయాలి. ♦పట్టణ మాస్టర్ ప్లాన్‌లో నీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు ప్రవాహాలకు ప్రత్యేక నెట్వర్క్ ఉండాలని సూచించింది. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్‌ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
మరో పది కోట్ల కార్లు రోడ్డెక్కితే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘యూ డోంట్ నో వాట్ యూ గాట్ టిల్ ఇట్స్ గాన్, దే పేవ్ పారడైజ్ పుటప్ ఏ పార్కింగ్ లాట్ (నీవు పోగొట్టుకున్న దాని విలువ అది పొయ్యాకగానీ తెలియదు. వారు స్వర్గాన్ని చదునుచేసి పార్కింగ్ స్థలం చేస్తారు)’ అనే పాటను ‘బిగ్ ఎల్లో టాక్సీ’ ఆల్బమ్‌లో జోని మిశ్చెల్ పాడుతారు. అది నిజమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. నివాసిత కాలనీల్లోని ఖాళీ స్థలాలు, సాయం సంధ్య వేళల్లో పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు, కొంటె కబుర్లు చెప్పుకుంటూ కుర్రాళ్లు కాలక్షేపంచేసే కూడలి స్థలాలు, ఇరు సంధ్యల్లో వాహ్యాలికి వెళ్లి ముసలివాళ్లు ముచ్చట్లు పెట్టుకునే స్థలాలు పార్కింగ్ స్థలాలుగా మారిపోతున్నాయి. మరో నాలుగు రోజులు పోతే అక్కడక్కడ ఉన్న పార్కులు, పశ్చిక బయళ్లు, ఫౌంటేన్లు కూడా పార్కింగ్ స్థలాలు అయ్యే ప్రమాదం ఉంది. భారత దేశంలో ప్రైవేటు వాహనాల సంఖ్య పది కోట్లు దాటడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. మరో పదేళ్ళలోనే మరో పది కోట్ల వాహనాలు రోడ్లమీదకు వస్తాయని ప్రస్తుత అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆదాయం పెరగడం వల్లనో, సౌకర్యం కోసమో, హోదా కోసమో ప్రజలు కార్ల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో వాహనాల కొనుగోళ్లు జనాభా పుట్టుక కన్నా రెండింతలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నగరాలు కూడా వాటికి దగ్గరగానే పోతున్నాయి. మున్ముందు నగరాల్లో ఐదుగురు సభ్యుల కుటుంబం ఉండేందుకు 20 చదరపు మీటర్ల స్థలం దొరక్కపోవచ్చేమోగానీ ఉచిత కారు పార్కింగ్ చోటు మాత్రం కచ్చితంగా దొరుకుతుంది. రోజు రోజు పెరిగి పోతున్న పార్కింగ్‌కు ప్రభుత్వాలు సరైన స్థలాలు చూపించలేక పోవడం, పబ్లిక్ స్థలాల్లో పార్కింగ్ చేయడం తమ హక్కని వాహనాల యజమానులు భావించడం అందుకు కారణం. ఫ్రీ పార్కింగ్ అన్నది కార్లకు పునరుత్పత్తి డ్రగ్గు లాంటిదని అంతర్జాతీయ పార్కింగ్ గురు ‘డొనాల్డ్ షౌప్’ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని నగరాల్లో అన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ వ్యవస్థ ఉంది. భారత దేశంలో తక్కువగా పెయిడ్ పార్కింగ్, ఎక్కువగా ఫ్రీ పార్కింగ్లు ఉన్నాయి. పబ్లిక్ స్థలాల్లో ఉచితంగా పార్క్ చేసే హక్కు ప్రైవేటు కార్లకు ఎక్కడిదన్న ప్రశ్న ఆ దేశాలది. కొన్న కారుపై, వాడుతున్న ఇంధనంపై ఇప్పటికే పన్ను కడుతున్న తమ వద్ద నుంచి పార్కింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తారా? అన్నది భారతీయుల ప్రశ్న. ప్రశ్నలో లాజిక్ ఉందిగానీ, దూర దృష్టి లేదు. ఉచిత పార్కింగ్ పేరిట అన్ని ఖాళీ స్థలాలు ఆక్రమించుకుంటూ పోతే మున్ముందు పబ్లిక్ స్థలాలంటూ మిగలవు. రోడ్లపై కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితమవుతున్న ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ, నగర పాలనా వ్యవస్థతో కలిసి ఆధునిక పద్ధతిలో అన్ని చోట్ల పార్కింగ్ స్థలాల నిర్మాణం కోసం పూనుకోవాలి. అందుకు పార్కుల లాంటి పబ్లిక్ స్థలాల జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ స్థలాలు చూసుకోవాలి. ‘ఏం ట్రాఫిక్‌రా బాబు!’ అంటూ విసుక్కునే వాహన యజమానులు పార్కింగ్ స్థలాల కోసం ప్రభుత్వంపై విసుక్కోవాలి. -
అనుమతిచ్చే వారేరి..
ఖాళీగా టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు నాలుగేళ్లుగా ఇన్‌చార్జీలతోనే సరి ఇళ్ల నిర్మాణాలకు లభించని మోక్షం నగర పంచాయతీ ఆదాయంపై ప్రభావం పరకాల : పరకాల నగర పంచాయతీలోని పట్టణ ప్రణాళిక విభాగం కార్యకలాపాలు స్తంభించారుు. గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయినప్పటి నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) లేక పోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ పాలనలో ప్రధాన మైన పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నా లేనట్లుగా మారడంతో నగర పంచాయతీ లక్షలాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. పరకాల 2011 ఆగస్టులో నగర పంచాయతీగా అప్గ్రేడయ్యింది. అప్పటి నుంచి టీపీవో పోస్టులో ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ నగర పంచాయ తీ టీపీవోఇక్కడ ఇన్చార్జిగాఉన్నారు. గతంలో వారానికోసారి వచ్చే అధికారి రెండునెలల నుంచి రావడంలేదు. దీంతో కొత్త ఇళ్ల నిర్మాణాల అనుమతులకోసం వచ్చినదరఖాస్తులు, గతంలో నిర్మించుకు న్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయింపుల్లో జాప్యం జరుగుతున్నది. పర్మినెంట్ టీపీవో లేక ఇక్కట్లు నగర పంచాయతీగా మారి నాలుగేళ్లరుునా టీపీఓగా పూర్తిస్థారుు అధికారిని నియమించలేదు. ఇన్చార్జీలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో టౌన్ ప్లానింగ్ విభా గం.. స్థానికంగా విధులు నిర్వహించే జవాన్ల చేతికి చేరింది. అనుమతులు ఇప్పిస్తామని టీపీవో పేరుతో వేలాది రూపాయలను వసూసూలు చేసిన ఘటనలు ఉన్నాయి. అనుమతులు లేవు.. నంబర్లు రావు నగర పంచాయతీ పరిధిలో కొత్త ఇళ్లు నిర్మించుకుందామని దరఖా స్తు చేసినా అనుమతులు లభించడం లేదు. పట్టణంలో 120కి పైగా కొత్త ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇన్చార్జి రాకపోవడంతో అనుమతి ఇచ్చే వారు కరువయ్యూరు. టీపీవో వస్తేనే పని జరుగుతుందని చెప్పుతుండడంతో దరఖాస్తుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొందరు అనుమతులు లభించకున్నా నిర్మాణాలను చేపట్టారు. ఇలా నిర్మాణం చేసిన ఇళ్లు 450 వరకు ఉన్నాయి. వీటి క్రమబద్ధీకరణ కోసం టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కొత్త ఇంటినంబర్లు రావడంలేదు. దీంతో నగర పం చాయతీకి ఇంటి పన్ను రూపంలో వచ్చే ఆదాయం రాకుండా పో తోంది. ప్రభుత్వం ఇటీవల పట్టణాల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవడానికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) అవకాశాన్ని కల్పించిం ది. ఈ పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అధికారులు జాడలేక పోవడంతో ప్రభుత్వం లక్ష్య నీరుగారుతోంది. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తించే అధికారి లేకపోవడంతో పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నారుు. అ నుమతికోసం చెల్లించాల్సిన ఫీజును చెల్లించకపోవడంతో నగర పం చాయతీకి ఆదాయం రాకుండా పోతోంది. కొంతమంది అధికారులకు ఎంతో కొంతముట్టజెప్పి తమపని పూర్తి చేస్తుకుంటున్నారు. -
నోటిమాట... నోటు వాటా!
అక్రమ కట్టడాలకు ఇవే ప్రమాణాలు - ఆర్మూరులో ఓ వ్యాపారి ‘నిర్మాణ’ బాగోతం - టౌన్‌ప్లానింగ్ నిబంధనలు బేఖాతరు - 306 దుకాణాల సముదాయం నిర్మాణం - ఈ ‘డీల్’ వెనుక రూ.150 కోట్ల టర్నోవర్ - చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముం దుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ప్రణాళిక విభాగానికి దరఖాస్తుతోపాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)కు అనుగుణంగా ఉన్న స్థలం లో భవనాన్ని ఎంత మేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. నివాస గృహ మా? బహుళ అంతస్థుల నివాస సముదాయమా? లేక వాణిజ్య సముదాయమా? అన్నది తేలిన అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. వీటిని అధికారులు సుని శితంగా పరిశీలించాలి. కానీ ఆర్మూరు పురపాలక సంఘం పరిధిలో ఇవేవీ అ మలు కావడంలేదు. అనుమతులు తీసు కున్న తర్వాత చట్టాలను ఉల్లంఘించి ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో రూ.కోట్లలో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.ఆర్మూరు నడిబొడ్డున ఆర్కే కాంప్లెక్స్ వెనుక స్థలంలో వా ణి జ్య దుకాణాల సముదాయం నిర్మాణం జరుగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇంత జరుగుతున్నా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ‘నిర్మాణాలు ఎలా జరిగితే మాకేం’ అన్న ధోరణితో వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలం దక్కించుకుందిలా బక్రాన్ బీడీ ఫ్యాక్టరీ యజమానులు బ్యాంకులో తనఖా పెట్టిన స్థలాన్ని మొదట బ్యాంకు వారు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల క్రితం బహిరంగ వేలం వేయడంతో పలువురు వ్యాపారులు సిండికేట్‌గా మారి వేలం పాట లో ఆ భూమిని దక్కించుకున్నారు. బ్యాంకు షరతులు, వేలం పాట నిబంధనల మేరకు భూమిని దక్కించుకున్న సదరు సిండికేట్ వ్యక్తులు కొంత మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించారు. ఇదే సమయంలో బీడీ కార్మికులు తమకు బక్రాన్ బీడీ ఫ్యాక్టరీ యజమానులు చెల్లించాల్సిన పీఎఫ్ తదితర మొత్తాలు చెల్లించాలంటూ ధర్నాలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం తో సుమారు పదేళ్ల పాటు వివాదం కొనసాగుతూనే ఉం ది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఒక బడా వ్యాపారి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులందరికీ, వారి డబ్బులు తిరిగి ఇచ్చివేసి 440, 441/1, 441/3 సర్వే నంబర్లోని సుమారు పది వేల గజాల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. గతేడాది ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. అక్కడే అక్రమ కట్టడానికి బీజాలు పడ్డాయి. ఏడాది జాప్యం.. ఇప్పుడు ‘ఉల్లంఘన’ సుమారు పది వేల గజాల స్థలాన్ని కమర్షియల్ కట్టడాలకు వినియోగించుకున్న సందర్భంగా టౌన్ ప్లానింగ్ లేఅవుట్ అనుమతిని పొందాల్సి ఉంటుంది. అందుకు 33 ఫీట్ల వెడల్పుతో రోడ్లు వేయడమే కాకుండా 10 శాతం భూమిని కాలనీ అభివృద్ధి కోసం వదిలి పెట్టాల్సి ఉం టుంది. ఈ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి సద రు వ్యాపారి ఆధ్వర్యంలో పలువురు బినామీ వ్యక్తుల పేరిట ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. టౌన్ ప్లానిం గ్ లేవుట్ నిబంధనలకు విరుద్దంగా చిన్న చిన్న రోడ్లతో షా పింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ వేసి పేపర్‌పైనే అమ్మకాలు ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 153 షాపు లు, ఫస్ట్ ఫ్లోర్లో 153 షాపులతో మొత్తం 306 షాపుల నిర్మాణానికి ప్లాన్ వేయించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆనుకొని మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణం చేస్తామంటూ ప్రచారం చేసారు. అప్పట్లో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుతో భూమి పూజ సైతం చేయించారు. పేపర్‌పైనే ఒక్కో షాపును రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వర కు అమ్మకాలు ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకం పనులు మొదలు పెట్టారు. అ డ్డుగా వచ్చిన రాాళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా డైనమేట్లు పెట్టి తొలగించారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఎన్నికలలోనూ, ఎన్నికల త ర్వాత కొందరు నేతలను ప్రసన్నం చేసుకుని ఇటీవల మళ్లీ నిర్మాణం ప్రారంభించారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నారుు. స్పందించని మున్సిపల్ అధికారులు ఎవరైనా మధ్య తరగతి కుటుంబీకులు ఇళ్లు కట్టుకుంటే నిబంధనల పేరిట ఇబ్బందుల పాలు చేసే మున్సిపల్ అధికారులు పట్టణం నడిబొడ్డున సాగుతున్న అక్రమ నిర్మాణంపై ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎందుకంటే ఈ అక్రమ కట్టడం నిర్మాణానికి అనుమతి కోరుతూ వ్యాపారి మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నాడు. వీలు లేదంటూ వారు నోటీసులు సైతం జారీ చేసారు. ఈ అక్రమ కట్టడం గురించి ఆర్మూర్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా, అసలు తమకు అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు రాలేదంటూ అబద్ధపు సమాచారాన్ని అందించారు. వ్యాపారి పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తుం టే అధికారులు, నాయకులు ముడుపుల మోజులో ఆయనకు అండగా నిలుస్తున్నారన్నది బహిరంగ రహస్యంగా మారింది. -
అక్రమ కట్టడాలపై కొరడా!
అద్దెకు ఇచ్చిన పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో సిబ్బంది రంగంలోకి దిగిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం కర్నూలు : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించేందుకు నగరపాలక సంస్థ రంగం సిద్ధం చేసింది. నగరంలో అడ్డగోలు నిర్మాణాలపై ‘అంతా మాఇష్టం’ శీర్షికన సోమవారం సాక్షి దదిన పత్రికలో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. కమిషనర్ అదేశాలకు మేరకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వీరారెడ్డి నేతృత్వంలో ఓ బృందం మంగళవారం నగరంలో విస్తృతంగా పర్యటించింది. పలుచోట్ల అక్రమ భవన నిర్మాణ పనుల్ని ఈ బృంద సభ్యులు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ-క్యాంపు సమీపంలో ఆర్అండ్బీ క్వార్టర్‌ను కూల్చివేసి ఆ స్థలంలో కొత్తగా చేపట్టిన అక్రమ నిర్మాణ పనుల్ని టౌన్‌ప్లానింగ్ అధికారి శాస్త్రితోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఆ స్థలంలో నిర్మాణ పనులకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ ఎలాంటి నిరభ్యంతర పత్రం ఇవ్వలేదు. అయితే, ఆ స్థలానికి కర్నూలు తహశీల్దారు కార్యాలయం నుంచి తాత్కాలిక పట్టా ఇవ్వడం.. దాని ఆధారంగా గతంలో నగరపాలక సంస్థలో బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతి కోరగా.. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితి కొనసాగించాలని స్టే ఇచ్చారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసురావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు నిర్మాణ దారున్ని తీవ్రంగా హెచ్చరించారు. ఎలాంటి పనులు చేపట్టొద్దని, నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి.. పనుల్ని నిలిపివేశారు. ఇక పార్కింగ్ స్థలాలను అద్దెకు ఇచ్చిన వాణిజ్య సముదాయాల్ని గుర్తించే పనిలో పట్టణ ప్రణాళిక సిబ్బంది నిమగ్నమైంది. ఈ విషయంపై సిటీప్లానర్ వీరారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నగరంలో అనధికారిక కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కింగ్ స్థలాల్ని ఇతరత్రా వాటికి వినియోగిస్తున్న బిల్డర్లకు, యాజమానులకు నోటీసులు జారీ చేయనున్నామని చెప్పారు. ఫంక్షన్‌హాళ్లలోనూ ఫైర్‌సేప్టీ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సదుపాయం కల్పించాలని పేర్కొంటూ వారికి ఇది వరకే నోటీసులు జారీ చేశామని, నేటికీ వాటిని ఏర్పాటు చేయని ఫంక్షన్‌హాళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పార్కింగ్ స్థలాల్ని ఆక్రమించిన వారిని వారంలోగా ఖాళీ చేయిస్తామని ఆయన వివరించారు.