ఖాళీగా టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు
నాలుగేళ్లుగా ఇన్‌చార్జీలతోనే సరి
ఇళ్ల నిర్మాణాలకు లభించని మోక్షం
నగర పంచాయతీ ఆదాయంపై ప్రభావం
పరకాల : పరకాల నగర పంచాయతీలోని పట్టణ ప్రణాళిక విభాగం కార్యకలాపాలు స్తంభించారుు. గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయినప్పటి నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) లేక పోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ పాలనలో ప్రధాన మైన పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నా లేనట్లుగా మారడంతో నగర పంచాయతీ లక్షలాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. పరకాల 2011 ఆగస్టులో నగర పంచాయతీగా అప్‌గ్రేడయ్యింది. అప్పటి నుంచి టీపీవో పోస్టులో ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ నగర పంచాయ తీ టీపీవోఇక్కడ ఇన్‌చార్జిగాఉన్నారు. గతంలో వారానికోసారి వచ్చే అధికారి రెండునెలల నుంచి రావడంలేదు. దీంతో కొత్త ఇళ్ల నిర్మాణాల అనుమతులకోసం వచ్చినదరఖాస్తులు, గతంలో నిర్మించుకు న్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయింపుల్లో జాప్యం జరుగుతున్నది.
పర్మినెంట్ టీపీవో లేక ఇక్కట్లు
నగర పంచాయతీగా మారి నాలుగేళ్లరుునా టీపీఓగా పూర్తిస్థారుు అధికారిని నియమించలేదు. ఇన్‌చార్జీలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో టౌన్ ప్లానింగ్ విభా గం.. స్థానికంగా విధులు నిర్వహించే జవాన్ల చేతికి చేరింది. అనుమతులు ఇప్పిస్తామని టీపీవో పేరుతో వేలాది రూపాయలను వసూసూలు చేసిన ఘటనలు ఉన్నాయి.
అనుమతులు లేవు.. నంబర్లు రావు
నగర పంచాయతీ పరిధిలో కొత్త ఇళ్లు నిర్మించుకుందామని దరఖా స్తు చేసినా అనుమతులు లభించడం లేదు. పట్టణంలో 120కి పైగా కొత్త ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌చార్జి రాకపోవడంతో అనుమతి ఇచ్చే వారు కరువయ్యూరు. టీపీవో వస్తేనే పని జరుగుతుందని చెప్పుతుండడంతో దరఖాస్తుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొందరు అనుమతులు లభించకున్నా నిర్మాణాలను చేపట్టారు. ఇలా నిర్మాణం చేసిన ఇళ్లు 450 వరకు ఉన్నాయి. వీటి క్రమబద్ధీకరణ కోసం టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కొత్త ఇంటినంబర్లు రావడంలేదు. దీంతో నగర పం చాయతీకి ఇంటి పన్ను రూపంలో వచ్చే ఆదాయం రాకుండా పో తోంది. ప్రభుత్వం ఇటీవల పట్టణాల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవడానికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్‌ఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) అవకాశాన్ని కల్పించిం ది. ఈ పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అధికారులు జాడలేక పోవడంతో ప్రభుత్వం లక్ష్య నీరుగారుతోంది. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తించే అధికారి లేకపోవడంతో పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నారుు. అ నుమతికోసం చెల్లించాల్సిన ఫీజును చెల్లించకపోవడంతో నగర పం చాయతీకి ఆదాయం రాకుండా పోతోంది. కొంతమంది అధికారులకు ఎంతో కొంతముట్టజెప్పి తమపని పూర్తి చేస్తుకుంటున్నారు.
అనుమతిచ్చే వారేరి..
Published Sat, Dec 19 2015 1:14 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement