Town Planning Officer
-
చిరువ్యాపారులపై కక్ష సాధింపు
-
కార్పొరేషన్లో ఏసీబీ కలకలం
సాక్షి, గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏసీబీ డీజీ పీఎస్సార్ సీతారామాంజనేయులు ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఏసీబీ ఏఎస్పీ సురేశ్‌బాబు నేతృత్వంలో మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, ఒక ఎస్ఐ, 10 మంది ఏసీబీ సిబ్బంది, ఆరుగురు ఇంజినీర్లు, ఇద్దరు ఆడిటర్లు తనిఖీల్లో పాల్గొన్నారు. రూ.1.03లక్షలు స్వాధీనం టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు వార్డ్ నంబర్ 35 బిల్ కలెక్టర్ ఎస్.నాగేశ్వరరావు నుంచి రూ.69,620, టౌన్ ప్లానింగ్ అవుట్సోర్సింగ్ అటెండర్ అల్లంశెట్టి సుధాకర్ నుంచి రూ.29,093, డెప్యూటీ సిటీ ప్లానర్ బి. సత్యనారాయణ నుంచి రూ.5,100 కలిపి మొత్తం రూ.1,03,813 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల నియామకం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆకస్మిక తనిఖీల సందర్భంగా అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్ కలెక్టర్ తుపాకుల సాంబశివరావు నెలకు రూ.ఐదు వేలు జీతం ఇస్తూ బి.లోకేష్ అనే ప్రైవేట్ వ్యక్తిని, మరో బిల్‌కలెక్టర్ నాగేశ్వరరావు నెలకు రూ.ఎనిమిది వేలు జీతం ఇస్తూ టి.ప్రసాద్æ అనే ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నారు. అంతేకాకుండా నకిలీ ఐడీ కార్డులను పెట్టుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్రమ వసూళ్లు చేయడం కోసం కార్పొరేషన్‌లోని అధికారులు, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ తనిఖీల్లో ప్రైవేట్ వ్యక్తులు పట్టుబడటం గమనార్హం. పన్ను కట్టినప్పటికీ ప్లాన్ లేని భవనాలను గురించి ఆరా తీయడం కోసం రెవెన్యూ విభాగంలోకి ఏసీబీ అధికారులు వెళ్లగా అక్కడా అక్రమాల బాగోతం బయటపడింది. రికార్డుల పరిశీలన బిల్డింగ్ ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఇతర కార్యకలాపాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా అన్న విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ప్లాన్ల మంజూరు విషయంలో క్షేత్ర స్థాయిలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం, జీటీ రోడ్డు, నల్లపాడు సహా గుంటూరు నగరంలోని భవనాలు, అపార్ట్మెంట్లను ఏసీబీ బృందాలు పరిశీలించాయి. మంగళవారం మధ్యా హ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు అర్ధరాత్రి వరకూ కొనసాగా యి. బుధవారం కూడా తనిఖీలు కొనసాగనున్నాయి. ఆందోళనలో అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్లు మంజూరు చేసిన ఘటనలు కార్పొరేషన్లో అనేకం ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలోని టీడీపీ నాయకులకు చెందిన ఓ పేరు మోసిన క్లబ్లో గత కొ ద్ది రోజులుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా గత ఏ డాదిలో ప్లాన్లు మంజూరు చేశారు. ఈ విష యంలో భారీగా డబ్బులు చేతులు మారాయ న్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో ఈ వ్య వహారం ఎక్కడ బయటపడుతుందోనని అధి కారులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. గతంలో ఏసీబీ కేసులు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ స్థాయి అవినీతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరపాలక సంస్థ పరిధిలో 2012–2016లో 14 ఫైల్స్‌కు టీడీఆర్ బాండ్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్ బాండ్స్)లో భారీ స్థాయి అవినీతి జరిగిందంటూ అప్పట్లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన అధికారులు అవకతవకలను నిర్ధారించారు. ఈ వ్యవహారంపై 2018లో ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు అందడంతో పూర్తి విచారణ జరిపిన అధికారులు టీడీఆర్ బాండ్లలో సుమారు రూ.1.60 కోట్లమేరకు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై కమిషనర్, కార్పొరేష¯Œన్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్, డీఎంఈలు సైతం దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పట్లో నివేదికలు పంపారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడిన 12 మంది అధికారులు(మినిస్టీరియల్ స్టాఫ్), తొమ్మిది మంది బిల్డర్లు సహా 32 మందిపై 13/1ఏ, 13/2, 420, 409, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో బిల్‌కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఏసీబీ తనిఖీల్లో ఎక్కడ తమ అవినీతి ఆరోపణలు బయటపడతాయోనని కొందరు అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ యజమానిని బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి సిద్దాంతం మదన్‌రాజుతో పాటు పత్రికా విలేకరులు సోపాల శ్రీనివాస్, ఆకుల కిరణ్‌గౌడ్‌లను ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ ఎస్. అచ్చేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రో స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా షెడ్డు నిర్మిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్ ఆయన వద్దకు వెళ్ళి ఇది అక్రమ నిర్మాణమంటూ బెదిరించారు. ‘5 లక్షలు ఇవ్వకపోతే జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి మదన్‌రాజుకు చెప్పి కూల్చివేయిస్తామంటూ బెదిరించారు. మదన్‌రాజును కూడా వెంటబెట్టుకొని నిర్మాణ స్థలానికి వెళ్ళి కేశవరెడ్డితో మాట్లాడి అయిదు లక్షలు ఇవ్వాలంటూ ముగ్గురూ కలిసి డిమాండ్ చేశారు. అయితే తాను కేవలం రెండు లక్షలు ఇస్తానని కేశవరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. అప్పటికే కేశవరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పగా పక్కా ప్రణాళికతో బాధితుడు సెక్షన్ అధికారితో పాటు ఇద్దరు విలేకరులను ఇంటికి పిలిపించాడు. అక్కడ 2లక్షలు ఈ ముగ్గురికీ ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేపట్టి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సెక్షన్ అధికారి మదన్‌రాజు, ఈ ఇద్దరు విలేకరులను కొంత కాలంగా తన అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడని వారితోనే డబ్బులు వసూలు చేయిస్తున్నాడని అధికారులు తెలిపారు. అక్రమంగా ఇల్లు కట్టావంటూ కేశవరెడ్డిని బెదిరించారని 5 లక్షలు ఒప్పందం కుదుర్చుకోగా 2 లక్షలు ఇస్తుంటే పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు విలేకరులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తేలింది. -
మురళీగౌడ్ వద్ద వందకోట్ల ఆస్తులు..!
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారి బాలగౌని మురళీగౌడ్ సుమారు వంద కోట్ల రూపాయల అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన ఆస్తులపై మూడు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయిన అధికారులు నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నంద్యాలలో 8 ఎకరాల పొలం, హైదరాబాద్, నంద్యాలల్లో రెండు భవనాలు, నంద్యాల, తిరుపతిల్లో మూడు ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు ఉండగా, తిరుపతిలోని మురళీగౌడ్ బంధువుల ఇంట్లో రూ.16లక్షలు, మురళీగౌడ్ బావమరుదుల ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారి పేరుతో బెంగళూరులో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మురళీగౌడ్ భార్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ రావడానికి ముందు మురళీగౌడ్ నంద్యాల, తిరుపతిల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నంద్యాలకు చెందిన మురళీగౌడ్ పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత పదోన్నతులు పొంది, తిరుపతిలో అసిస్టెంట్ సిటీప్లానర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆయన విజయవాడలోని సీఆర్డీఏకు డిప్యూటేషన్‌పై వచ్చారు. వారం క్రితం విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. నాటి ఫిర్యాదులతో ఈ సోదాలు జరిగాయి. తిరుపతి ద్వారకానగర్‌లోని నివాసముంటున్న మురళీ గౌడ్ బంధువు ఇంట్లో 14 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే తిరుపతి రూరల్ పేరూరులోని బిల్లు కలెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, లక్షా యాభైవేల రూపాయల నగదు లభించింది. మురళీగౌడ్‌తో కలిసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఇళ్లలోనూ సోదాలు చేశామని ఏసీబీ సీఐ ప్రసాద్‌రెడ్డి చెప్పారు. -
'అవినీతి' రఘు రిటెర్మైంట్ ఫంక్షన్ విదేశాల్లో..!
-
'అవినీతి' రఘు రిటెర్మైంట్ ఫంక్షన్ విదేశాల్లో..!
సాక్షి, విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న కేసులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వి.రఘును అరెస్టు చేసి విశాఖపట్నం తరలించారు. షిర్డీలో రఘు అక్క పేరిట ఉన్న హోటల్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈయన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న రఘు విదేశాలలో గుట్టుగా హైక్లాస్‌లో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌లకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఇప్పటికే విమాన టికెట్లు కూడా బుక్ చేశారు. విశాఖపట్నం కోర్టులో మంగళవారం హాజరుపరచనున్నారు. శివప్రసాద్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు విజయవాడ: అక్రమంగా డబ్బు సంపాదించి దొరికిపోయిన శివప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం కూడా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ టెక్నికల్‌గా పనిచేస్తున్న శివప్రసాద్ ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం శివప్రసాద్ అక్రమంగా కోట్లు తరలించినట్టుగా సోదాల్లో గుర్తించారు. పలు డాక్యుమెంట్లు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివప్రసాద్‌ను గన్నవరం నివాసం నుంచి అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించిన అధికారులు నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 100 కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు. నగలకు సంబంధించి శివప్రసాద్ సతీమణి గాయత్రిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఏసీబీ దాడుల్లో షాకింగ్ నిజాలు!
-
టౌన్ దోపిడీ: ఏసీబీ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకటరఘు, ఆయన బీనామీగా భావిస్తున్న విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపై సోమవారం ఏసీబీ అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు ఆదాయానికి మించి ఆస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు ఆయన, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. చిత్తూరులోని రఘు అత్తం ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, మంగళగిరి, నెల్లూరు, తిరుపతి, షిర్డీలోనూ రఘు బంధువులు ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. 500 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక, విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. గన్నవరం, విజయవాడలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. వందలకోట్ల ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘుకు సమీప బంధువులైన ఏవో వెంకట శివప్రసాద్, ఆయన భార్య గాయత్రి.. ఆయనకు బినామీలుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో టెక్నికల్ ఇంజినీర్‌గా గాయత్రి పనిచేశారు. ఆమె ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీదనే మొత్తం డాంక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. సోదాల్లో ప్రామిసరీ నోట్లు, బంగార అభరణాలు లభించాయి. బంగారు అభరణాల్లో దేవతా విగ్రహాలు, ఊయలలు, జడలు దొరకడం గమనార్హం. గన్నవరంలో 1.40 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మాణం, ఇక్కడే నిర్మాణంలో ఉన్న పలు అపార్ట్మెంట్లలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వేల్పూరులో వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు వీరికి ఉన్నట్టు గుర్తించారు. ఏవో వెంకటశివప్రసాద్కు చెందిన గన్నవరంలోని ఇంట్లో రూ.10కోట్ల విలువైన బంగారం, రూ.50లక్షల నగదు, పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్లు, పేరు లేని ఎంవీఆర్ జ్యుయలరీ బిల్లులు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. కృష్ణాజిల్లా వేల్పూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీమ్ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. రఘుకు షిర్డీలో కూడా ఓ లాడ్జ్ ఉందని, గన్నవరంలోని ఓ రియల్ ఎస్టేట్‌లో శివప్రసాద్ పేరు మీద 300 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏఓ ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. కోట్లల్లో ఆస్తులు.!
విజయవాడ: విజయవాడ ముస్సిపల్ టౌన్ ప్లానింగ్ ఏఓ నల్లూరి వెంకట శివప్రసాద్‌కు చెందిన గన్నవరంలోని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘుకు ఆయన సమీప బంధువు అయిన వెంకట శివప్రసాద్, ఆయన భార్య గాయత్రి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో గాయత్రి టౌన్ ప్లానింగ్‌లో టెక్నికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఇటీవల ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీదనే మొత్తం ఆస్తుల డాక్యుమెంట్లు ఉన్నాయి. గన్నవరంలోని ఇంట్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, రూ.50 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్లు, పేరు లేని ఎంవిఆర్ జ్యూవెల్లరీ బిల్లులు కనుగొన్నారు. అలాగే గన్నవరంలో 1.40 ఎకరాల్లో కళ్యాణ మండపం నిర్మించారు. గన్నవరంలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లో 16 ఫ్లాట్లు, కృష్ణా జిల్లా వేల్పూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు కనుగొన్నారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీమ్ డీఎస్పీ రమాదేవిల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కాగా, రఘుకు షిర్డీలో కూడా ఓ లాడ్జ్ ఉందని, గన్నవరంలోని ఓ రియల్ ఎస్టేట్‌లో శివప్రసాద్ పేరు మీద 300 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అనంతపురం న్యూసిటీ : ‘‘భవన నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్లాన్‌లో పొందుపర్చిన విధంగానే నిర్మాణం ఉండాలి. లైసెన్స్ సర్వేయర్లు ప్లాన్ సక్రమంగా ఇవ్వాలి. అలా చేయని పక్షంలో వారిని బ్లాక్‌లిస్టు జాబితాలో ఉంచాలి’’ అని టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ వెంకటపతి రెడ్డి టీపీఓ, టీపీఎస్‌లకు సూచించారు. బుధవారం నగరపాలక సంస్థలోని కౌన్సిల్ హాల్లో నాలుగు జిల్లాల టీపీఓ, టీపీఎస్‌లకు ఆన్లైన్ బిల్డింగ్ నమోదులో భాగంగా డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్జేడీ మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. నిబంధనలకు అతిక్రమిస్తే భవనాలను కూల్చడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాఫ్ట్‌టెక్ ప్రతినిధి జస్టిన్ మాట్లాడుతూ ఆన్లైన్లో ఫస్ట్, పోస్టు అప్రూవల్ ఇచ్చే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. -
ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
విజయనగరం : విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సీహెచ్‌వీ నారాయణరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. విజయనగరం పట్టణానికి చెందిన బిల్డర్ మురళి అపార్ట్మెంట్ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పనులు ప్రారంభించడానికి అవసరమైన ఎండార్స్మెంట్ కాపీ మంజూరుకు సూపర్వైజర్ నారాయణరావు రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారి సూచనల మేరకు గురువారం సాయంత్రం సూపర్వైజర్ నివాసంలో బాధితుడు మురళి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
అనుమతిచ్చే వారేరి..
ఖాళీగా టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు నాలుగేళ్లుగా ఇన్‌చార్జీలతోనే సరి ఇళ్ల నిర్మాణాలకు లభించని మోక్షం నగర పంచాయతీ ఆదాయంపై ప్రభావం పరకాల : పరకాల నగర పంచాయతీలోని పట్టణ ప్రణాళిక విభాగం కార్యకలాపాలు స్తంభించారుు. గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయినప్పటి నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) లేక పోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ పాలనలో ప్రధాన మైన పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నా లేనట్లుగా మారడంతో నగర పంచాయతీ లక్షలాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. పరకాల 2011 ఆగస్టులో నగర పంచాయతీగా అప్గ్రేడయ్యింది. అప్పటి నుంచి టీపీవో పోస్టులో ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ నగర పంచాయ తీ టీపీవోఇక్కడ ఇన్చార్జిగాఉన్నారు. గతంలో వారానికోసారి వచ్చే అధికారి రెండునెలల నుంచి రావడంలేదు. దీంతో కొత్త ఇళ్ల నిర్మాణాల అనుమతులకోసం వచ్చినదరఖాస్తులు, గతంలో నిర్మించుకు న్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయింపుల్లో జాప్యం జరుగుతున్నది. పర్మినెంట్ టీపీవో లేక ఇక్కట్లు నగర పంచాయతీగా మారి నాలుగేళ్లరుునా టీపీఓగా పూర్తిస్థారుు అధికారిని నియమించలేదు. ఇన్చార్జీలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో టౌన్ ప్లానింగ్ విభా గం.. స్థానికంగా విధులు నిర్వహించే జవాన్ల చేతికి చేరింది. అనుమతులు ఇప్పిస్తామని టీపీవో పేరుతో వేలాది రూపాయలను వసూసూలు చేసిన ఘటనలు ఉన్నాయి. అనుమతులు లేవు.. నంబర్లు రావు నగర పంచాయతీ పరిధిలో కొత్త ఇళ్లు నిర్మించుకుందామని దరఖా స్తు చేసినా అనుమతులు లభించడం లేదు. పట్టణంలో 120కి పైగా కొత్త ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇన్చార్జి రాకపోవడంతో అనుమతి ఇచ్చే వారు కరువయ్యూరు. టీపీవో వస్తేనే పని జరుగుతుందని చెప్పుతుండడంతో దరఖాస్తుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొందరు అనుమతులు లభించకున్నా నిర్మాణాలను చేపట్టారు. ఇలా నిర్మాణం చేసిన ఇళ్లు 450 వరకు ఉన్నాయి. వీటి క్రమబద్ధీకరణ కోసం టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కొత్త ఇంటినంబర్లు రావడంలేదు. దీంతో నగర పం చాయతీకి ఇంటి పన్ను రూపంలో వచ్చే ఆదాయం రాకుండా పో తోంది. ప్రభుత్వం ఇటీవల పట్టణాల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవడానికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) అవకాశాన్ని కల్పించిం ది. ఈ పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అధికారులు జాడలేక పోవడంతో ప్రభుత్వం లక్ష్య నీరుగారుతోంది. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తించే అధికారి లేకపోవడంతో పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నారుు. అ నుమతికోసం చెల్లించాల్సిన ఫీజును చెల్లించకపోవడంతో నగర పం చాయతీకి ఆదాయం రాకుండా పోతోంది. కొంతమంది అధికారులకు ఎంతో కొంతముట్టజెప్పి తమపని పూర్తి చేస్తుకుంటున్నారు.