విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌వీ నారాయణరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.
విజయనగరం : విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌వీ నారాయణరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. విజయనగరం పట్టణానికి చెందిన బిల్డర్ మురళి అపార్ట్‌మెంట్ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పనులు ప్రారంభించడానికి అవసరమైన ఎండార్స్‌మెంట్ కాపీ మంజూరుకు సూపర్‌వైజర్ నారాయణరావు రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. వారి సూచనల మేరకు గురువారం సాయంత్రం సూపర్‌వైజర్ నివాసంలో బాధితుడు మురళి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.