నోటిమాట... నోటు వాటా! | Illegal Structures on the These standards | Sakshi
Sakshi News home page

నోటిమాట... నోటు వాటా!

Published Wed, May 13 2015 4:43 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Illegal Structures on the These standards

 అక్రమ కట్టడాలకు ఇవే ప్రమాణాలు
- ఆర్మూరులో ఓ వ్యాపారి ‘నిర్మాణ’ బాగోతం
- టౌన్‌ప్లానింగ్ నిబంధనలు బేఖాతరు
- 306 దుకాణాల సముదాయం నిర్మాణం
- ఈ ‘డీల్’ వెనుక రూ.150 కోట్ల టర్నోవర్
- చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముం   దుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ప్రణాళిక విభాగానికి దరఖాస్తుతోపాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)కు అనుగుణంగా ఉన్న స్థలం   లో భవనాన్ని ఎంత మేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. నివాస గృహ   మా? బహుళ అంతస్థుల నివాస సముదాయమా? లేక వాణిజ్య సముదాయమా? అన్నది తేలిన అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. వీటిని అధికారులు సుని   శితంగా పరిశీలించాలి. కానీ ఆర్మూరు పురపాలక సంఘం పరిధిలో ఇవేవీ అ మలు కావడంలేదు.

అనుమతులు తీసు కున్న తర్వాత చట్టాలను ఉల్లంఘించి ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో రూ.కోట్లలో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.ఆర్మూరు నడిబొడ్డున ఆర్‌కే కాంప్లెక్స్ వెనుక స్థలంలో వా ణి   జ్య దుకాణాల సముదాయం నిర్మాణం జరుగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇంత జరుగుతున్నా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ‘నిర్మాణాలు ఎలా జరిగితే మాకేం’ అన్న ధోరణితో వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది.

కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలం దక్కించుకుందిలా
బక్రాన్ బీడీ ఫ్యాక్టరీ యజమానులు బ్యాంకులో తనఖా పెట్టిన స్థలాన్ని మొదట బ్యాంకు వారు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల క్రితం బహిరంగ వేలం వేయడంతో పలువురు వ్యాపారులు సిండికేట్‌గా మారి వేలం పాట   లో ఆ భూమిని దక్కించుకున్నారు. బ్యాంకు షరతులు, వేలం పాట నిబంధనల మేరకు భూమిని దక్కించుకున్న సదరు సిండికేట్ వ్యక్తులు కొంత మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించారు.

ఇదే సమయంలో బీడీ కార్మికులు తమకు బక్రాన్ బీడీ ఫ్యాక్టరీ యజమానులు చెల్లించాల్సిన పీఎఫ్ తదితర మొత్తాలు చెల్లించాలంటూ ధర్నాలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం  తో సుమారు పదేళ్ల పాటు వివాదం కొనసాగుతూనే ఉం ది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఒక బడా వ్యాపారి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులందరికీ, వారి డబ్బులు తిరిగి ఇచ్చివేసి 440, 441/1, 441/3 సర్వే నంబర్‌లోని సుమారు పది వేల గజాల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. గతేడాది ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. అక్కడే అక్రమ కట్టడానికి బీజాలు పడ్డాయి.

ఏడాది జాప్యం.. ఇప్పుడు ‘ఉల్లంఘన’
సుమారు పది వేల గజాల స్థలాన్ని కమర్షియల్ కట్టడాలకు వినియోగించుకున్న సందర్భంగా టౌన్ ప్లానింగ్ లేఅవుట్ అనుమతిని పొందాల్సి ఉంటుంది. అందుకు 33 ఫీట్ల వెడల్పుతో రోడ్లు వేయడమే కాకుండా 10 శాతం భూమిని కాలనీ అభివృద్ధి కోసం వదిలి పెట్టాల్సి ఉం  టుంది. ఈ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి సద రు వ్యాపారి ఆధ్వర్యంలో పలువురు బినామీ వ్యక్తుల పేరిట ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. టౌన్ ప్లానిం గ్ లేవుట్ నిబంధనలకు విరుద్దంగా చిన్న చిన్న రోడ్లతో షా పింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ వేసి పేపర్‌పైనే అమ్మకాలు ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 153 షాపు లు, ఫస్ట్ ఫ్లోర్‌లో 153 షాపులతో మొత్తం 306 షాపుల నిర్మాణానికి ప్లాన్ వేయించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆనుకొని మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణం చేస్తామంటూ ప్రచారం చేసారు. అప్పట్లో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుతో భూమి పూజ సైతం చేయించారు.

పేపర్‌పైనే ఒక్కో షాపును రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వర  కు అమ్మకాలు ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకం పనులు మొదలు పెట్టారు. అ   డ్డుగా వచ్చిన రాాళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా డైనమేట్లు పెట్టి తొలగించారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.  ఎన్నికలలోనూ, ఎన్నికల త  ర్వాత కొందరు నేతలను ప్రసన్నం చేసుకుని ఇటీవల మళ్లీ నిర్మాణం ప్రారంభించారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నారుు.

స్పందించని మున్సిపల్ అధికారులు
ఎవరైనా మధ్య తరగతి కుటుంబీకులు ఇళ్లు కట్టుకుంటే నిబంధనల పేరిట ఇబ్బందుల పాలు చేసే మున్సిపల్ అధికారులు పట్టణం నడిబొడ్డున సాగుతున్న అక్రమ నిర్మాణంపై ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఎందుకంటే
ఎందుకంటే ఈ అక్రమ కట్టడం నిర్మాణానికి అనుమతి కోరుతూ వ్యాపారి మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నాడు. వీలు లేదంటూ వారు నోటీసులు సైతం జారీ చేసారు. ఈ అక్రమ కట్టడం గురించి ఆర్మూర్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా, అసలు తమకు అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు రాలేదంటూ అబద్ధపు సమాచారాన్ని అందించారు. వ్యాపారి పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తుం టే అధికారులు, నాయకులు ముడుపుల మోజులో ఆయనకు అండగా నిలుస్తున్నారన్నది బహిరంగ రహస్యంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement