Urban Poverty Alleviation Agency
-
మెప్మా రిసోర్స్ పర్సన్ల సహాయ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో పనిచేస్తున్న మహిళలైన రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు చెల్లించే బాధ్యత నుంచి ఆ సంస్థ పూర్తిగా వైదొలిగింది. కొన్ని నెలలుగా వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.4 వేల మొత్తాన్ని ఏ అకౌంట్ నుంచి ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జనరల్ ఫండ్ నుంచే ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడి మూడు నెలలు గడిచినా.. రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు ఏ ఒక్క మునిసిపాలిటీ/ కార్పొరేషన్లో ఇవ్వలేదు. వారికి 25.38 కోట్ల గౌరవ వేతనాలు ప్రభుత్వం బకాయిపడింది. ఈ నేపథ్యంలో రిసోర్స్ పర్సన్లు నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. మురికివాడల్లో పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం, రికవరీ చేయించడం మినహా ప్రభుత్వం అప్పగించే ఏ పని చేయలేమని అల్టిమేటం ఇచ్చారు. వీఎల్ఆర్, స్త్రీనిధి ఫండ్స్ నుంచే వేతనాలు స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్, పట్టణ వికలాంగుల సమాఖ్యల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 5,765 మంది రిసోర్స్ పర్సన్లు ఉన్నారు. వీరందరికీ నెల వేతనంగా రూ.2.3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మెప్మాలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్‌కు వేతనాల కోసం ప్రత్యేక అకౌంట్ ఏమీ లేదు. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలసి విజ్ఞప్తి చేసినప్పుడల్లా వడ్డీ లేని రుణాలు (వీఎల్ఆర్), స్త్రీ నిధి ఫండ్స్ కింద బడ్జెట్ విడుదల చేసి గౌరవ వేతనాలు అందజేసేవారు. గత నవంబర్ నుంచి ఎవరికీ గౌరవ వేతనం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆర్పీల నుంచి ఒత్తిడి పెరగడంతో గత ఆగస్టు 3న 2018లో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్–164 ప్రకారం ఆర్పీలకు అర్బన్ లోకల్ బాడీల నుంచే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి మెమో జారీ చేశారు. దీంతో మెప్మా నుంచి వేతనాలు వచ్చే అవకాశాలకు ఫుల్స్టాప్ పడింది. మరోవైపు స్థానిక సంస్థలు కూడా రూపాయి కేటాయించలేదు. మెట్పల్లిలో 34 మందికి 9 నెలల వేతనం మెప్మా, స్థానిక పట్టణ సంస్థలేవీ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంతో 5,765 మంది రిసోర్స్ పర్సన్స్ తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీవర్ సర్వే, హరితహారం, నల్లా సర్వే, పారిశుధ్య సర్వే వంటి పలు సేవలతో పాటు అంగన్వాడీ, ఆశ, ఏఎన్ఎం వర్కర్లతో కలసి చేసే పనులేవీ తాము చేయలేమని ఆర్పీలు తేల్చిచెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, కమిషనర్లకు, మెప్మా పీడీలకు లేఖలు ఇవ్వగా, మెట్పల్లి మున్సిపాలిటీ విషయంలో మాత్రమే జగిత్యాల కలెక్టర్ స్పందించారు. మెట్పల్లిలో పనిచేస్తున్న 34 మంది ఆర్పీలకు గత ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు 9 నెలల వేతనం 12.24 లక్షలు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపారు. మంత్రి కేటీఆర్ దయ చూపాలి పట్టణ మురికివాడల్లో పొదుపు సంఘాల ద్వారా ఇతర ప్రభుత్వ సేవల ద్వారా కష్టపడుతున్న రీసోర్స్ పర్సన్లకు నెల నెలకు రూ.4 వేల గౌరవ వేతనం ఇప్పించేందుకు మంత్రి కేటీఆర్ దయ చూపాలి. ప్రభుత్వమే ఆర్పీలకు బడ్జెట్ విడుదల చేయాలి. పండుగ సమయంలో కూడా వేతనాలు లేని పరిస్థితి ఉంది. – సునీత, ఆర్పీల సంఘం అధ్యక్షురాలు -
యువతకు ప్రభుత్వ బాసట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతీ, యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత యువతకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో దీన్‌దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ పట్టణ జీవనోపాదుల పథకం(డీఏవై–ఎన్యూ ఎల్ఎం) మార్గదర్శకాల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 35 మునిసి పాలిటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14 రంగాలలో 28 కోర్సులు పట్టణ ప్రాంతాల్లో ఏడో తరగతి నుంచి డిగ్రీ సమాన విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులు శిక్షణకు అర్హులు. విద్యార్హత, అభ్యర్థుల అభిరుచులకు అనుగుణంగా 14 రంగాల్లో 28 కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం అభ్యర్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ శిక్షణ కేంద్రాలతో యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్ఎస్డీసీ) ద్వారా ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 69 ఉత్తమ శిక్షణ కేంద్రాలను ఎంపిక చేశారు. -
షీ ఆటోలకు బ్రేక్
బ్యాడ్జి నంబర్ తెచ్చిన తంటా ఏడాది అనుభవం తప్పనిసరి అంటున్న రవాణా శాఖ స్పెషల్ కేసుగా పరిగణించాలంటున్న యూసీడీ విజయవాడ సెంట్రల్ : అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి చందంగా ‘షీ’ ఆటోల పరిస్థితి తయారైంది. రోడ్డెక్కకుండానే బ్రేక్ పడింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ)లు వినూత్నంగా నగరంలో ప్రవేశపెడదామనుకున్న షీ ఆటోలకు రవాణా శాఖ రెడ్ సిగ్నల్ వేసింది. నిబంధనల పుణ్యమా అని మరో ఏడాది వరకు షీ ఆటోలు రోడ్డెక్కే ఛాన్స్ లేదు. స్వయం సహాయక సంఘ (డ్వాక్వా) మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలో షీ ఆటోలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. మెప్మా డెరైక్టర్ రాజశేఖర్ రెడ్డి మార్చిలో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించి, 40 ఏళ్ల లోపు వయసు ఉన్న డ్వాక్వా మహిళలను షీ ఆటో శిక్షణకు ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగర పాలక సంస్థ యూసీడీ అధికారులు డివిజన్లలో సదస్సులు నిర్వహించారు. డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించడం, బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయించడంతో పాటు రవాణా శాఖ ద్వారా డ్రైవింగ్ లెసైన్స్ మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. దీనితో పలువురు మహిళల్లో ఆసక్తి నెలకొంది. తొలి విడతగా నగరంలో 117 మంది మహిళలు ఆటో డ్రైవింగ్ నేర్చుకునేందుకు ముందుకు వచ్చారు. పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ, గారపాటి కనుమిల్లి చారిటీస్‌కు మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే బాధ్యతను అప్పగించారు. 45 రోజుల శిక్షణకు సంబంధించి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. మొదటి బ్యాచ్‌కు మే నెలలోనే శిక్షణ పూర్తయింది. కథ అడ్డం తిరిగింది ఆటోల కొనుగోలులో భాగంగా రుణాల మం జూ రు కోసం యూసీడీ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారతీయ స్టేట్‌బ్యాంక్ అధికారులతో చర్చలు సాగించారు. డ్రైవింగ్ లెసైన్సు, షూరిటీలు ఉంటే రుణాలు మంజూరు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తేల్చిచెప్పారు. అక్కడి నుంచి సీన్ రవాణా శాఖకు మారింది. డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన మహిళలకు డ్రైవింగ్ లెసైన్స్, బ్యాడ్జి మంజూరు చేయాల్సిందిగా నగర పాలక సంస్థ అధికారులు కోరారు. మహిళల్లో కొందరు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండక పోవడాన్ని రవాణా శాఖ తప్పుపట్టింది. లెసైన్స్ పొందిన ఏడాది తర్వాత మాత్రమే బ్యాడ్జి నంబర్ మంజూరు చేస్తామని పేర్కొంది. ఇప్పుడు లెసైన్సు మంజూరు చేస్తే ఏడాది తర్వాత కానీ బ్యాడ్జి నెంబర్ వచ్చే పరిస్థితి లేదు. బ్యాడ్జి నంబర్ లేకుండా పబ్లిక్ సర్వీసు చేయడం నేరం కాబట్టి షీ ఆటోలను రోడ్డు ఎక్కనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన మహిళలు అయోమయంలో పడ్డారు.