US Federal law
-
WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
సైపన్/కాన్బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మీడియా ఎదురుచూపులువిచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు. శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు. భార్యను, తండ్రిని హత్తుకుని..ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఇటీవలి ఆకాశాన్నంటిన పసిడి ధరతో బెంబేలెత్తిన కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత బులియన్ మార్కెట్లో ఈ రోజు (గురువారం) బంగారం ధర క్షీణించగా, వెండి కూడా అదే బాటలో ఉంది. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) రాయిటర్స్ నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.59,050కి తగ్గింది. కిలో వెండి రూ. 350 తగ్గి 71,250కి వద్ద ఉంది గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.59,350 వద్ద ముగిసింది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. ధర 210రూపాయలు తగ్గి, 58,750 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. ధర 200 రూపాయలు తగ్గి, 53,850గా ఉంది. అలాగే వెండి కిలో రూ. 400 తగ్గి, 75,700గా ఉంది. -
టెస్లాకు దిమ్మతిరిగే షాక్...!
గత పది సంవత్సరాలుగా అమెరికాలో జాత్యంహాకర దాడులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది 2020లో జార్జ్ ఫ్లాయిడ్ గొంతుపై మోకాలితో ఓ అమెరికన్ పోలీసు అధికారి దాడి చేసిన విషయం తెలిసిందే. జార్జ్‌ఫ్లాయిడ్ మరణం అమెరికాలో భారీ ప్రకంపనలనే సృష్టించింది. మస్క్ కంపెనీలో జాత్యాంహకార వ్యాఖ్యలు..! అమెరికాలో బ్లాక్ లైవ్మ్యాటర్స్ పేరుతో భారీ ఉద్యమమే నడిచిన విషయం తెలిసిందే. జాత్యాంహకార వ్యాఖ్యలను చేయడంలో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ కూడా తక్కువ తినలేదు. 2015లో టెస్లా కంపెనీలో పనిచేసిన ఓ నల్లజాతీయుడుపై జాత్యాంహకార వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి. ఈ విషయంపై యూఎస్ ఫెడర్ కోర్టు తన తీర్పును వెల్లడించింది. కాగా ఈ విషయంపై టెస్లా స్పందించలేదు. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! అసలు ఏం జరిగిదంటే..! నల్ల జాతీయుడైన ఓవెన్ డియాజ్ 2015 లో ఫ్రీమాంట్ ప్లాంట్‌లో పనిచేస్తోన్న సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్ వైట్ అమెరికన్ వేధించాడని, అంతేకాకుండా జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపించాడు. అంతేకాకుండా ఓవెన్ డియాజ్ కోర్డును ఆశ్రయించాడు. తీర్పును ప్రకటించిన కోర్టు... శాన్ ఫ్రాన్సిస్కో యూఎస్ ఫెడరల్ కోర్టులోని జ్యూరీ బృందం అక్టోబర్ 4న తీర్పును వెలువరించింది. అతడిపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని కోర్టు తెలిపింది. డియాజ్ మానసిక క్షోభకు గురైనందుకుగాను నష్టపరిహారంగాను 137 మిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు టెస్లాను ఆదేశించింది. ఈ సందర్భంగా ఓవెన్ డియాజ్ మాట్లాడుతూ...అమెరికాలో నల్లజాతీయులపై జాత్యంహకార వ్యాఖ్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైనవి. నాకు నాలుగు సంవత్సరాల తరువాత న్యాయం దక్కింది. అమెరికాలో అత్యంత ధనిక సంస్థ టెస్లాలో జాత్యాంహకార వ్యాఖ్యలు రావడం కంపెనీకే సిగ్గుచేటు అని పేర్కొన్నారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితం...! -
డ్రీమర్లకు యూఎస్ కోర్టు షాక్!
హూస్టన్: దాదాపు 6 లక్షల మంది వలసదారులను స్వదేశాలకు తరలించకుండా రక్షణ కల్పిస్తున్న డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) చట్టం చెల్లదని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బరాక్ ఒబామా హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంతో ఇప్పటివరకు పలువురు భారతీయ యువతకు రక్షణ లభిస్తూ వచ్చింది. డ్రీమర్స్‌గా పిలిచే ఈ యువతకు శరాఘాతం కలిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో డ్రీమర్స్‌ను రక్షించాలన్న బైడెన్ ప్రభుత్వ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్లయింది. ఈ చట్టం రూపొందించడంలో ఒబామా ప్రభుత్వం పరిధి దాటిందని న్యాయమూర్తి ఆండ్రూ హనెన్ అభిప్రాయపడ్డారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ఈ చట్టాన్ని రూపొందించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా ఈ చట్టం అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం అనైతికమని, అందువల్ల ఇకపై డాకా అప్లికేషన్ల ఆమోదాన్ని నిలిపివేయాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటికే స్వీకరించిన అప్లికేషన్లపై తీర్పు ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. టెక్సాస్ సహా పలు రిపబ్లికన్ రాష్ట్రాలు డాకాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి. ఈ చట్టం కారణంగా తాము అదనపు వ్యయాలు భరించాల్సివస్తోందని ఈ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. తాజాగా డాకాపై తీర్పునిచ్చిన న్యాయమూర్తిని గతంలో బుష్ ప్రభుత్వం నియమించింది. -
వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు
వాషింగ్టన్: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది. మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు. 2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్ పేర్కొన్నారు. 2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది. -
ఫేస్‌బుక్‌కు మరో షాక్
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి విచారణను ఎదుర్కోనుంది. మార్కెట్లో నూతన సంస్థల పోటీని ఎదుర్కోవడానికి వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందన్న అభియోగం నేపథ్యంలోనే విచారణ కొనసాగనుందని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు. ఇదివరకే ఫేస్బుక్ యుఎస్ ఫెడరల్ కమిషన్ దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద సంస్థ అయినా చట్టాన్ని గౌరవించాల్సిందేనని, అయితే ఈ అంశంపై ఫేస్బుక్ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా మా విచారణలో వినియోగదారుల సమాచార భద్రత, ప్రకటనల ధరల పెంచడానికి కారణాలను విశ్లేషించనున్నామని జేమ్స్ అన్నారు. ఇందులో భాగంగానే కొలరాడో, ఫ్లోరిడా, అయోవా, నెబ్రాస్కా, నార్త్ కరోలినా, ఒహియో రాష్ట్ర అధికారులు దర్యాప్తులో తమ వంతు కీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె తెలిపింది. గతంలో ఫేస్బుక్ స్పందిస్తూ ఎవరిపైనా గుత్తాధిపత్యం చేయబోమని ఆన్లైన్లో తమ స్నేహితులను ఏ విధంగా కలుసుకోవాలనేది వినియోగదారుల స్వేచ్చ మేరకే ఆధారపడి ఉంటుందని ఫేస్బుక్ స్పష్టం చేసిన విషయం విదితమే. -
ఒక్కొక్కరికి 2 కోట్ల డాలర్ల సర్కారీ నిధులు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేవలం ప్రచార పర్వానికే ప్రధాన పార్టీలు, అభ్యర్థులు దాదాపు 200 కోట్ల డాలర్లు వ్యయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ఖర్చుల కోసం నిధులు సేకరించుకోవడమే కాదు.. అర్హులైన అభ్యర్థులకు ప్రైమరీల్లో ప్రచారానికి, సాధారణ ఎన్నికల్లో ప్రచారానికి ప్రభుత్వం కూడా నిధులు అందిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు కోట్ల డాలర్లకు పైగా ప్రభుత్వ నిధులు పొందడానికి అర్హులు. అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం.. అధ్యక్ష పదవికి పోటీపడే అధికారిక అభ్యర్థులు తమ ప్రచారానికి సేకరించిన నిధుల జమా ఖర్చుల వివరాలను ప్రతి నెలాఖరులో లేదా మూడు నెలలకోసారి సమాఖ్య ఎన్నికల సంఘానికి (ఎఫ్ఈసీకి) సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి నుంచి 5,400 డాలర్ల వరకూ స్వీకరించవచ్చు. స్వతంత్ర వ్యయ కమిటీలుగా (సూపర్ పీఏసీలు) పిలిచే కొత్త తరహా రాజకీయ కార్యాచరణ సంస్థలు కార్పొరేషన్లు, యూనియన్లు, వ్యక్తుల నుంచి చాలా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి తాము మద్దతిస్తున్న పార్టీ లేదా అభ్యర్థికి నిధులు అందిస్తాయి. దీనిపై గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక చాలా కాలంగా ఉన్న పీఏసీలుగా పిలిచే రాజకీయ కార్యాచరణ సంస్థలు కూడా నిధుల సేకరణలో కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని పీఏసీలను అభ్యర్థులే స్వయంగా నడుపుతారు. కొన్నిటిని పార్టీలు నడుపుతాయి. అలాగే వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన లాబీయింగ్ బృందాలు కూడా పీఏసీలను నిర్వహిస్తాయి. వీటి నిధుల సేకరణ, వ్యయం వివరాలను ఎఫ్ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. తాజా ఎన్నికల కోసం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ నెల 12వ తేదీ వరకూ 42 కోట్ల డాలర్లకు పైగా వ్యయం చేశారు. అందులో న్యాయవాదుల సంస్థలు, న్యాయవాదుల నుంచి సేకరించిన విరాళాలదే సింహభాగం. కమర్షియల్ బ్యాంకుల నుంచీ గణనీయంగా విరాళాలు లభించాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇదే సమయానికి దాదాపు 15 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు. అందులో సేకరించిన నిధులే కాకుండా సొంత డబ్బులూ ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల టైమ్‌లైన్... నవంబర్ 8 - సార్వత్రిక ఎన్నికలు: ఓటర్లు అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా తమ తమ రాష్ట్రాల నుంచి ఎలక్టోరల్ కాలేజీకి ఎలక్టర్లను ఎన్నుకుంటారు. డిసెంబర్ 16 - ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు తమ తమ రాష్ట్రాల నుంచి ఓట్లు వేయడం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. జనవరి 6 - అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి, ఫలితం ప్రకటిస్తారు. జనవరి 20 - ఎన్నికైన అభ్యర్థి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతారు.