US open mens singles final
-
US Open 2022: అటు అన్స్...ఇటు ఇగా
న్యూయార్క్: ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఐదో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ స్వియాటెక్ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్ అరియానా సబలెంక (బెలారస్)పై గెలుపొందగా, జబర్ 6–1, 6–3తో 17వ సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. శనివారం రాత్రి జరిగే ఫైనల్లో స్వియాటెక్‌తో జబర్ తలపడుతుంది. స్వియాటెక్‌కు యూఎస్ ఓపెన్ ఫైనల్ కొత్త కానీ... ఆమె ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. 2020, 2022లలో ఈ పోలండ్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. మరో వైపు జబర్ ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరింది. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ట్యునీషియా అమ్మాయి ఈ సారి ‘గ్రాండ్’ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. శ్రమించిన టాప్‌సీడ్... తొలి సెమీ ఫైనల్లో టాప్‌సీడ్ స్వియాటెక్‌కు ప్రత్యర్థి సబలెంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొదటి సెట్లో రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంక అదే ఉత్సాహంతో సుదీర్ఘంగా జరిగిన ఐదో గేమ్‌ను గెలుచుకుంది. 8, 9 గేమ్‌లను చకచకా ముగించి తొలిసెట్‌ను వశం చేసుకుంది. తర్వాత రెండో సెట్లో స్వియాటెక్ పుంజుకోవడంతో సబలెంక చేతులెత్తేసింది. వరుస రెండు గేముల్ని అవలీలగా గెలుచుకున్న స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో పోటీ ఎదురైంది. ఆ గేమ్ సబలెంక గెలిచినా... తదుపరి మూడు గేముల్లో తన రాకెట్ పదునేంటో చూపించిన స్వియాటెక్ 6–1తో సెట్ నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడిన సబలెంక 2–0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో మూడు, నాలుగు గేముల్లో ఏస్‌లు, విన్నర్లు కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ 2–2తో సమం చేసింది. ఆ తర్వాత రెండు గేముల్ని పట్టుదలగా ఆడిన బెలారస్ స్టార్ 4–2తో ఒత్తిడి పెంచింది. ఈ దశలో నంబర్‌వన్ తన అసలైన ప్రదర్శనతో వరుసగా నాలుగు గేములు గెలిచింది. 2 ఏస్‌లు సంధించిన స్వియాటెక్ 3 డబుల్‌ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్‌లు కొట్టి ఏడుసార్లు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెమీఫైనల్లో ఐదో సీడ్ జబర్ అలవోకగా ప్రత్యర్థి ఆటకట్టించింది. 8 ఏస్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని జబర్ వరుస సెట్లలో కేవలం 66 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను ఏకపక్షంగా 21 విన్నర్లు కొట్టిన జబర్ 15 అనవసర తప్పిదాలు చేయగా, రెండు ఏస్‌లు సంధించిన గార్సియా, 23 అనవసర తప్పిదాలు చేసింది. -
ఎమ్మా రాడుకాను ఆట చూడతరమా
-
Novak Djokovic: జొకోవిచ్.. ఇదేం ఆటిట్యూడ్ గురూ!
ఆయనో టెన్నిస్ ఛాంపియన్. ఎన్నో విజయాలు.. ఖాతాలో ఎన్నో గ్రాండ్ స్లామ్ టోర్నీలు. పైగా ర్యాంకింగ్‌లోనూ నెంబర్ వన్. కోట్లలో అభిమానులు. కానీ, అదే స్థాయిలో ద్వేషించేవాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం.. ఆట ఆడడం కన్నా కోర్టులో ఆయన ప్రవర్తించే తీరు. యూఎస్ ఓపెన్ 2021 ఫైనల్ సాక్షిగా అది మరోసారి బయటపడింది. ‘ఇదేం ఆటిట్యూడ్ గురూ!’ అంటూ.. జొకోవిచ్‌ను సోషల్ మీడియా ఏకీపడేస్తోంది. ఆటలో నిజాయితీ, అవతలి ఆటగాడిపై గౌరవం, ఓడినా గెలిచినా స్పోర్టివ్‌గా తీసుకునే తత్వం.. ఇవేవీ 34 ఏళ్ల సెర్బియన్ టెన్నిస్ ఛాంపియన్‌లో లేవనే చాలామంది చెప్పేస్తుంటారు. జొకోవిచ్‌కు హేటర్స్ ఎక్కువే. కానీ, ఆ హేటర్స్ ఇగ్నోర్ చేసేంత రేంజ్లో లేకపోవడమే అసలు సమస్య. అది యూఎస్ ఓపెన్ ఫైనల్ మరోసారి వెల్లడైంది. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్(25) చేతిలో వరుస సెట్స్ ఓడిపోతూ ఉంటే.. ఆ కోపాన్ని తట్టుకోలేక రాకెట్‌ను నేలకేసి విరకొట్టాడు జొకోవిచ్. అందుకే మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రౌడ్ నుంచి కాసేపు ‘బూ’ నినాదాలు వినిపించాయి. ఇక ఓడిపోతున్నాననే ఫ్రస్టేషన్‌ను బాల్ గర్ల్‌పై చూపించబోయాడు. ఇలా రెండుసార్లు ఇలా జరిగింది. కాస్తుంటే ఆ రాకెట్‌ను అమ్మాయిపై విసిరిసేవాడేమో. సరే విసిరేయలేదు కదా అనుకున్నా.. అలాంటి ప్రవర్తన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. Don’t try this at home. ⚠️ @DjokerNole | #USOpen pic.twitter.com/2lwjlyzUV0 — Live Tennis (@livetennis) September 12, 2021 జోకర్ బెస్టే కానీ.. అభిమానులు.. అభిమానించని వాళ్లూ జొకోవిచ్‌ను ‘జోకర్’(Djocker) అని ముద్దుగా పిలుస్తుంటారు. అందుకు కారణం.. కోర్టులో అతని ప్రవర్తన. బేసిక్‌గా సరదా మనిషి అయిన జొకోవిచ్.. కోర్టులో కోతి చేష్టలతో చూసేవాళ్ల పెదాలపై నవ్వులు పూయిస్తుంటాడు. ఒక్కోసారి క్రౌడ్ దగ్గరగా వెళ్లి ఇంటెరాక్షన్ కావడంతో పాటు సందర్భానికి తగ్గట్లు ఆట మధ్యలోనే సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శిస్తుంటాడు. సిల్లీ హ్యబిట్స్తో పాటు ఫన్నీ గెస్చర్స్‌తో నవ్విస్తుంటాడు. అందుకే జోకర్ అనే పేరు ముద్రపడింది. అయితే ఇతర ఆటగాళ్లను సైతం ఇమిటేట్ చేసే జొకోవిచ్.. ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు కూడా. రికార్డుల మీద, విజయాల ఉన్న ధ్యాస.. కోర్టులో ఎలా ప్రవర్తించడం అనేదాని మీద ఉండదనేది జొకోవిచ్ మీద ఉన్న ప్రధాన ఫిర్యాదు. ఇదే విషయాన్ని టెన్నిస్ దిగ్గజాలు సైతం చాలా ఇంటర్వ్యూలలో ఖుల్లాగా చెప్పేస్తుంటారు. ఆ లెక్కన ఈ ప్రపంచ ఛాంపియన్ అసలు ‘ఫెయిర్ ప్లేయర్’ కాదనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూడుస్తున్న మాట. He wanted to. 😡 @DjokerNole | #USOpen pic.twitter.com/ki0vz5Qw34 — Live Tennis (@livetennis) September 12, 2021 కొత్తేం కాదు.. మ్యాచ్ మధ్యలో జొకోవిచ్‌కు ఈ తరహాలో ప్రవర్తించడం కొత్తేం కాదు. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పోరు సందర్భంగా రాకెట్‌ను దూరంగా విసిరిపడేశాడు. అంతకు ముందు చాలాసార్లు చేశాడు. అయినా ఆటలో గెలుపోటములు సహజం. కానీ, ఒక ఛాంపియన్ హోదాలో ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్న అభిప్రాయం హేటర్స్ నుంచే కాదు.. సీనియర్స్ నుంచి, అతన్ని అభిమానించే వాళ్ల నుంచి సైతం వినిపిస్తోంది ఇప్పుడు. Djokovic just tossed his racquet into the stand. No warning. pic.twitter.com/TMCv29dCnQ — . (@Ashish__TV) July 31, 2021 చదవండి: US Open 2021- ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్! -
గెలుపును ఊహించని విజేతలు వీళ్లు
-
యూఎస్ ఓపెన్ ఫైనల్లో పెను సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ 2021లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో జకోను ఓడించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుతో పాటు కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధిద్దామనుకున్న జకో ఆశలపై నీళ్లు చల్లాడు. The moment @DaniilMedwed did the unthinkable. pic.twitter.com/rucHjhMA63 — US Open Tennis (@usopen) September 12, 2021 ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ తుది సమరంలో ప్రపంచ నంబర్ 2 ఆటగాడు మెద్వెదెవ్, జకోవిచ్ నువ్వానేనా అన్నట్లుగా ఆడారు. మెద్వెదెవ్ అద్భుత ఆటతో తొలి సెట్‌ను 6-4 తేడాతో గెలిచుకుని జకోవిచ్‌పై పైచేయి సాధించాడు. రెండో సెట్లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్ బ్రేక్‌లతో విరుచుకుపడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరింది. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మెద్వెదెవ్ 6-4తో రెండో సెట్‌ను సైతం కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో 34 ఏళ్ల జకోవిచ్ మొదట తేలిపోయినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ 25 ఏళ్ల మెద్వెదెవ్ విజయాన్ని 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను కూడా మెద్వెదెవ్ 6-4 తేడాతో గెలిచుకుని అర్ధశతాబ్దం తర్వాత నమోదవుతుందనుకున్న కెరీర్ గ్రాండ్‌స్లామ్ రికార్డుకు బ్రేకులు వేశాడు. 2019లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి ఓటమి పాలైన మెద్వెదెవ్ ఎట్టకేలకు ఈసారి టైటిల్ అందుకున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన నిలిచిన జకో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామనకున్నాడు. అయితే జకో ఆశలపై మెద్వెదెవ్ నీళ్లు చల్లాడు. కాగా, మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రెడుకాను (బ్రిటన్) విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: ఐపీఎల్ ప్యానెల్లో వివాదాస్పద వ్యాఖ్యాతకు నో ప్లేస్.. -
జొకోవిచ్‌తో తలపడనున్న నాదల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు నొవాక్ జొకోవిచ్‌తో రఫెల్ నాదల్ తలపడనున్నాడు. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ నాదల్(స్పెయిన్)ల మధ్య పోరుపై అభిమానుల్లో ఆలసక్తి నెలకొంది. సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే వీరిద్దరూ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరిద్దరూ తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అయిన యూఎస్ ఓపెన్‌లో అంతిమ సమరం చేయనున్నారు.