U.S open tournment
-
ఫైనల్లో సెరెనా, వొజ్నియాకి
ఫైనల్ నేటి రాత్రి గం. 9.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం టాప్-10లో ఎనిమిది మంది సీడెడ్ క్రీడాకారిణులు ప్రిక్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించడంతో అందరి దృష్టి టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకిలపైనేపడింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఈ ఇద్దరు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా అంతిమ సమరానికి అర్హత సాధించారు. యూఎస్ ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ సాధించడంతోపాటు కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకు సెరెనా... గతంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించినా ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న తొలి ‘గ్రాండ్‌స్లామ్’ విజయాన్ని రుచి చూసేందుకు వొజ్నియాకి నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు. న్యూయార్క్: ఈ ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరలేకపోయిన ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సొంతగడ్డపై మాత్రం తన జోరు కొనసాగిస్తోంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ నల్లకలువ వరుసగా నాలుగో ఏడాది టైటిల్ పోరుకు చేరుకుంది. ఇదే టోర్నీలో 2011లో రన్నరప్‌గా నిలిచిన సెరెనా 2012, 2013లలో విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సెరెనా 6-1, 6-3తో 17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై అలవోకగా గెలిచింది. కేవలం 60 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు వచ్చిన ఆరుసార్లూ ఆమే పాయింట్లు సాధించింది. యూఎస్ ఓపెన్‌లో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరిన సెరెనా ఈసారి తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. అంతేకాకుండా గత ఆరు మ్యాచ్‌ల్లో ఆమె ఒక సెట్లో గరిష్టంగా మూడు గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. నాలుగేళ్ల తర్వాత...: డెన్మార్క్ భామ వొజ్నియాకి 2009 తర్వాత రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి చేరుకుంది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి షుయె పెంగ్ (చైనా)తో జరిగిన సెమీఫైనల్లో వొజ్నియాకి 7-6 (7/1), 4-3తో ఆధిక్యంలో ఉన్నదశలో గాయం కారణంగా పెంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో వొజ్నియాకిని విజేతగా ప్రకటించారు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయిన పెంగ్ రెండో సెట్ ఎనిమిదో గేమ్ జరుగుతున్న సమయంలో కాలి కండరాలు పట్టేయడంతో కోర్టులోనే కుప్పకూలిపోయింది. నిర్వాహకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 2009 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి... కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఎనిమిది వేర్వేరు మంది... సెరెనా, వొజ్నియాకి ఫైనల్‌కు చేరడంతో... 37 ఏళ్ల తర్వాత ఒకే సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఎనిమిది మంది వేర్వేరు క్రీడాకారిణులు ఫైనల్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నా లీ (చైనా), సిబుల్కోవా (స్లొవేకియా); ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా (రష్యా), సిమోనా హలెప్ (రుమేనియా); వింబుల్డన్‌లో క్విటోవా (చెక్ రిపబ్లిక్), బౌచర్డ్ ఫైనల్లోకి చేరారు. ఈసారి యుఎస్ ఓపెన్‌లో నా లీ బరిలోకి దిగకపోవడం... మిగతా ఏడుగురు ప్రిక్వార్టర్ ఫైనల్లోపే ఓడిపోయారు. -
96 ఏళ్ల తర్వాత...
సెమీస్‌కు చేరిన జపాన్ క్రీడాకారుడు వావ్రింకాపై నిషికోరి గెలుపు జొకోవిచ్, సెరెనాల దూకుడు మిక్స్డ్ ఫైనల్లో సానియా జోడి యూఎస్ ఓపెన్ జపాన్ క్రీడాకారుడు నిషికోరి 96 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు. 1918 తర్వాత తన దేశం తరఫున యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. వావ్రింకాతో గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన నిషికోరి ఈసారి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరాటంలో పైచేయి సాధించాడు. మరోవైపు జొకోవిచ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. న్యూయార్క్: పట్టు వదలకుండా పోరాడిన జపాన్ క్రీడాకారుడు కీ నిషికోరి... యూఎస్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో 10వ సీడ్ నిషికోరి 3-6, 7-5, 7-6 (9/7), 6-7 (5/7), 6-4తో ప్రపంచ 4వ ర్యాంకర్, మూడోసీడ్ స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. దీంతో 96 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరిన జపాన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చివరిసారి 1918లో ఇచియా కుమాగే సెమీఫైనల్‌కు చేరాడు. 4 గంటలా 15 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. రెండో గేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి వావ్రింకా తొలిసెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండోసెట్ ఎనిమిదో గేమ్‌లో వావ్రింకా మూడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నా.. 12వ గేమ్‌లో నాలుగో డబుల్ ఫాల్ట్ చేయడంతో సెట్ చేజారింది. 5-2 ఆధిక్యంతో మూడోసెట్‌ను ప్రారంభించిన నిషికోరి తొమ్మిదో గేమ్‌లో సెట్ పాయింట్‌ను కోల్పోయాడు. దీంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నిషికోరి బ్యాక్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించాడు. నాలుగోసెట్లో మూడు గేమ్‌ల తర్వాత బొటన వేలికి చికిత్స తీసుకున్న 24 ఏళ్ల నిషికోరి ఆ తర్వాత వావ్రింకాను కోలుకోనివ్వలేదు. ఐదోసెట్లో ఐదు, పది గేమ్‌ల్లో వావ్రింకా బ్రేక్ పాయింట్‌ను కోల్పోవడంతో నిషికోరికి విజయం దక్కింది. ఓవరాల్‌గా మ్యాచ్ మొత్తంలో 18 ఏస్‌లు సంధించిన వావ్రింకా 78 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 10 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. జొకోవిచ్ జోరు మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/1), 6-7 (1/7), 6-2, 6-4తో 8వ సీడ్ అండీ ముర్రే (బ్రిటన్)పై నెగ్గి వరుసగా ఎనిమిదోసారి యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. దాదాపు మూడున్నర గంటలు సాగిన ఈ మ్యాచ్‌లో ముర్రే వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డాడు. అద్భుతమైన డిఫెన్సివ్ ఆటతీరును చూపెట్టిన జొకోవిచ్ 16 బ్రేక్ పాయింట్లలో 12 కాపాడుకున్నాడు. 48 అనవసర తప్పిదాలు చేశాడు. ముర్రే 65 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. సెరెనా దూకుడు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) జైత్రయాత్రను కొనసాగిస్తోంది. క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-3, 6-2తో 11వ సీడ్ ఫ్లావియా పెన్నెటా (ఇటలీ)పై నెగ్గి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్‌ఫైనల్ ఆడుతున్న అమెరికన్‌కు పెన్నెటా గట్టిపోటీనే ఇచ్చింది. కేవలం 8 నిమిషాల్లోనే... తన సర్వీస్‌లో రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని 3-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ తర్వాతి ఆరు గేమ్‌లను నిలబెట్టుకున్న సెరెనా అర్ధగంటలో సెట్‌ను ముగించింది. రెండో సెట్ తొలి గేమ్‌లో సెరెనా రెండు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. తర్వాతి రెండు గేమ్‌లను పెన్నెటా సొంతం చేసుకుంది. కానీ చివరి ఐదు గేమ్‌ల్లో జోరును కనబర్చిన సెరెనా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మిక్స్డ్ ఫైనల్లో సానియా జోడి భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడి... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా జంట 7-5, 4-6 (10/7)తో యంగ్ జన్ చాన్ (తైపీ) -రాస్ హచిన్స్ (జర్మనీ)పై నెగ్గింది. గంటా 33 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-సోరెస్ ఓవరాల్‌గా 73 పాయింట్లు సాధించారు. -
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో గత ఏడాది ఫైనల్ మ్యాచ్ ఈసారీ పునరావృతం కానుంది. వరుసగా రెండో ఏడాది టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. కెరీర్లో 17వ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై సెరెనా గురిపెట్టగా... గత ఏడాది సెరెనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకొని తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాలని అజరెంకా పట్టుదలతో ఉంది. న్యూయార్క్: కొత్త చరిత్ర సృష్టించేందుకు సెరెనా విలియమ్స్ మరో విజయం దూరంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందుతుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)తో సెరెనా తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-3తో ఐదో సీడ్ నా లీ (చైనా)పై; అజరెంకా 6-4, 6-2తో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)పై గెలిచారు. ముఖాముఖి రికార్డులో 31 ఏళ్ల సెరెనా 12-3తో 24 ఏళ్ల అజరెంకాపై ఆధిక్యంలో ఉంది. అయితే యూఎస్ ఓపెన్‌కు ముందు జరిగిన సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో సెరెనాపై అజరెంకా గెలిచింది. ఏకపక్షంగా ఈ సీజన్లో ఏకంగా ఎనిమిది టైటిల్స్ సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్న సెరెనా సొంతగడ్డపై ఎదురులేని ఆటతీరుతో దూసుకుపోతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఈ నల్లకలువ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. 1988లో 128 మంది క్రీడాకారిణులతో కూడిన ‘డ్రా’ మొదలైన తర్వాత మేరీ పియర్స్ (1994 ఫ్రెంచ్ ఓపెన్; 10 గేమ్‌లు), స్టెఫీ గ్రాఫ్ (1988 యూఎస్ ఓపెన్; 13 గేమ్‌లు) అనంతరం తక్కువ గేమ్‌లు కోల్పోయి ఫైనల్‌కు చేరిన మూడో క్రీడాకారిణిగా సెరెనా నిలిచింది. ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో సెరెనా కేవలం 16 గేమ్‌లను మాత్రమే చేజార్చుకుంది. ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సెరెనాకు సెమీస్‌లోనూ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి సెట్లో నా లీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు రెండో సెట్లో కాస్త పోటీ ఎదురైంది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సెరెనా వెంటనే తేరుకొని నా లీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 77 నిమిషాల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పెనెట్టా జోరుకు బ్రేక్ ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన అన్‌సీడెడ్ ఫ్లావియా పెనెట్టా జోరుకు అజరెంకా బ్రేక్ వేసింది. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 18 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ అజరెంకా కీలకదశలో బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌ను వశం చేసుకుంది. తొలి సెట్లో ఈ ఇద్దరూ తడబడ్డారు. స్థిరమైన ఆటతీరును కనబర్చడంలో విఫలమయ్యారు. తొలి సెట్లోని తొలి పది గేముల్లో ఏకంగా ఏడు బ్రేక్ పాయింట్లు వచ్చాయి. అయితే 10 నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో అజరెంకా సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 52 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో సెట్లోనూ అజరెంకా తన ఆధిపత్యాన్ని చాటుకొని కెరీర్లో నాలుగోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో స్థానాన్ని సంపాదించింది. పురుషుల డబుల్స్ ఫైనల్ పేస్, స్టెపానెక్ x పెయా, సోరెస్ రాత్రి గం. 10.00 నుంచి మహిళల సింగిల్స్ ఫైనల్ సెరెనా x అజరెంకా అర్ధరాత్రి గం. 2.00 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -

ఎదురులేని నాదల్
న్యూయార్క్: గాయంతో ఏడు నెలల పాటు ఆటకు దూరమైన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మళ్లీ గాడిలో పడ్డాడు. కచ్చితమైన సర్వీస్, బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో బ్యాక్‌హాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో మునుపటి ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఫిబ్రవరిలో పునరాగమనం తర్వాత తొమ్మిది టైటిల్స్ గెలిచిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ యూఎస్ ఓపెన్‌లోనూ అదరగొడుతున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో రెండోసీడ్ నాదల్ 6-0, 6-2, 6-2తో సహచరుడు, 19వ సీడ్ టోమి రొబ్రెడో (స్పెయిన్)పై విజయం సాధించాడు. తద్వారా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్.. యూఎస్ ఓపెన్‌లో అతి తక్కువ సమయం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. టోర్నీ మొత్తంలో ఒక్కసారి కూడా సర్వీస్ (67సార్లు) కోల్పోని నాదల్ ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించాడు. సహచరుడి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలిసెట్‌ను 22 నిమిషాల్లోనే ముగించాడు. మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని, రెండుసార్లు సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. రెండో సెట్లో రొబ్రెడో కాస్త పుంజుకున్నట్లు కనిపించినా... ప్రత్యర్థి బలమైన స్ట్రోక్స్ ముందు నిలవలేకపోయాడు. నాదల్ నెట్ వద్ద నాలుగు పాయింట్లు గెలుచుకుని రెండు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఏస్‌లను సంధించడంతో పాటు ఏడో గేమ్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోనూ నెట్ వద్ద మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐదు, ఏడో గేమ్‌ల్లో బ్రేక్ పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో నాదల్ 28 విన్నర్లు సాధిస్తే... రొబ్రెడో 10తో సరిపెట్టుకున్నాడు. అయితే కీలక సమయంలో రొబ్రెడో డబుల్ ఫాల్ట్ (4) చేయడంతో పాటు 21సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఫెరర్ పోరాటం వృథా మరో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 6-3, 6-1, 4-6, 2-6, 6-3తో నాలుగోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో 1999 తర్వాత సెమీస్‌కు చేరిన తొలి ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దాదాపు మూడు గంటలా 38 నిమిషాల పాటు జరిగిన ఐదు సెట్ల పోరాటంలో ఇద్దరు ఆటగాళ్లు చెరో రెండు సెట్లు గెలుచుకున్నారు. అయితే నిర్ణయాత్మక ఆఖరి సెట్ ఆరోగేమ్‌లో ఫెరర్ డబుల్ ఫాల్ట్ చేయడం గాస్కెట్కు కలిసొచ్చింది. దీంతో పుంజుకున్న గాస్కెట్ సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో గాస్కెట్ 52 విన్నర్లు, 6 ఏస్‌లు సంధించాడు. 14 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. నెట్ వద్ద మెరుగ్గా ఆడిన ఫెరర్.. సర్వీస్‌లను నిలబెట్టుకోవడంలో కాస్త ఇబ్బందిపడ్డాడు. సెమీస్‌లో గాస్కెట్... నాదల్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అజరెంకా జోరు మహిళల సింగిల్స్‌లో రెండోసీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) జోరు కొనసాగుతోంది. క్వార్టర్ఫైనల్లో అజరెంకా 6-2, 6-3తో వరుస సెట్లలో డానియెల్ హంతుచోవా (స్లొవేకియా)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. గంటా 16 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా ఏమాత్రం తడబడలేదు. ఆరంభంలో లభించిన మూడు బ్రేక్ పాయింట్లను చక్కగా సద్వినియోగం చేసుకుని ఆధిక్యం సంపాదించింది. తర్వాత సర్వీస్‌ను కాపాడుకుంటూ సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో హంతుచోవా పుంజుకోవడంతో బెలారస్ క్రీడాకారిణికి ఇబ్బంది ఎదురైంది. దీంతో 0-2తో వెనుకబడి పోయింది. అయితే హంతుచోవా వరుస తప్పిదాలు చేయడం అజరెంకాకు కలిసొచ్చింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లి సెట్‌ను, మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మహిళల సెమీఫైనల్ నేడు సెరెనా (1) x నా లీ (5) పెనెట్టా x అజరెంకా (2) రాత్రి గం. 10.00 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం