Users concerned
-
Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌కు ఏమైంది? యూజర్ల గగ్గోలు, మీమ్స్ వైరల్
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సేవలు నిలిచిపోవడం యూజర్లలో గందర గోళానికి తీసింది. తాజాగా మెటా సొంతమైన ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిందంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. ఇన్‌స్టాలో సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు యూజర్లు సోషల్ మీడియాలో సోమవారం ఫిర్యాదు చేశారు. తమ ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఒక అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు వినియోగదారులు వాపోయారు. వినియోగదారులు తమ ఖాతాలకు తిరిగి లాగిన్ చేయడంలో సమస్యలు, అకౌంట్ సస్పెండ్ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు ట్విటర్లో వెల్లువెత్తాయి. తమ ప్రొఫైల్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నామని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయినట్టు కనిపిస్తోంది లేదంటే..నాఅకౌంట్ బ్లాక అయిందా అంటూ ఒక వినియోగదారు సోమవారం ట్వీట్ చేశారు. ఏకంగా తమ ఖాతా 30 రోజుల పాటు సస్పెండ్ అనే మెసేజ్‌తోపాటు శాశ్వతంగా నిలిపివేసే ప్రమాదం ఉందనే అలర్ట్ వచ్చిందంటూ ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు తమ ఫాలోవర్ల సంఖ్య కూడా పడిపోయిందని తెలిపారు. All of us coming to twitter to confirm instagram is down #instagramdown pic.twitter.com/DT6BthlNDK — cesar (@jebaiting) October 31, 2022 #instagramdown again. The only ones who never disappoint me pic.twitter.com/yeWxZurwvn — Mr bean (@thisbeann) October 31, 2022 Me trying to recover my Instagram account #instagramdown pic.twitter.com/3cOPNCBX2w — sparsh kanak (@kanak_sparsh) October 31, 2022 దీంతో ఈ వార్త ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. Me apologising to my wifi after finding out Instagram is down #instagramdown pic.twitter.com/wk0I5XT91e — ABSOLUT VODKA (@VodkaTweetz) October 31, 2022 My account was blocked, anyone with the same problem? #instagramdown #instagramerror #instadown #Instagramcrashing pic.twitter.com/y4M7rmrzXq — ThatGirl. (@claudiahellen_) October 31, 2022 -
వాట్సాప్ కలకలం: స్పందించిన సంస్థ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇంటస్టెంట్ మెసేజ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ సేవలు నిలిచి పోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ పనిచేయడం లేదంటూ ట్విటర్లో వేలాది మంది యూజర్లు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో వాట్సాప్ ఎర్రర్, వాట్సాప్ డౌన్ హ్యాష్‌ట్యా గ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి. దీంతో సంస్థ స్పందించింది. ప్రస్తుతం కొంతమందికి మెసేజెస్ పంపడంలో సమస్య ఉందని గుర్తించాం. ఈ సమస్యలను వీలైనంత త్వరగా సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే అందరికీ సేవలను అందుబాలుఓకి తీసుకొస్తామని మెటా కంపెనీ ప్రతినిధి తెలిపారు. వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మరోవైపు వాట్సాప్ సేవలకు అంతరాయం రావడంతో దేశవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు సోషల్ మీడియాలో జోక్స్, సెటైర్లతో తమ స్పందన తెలియ జేస్తున్నారు. #UPDATE | "We're aware that some people are currently having trouble sending messages and we're working to restore WhatsApp for everyone as quickly as possible," says Meta Company Spokesperson — ANI (@ANI) October 25, 2022 Pics not getting uploaded, messages showing single tick!! Is WhatsApp down for everyone? #whatsappdown pic.twitter.com/yGqNXFxL1i — Divyanshu Dubey (@itsdivyanshu) October 25, 2022 People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ — Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022 -
ఘాటెక్కిన పచ్చిమిర్చి
- మార్కెట్లో రిటైల్‌గా కిలో రూ.60 - నగరానికి తగ్గిన సరఫరా - కూరగాయల ధరలు పైపైకి సాక్షి, సిటీబ్యూరో : నగర మార్కెట్లో పచ్చిమిర్చి ధర వీర విహారం చేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.20 మేర ధర పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పచ్చిమిర్చి ధర కేజీ రూ.60కి చేరింది. ఇదే సరుకు హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.40 ఉండగా, రైతుబజార్లో మాత్రం రూ.43కు విక్రయిస్తున్నారు. కేజీ ధర చెబితే కొనరన్న ఉద్దేశంతో వ్యాపారులు పావు కిలో రూ.15 చెప్పి అమ్ముతున్నారు. మే నెలాఖరు వరకు కేజీ రూ.23 లభించిన మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. స్థానికంగా మిర్చి దిగుబడి పూర్తిగా పడిపోవడంతో ఇతర రాష్ట్రాల దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, అనంతపూర్ జిల్లాల నుంచి నగరానికి మిర్చి దిగుమతి అవుతోంది. అయితే... ఇటీవల అక్కడ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో హైదరాబాద్‌కు సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా డిమాండ్- సరఫరాల మధ్య అంతరం పెరగడంతో వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధర పెంచేశారు. వారం రోజుల క్రితం ధరలతో ప్రస్తుత ధరను పోల్చి చూస్తే రూ.20మేర పెరుగుదల కన్పిస్తోంది. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే మిర్చి ధరకు రెక్కలు రావడంతో ఈ ప్రభావం ఇతర కూరగాయలపైనా పడింది. మొన్నటివరకు కేజీ రూ.30 పలికిన టమోటా ఇప్పుడు రూ.40కి చేరింది. అలాగే దొండ, దోస, బీర, కాకర, తదితర రకాల ధరలు కూడా రూ.2-8 వరకు పైకి ఎగబాకాయి. ఇక క్యారెట్, చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. కేజీ రూ.60-80 ధర పలుకుతుండటంతో వాటివైపు చూసేందుకు కూడా వారు సాహసించలేక పోతున్నారు. తగ్గిన సరఫరా : నగర అవసరాలకు నిత్యం 200-250 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. అయితే... ఇప్పుడు 100-130 టన్నులకు మించి సరుకు దిగుమతి కావ ట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే టమోటా కూడా రోజుకు 600 టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం 400 టన్నులు మాత్రమే దిగుమతవుతోంది. కర్నూలు, అనంతపూర్, గుంటూరు, ప్రాంతాల్లో మిర్చికి... మదనపల్లి, బెంగళూరుల్లో టమోటాకు డిమాండ్ అధికంగా ఉండటంతో నగర అవసరాలకు తగినంత సరుకు సరఫరా కావట్లేదని తెలుస్తోంది. సరఫరా తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు నమ్మబలుకుతున్నారు. అన్ని వర్గాలవారు నిత్యం కూరల్లో వినియోగించే టమోట, మిర్చి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులను కలవరపెడుతోంది. అయితే... టమోట, మిచ్చి, ఉల్లి ధరలు అదుపుతప్పకుండా చూసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి ‘మన కూరగాయల’ స్కీం కింద నగరంలో 50 ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసి టమోట, ఉల్లిని హోల్‌సేల్ ధరకే విక్రయిస్తున్నారు. కానీ ఇవి నగరమంతటా లేకపోవడంతో వినియోగదారులందరికీ అందని పరిస్థితి ఎదురైంది. -
ఆధార్ అనుసంధానంతో ఇక్కట్లు..
విజయనగరం కంటోన్మెంట్ : గ్యాస్ కనెక్షనలకూ ఆధార్ అనుసంధానం చేస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నా రు. జిల్లాలోప్రస్తుతం రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం జరుగుతు న్న విషయంతెల్సిందే. ఆధార్ అనుసంధా నం చేయడం వల్లే జిల్లా వ్యాప్తంగా 8493 రేషన్‌కార్డులను బోగస్‌గాగుర్తించిఏరివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బోగస్ గ్యాస్ కనెక్షన్లుఏరివేసేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. అయితే గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేయడం కూడా కష్టంగా మారుతోంది. ఉదాహరణకు జిల్లా కేంద్రంలోని జొన్నగుడ్డికి చెందిన నారాయణమ్మ అనే పేద మహిళకు 2008లో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరైంది. అయితే ఆ సమయంలో సబ్సిడీ సొమ్ము కట్టలేని నారాయణమ్మ ఆ కనెక్షన్‌ను తనకు తెలిసిన నాయుడుబాబుకు అమ్మేసింది. అనంతరం నాయుడుబాబు అదే కనెక్షన్‌ను చిట్టెమ్మ అనే మరోమహిళకు అమ్మేశాడు. ప్రస్తుతం నారాయణమ్మ గ్యాస్ కనెక్షన్‌ను చిట్టెమ్మ వినియోగిస్తోంది. అయితే ఐదేళ్ల కిందట నారాయణమ్మ చనిపోయింది. ఆ మెకు ఆధార్‌కార్డు కూడాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిట్టెమ్మ తను వినియోగిస్తున్న గ్యాస్ కనెక్షన్‌కు నారాయణమ్మ ఆధార్‌కార్డును ఎలా అందజేయగలదు. దీంతో ఇటువంటి కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం కష్టంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 23 వేల మంది వేరొకర నుంచి గ్యాస్ కనెక్షన్లుకొనుగోలుచేశారు. ఆధార్ కా ర్డు సమర్పిస్తేతప్ప గ్యాస్‌డెలివరీ చేయమ నిఏజెన్సీలు స్పష్టం చేస్తుండడంతో వారం తా ఆందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,04,353 గ్యాస్ కనెక్షన్లుండగా ఇప్పటి వరకు 2,23, 802కనెక్షన్లకు ఆధార్అనుసంధానం జరిగింది. మిగిలిన 80,551 గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం జరగలే దు. ఇందులో వేరొకరినుంచి కనెక్షన్లు కొనుగోలుచేసినసుమారు 23 వేలమంది బోగస్ లబ్ధిదారులుగా మిగిలిపోనున్నారు. ఆధార్ అనుసంధానం వల్ల అసలైన లబ్ధిదారులు ఇబ్బంది పడకపోయినా బోగస్ లబ్ధిదారులకు మాత్రం ఇక్కట్లు తప్పేలా లేదు.