విజయనగరం కంటోన్మెంట్ : గ్యాస్ కనెక్షనలకూ ఆధార్ అనుసంధానం చేస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నా రు. జిల్లాలోప్రస్తుతం రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం జరుగుతు న్న విషయంతెల్సిందే. ఆధార్ అనుసంధా నం చేయడం వల్లే జిల్లా వ్యాప్తంగా 8493 రేషన్‌కార్డులను బోగస్‌గాగుర్తించిఏరివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బోగస్ గ్యాస్ కనెక్షన్లుఏరివేసేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. అయితే గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేయడం కూడా కష్టంగా మారుతోంది.
ఉదాహరణకు జిల్లా కేంద్రంలోని జొన్నగుడ్డికి చెందిన నారాయణమ్మ అనే పేద మహిళకు 2008లో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరైంది. అయితే ఆ సమయంలో సబ్సిడీ సొమ్ము కట్టలేని నారాయణమ్మ ఆ కనెక్షన్‌ను తనకు తెలిసిన నాయుడుబాబుకు అమ్మేసింది. అనంతరం నాయుడుబాబు అదే కనెక్షన్‌ను చిట్టెమ్మ అనే మరోమహిళకు అమ్మేశాడు. ప్రస్తుతం నారాయణమ్మ గ్యాస్ కనెక్షన్‌ను చిట్టెమ్మ వినియోగిస్తోంది. అయితే ఐదేళ్ల కిందట నారాయణమ్మ చనిపోయింది. ఆ మెకు ఆధార్‌కార్డు కూడాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిట్టెమ్మ తను వినియోగిస్తున్న గ్యాస్ కనెక్షన్‌కు నారాయణమ్మ ఆధార్‌కార్డును ఎలా అందజేయగలదు.
దీంతో ఇటువంటి కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం కష్టంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 23 వేల మంది వేరొకర నుంచి గ్యాస్ కనెక్షన్లుకొనుగోలుచేశారు. ఆధార్ కా ర్డు సమర్పిస్తేతప్ప గ్యాస్‌డెలివరీ చేయమ నిఏజెన్సీలు స్పష్టం చేస్తుండడంతో వారం తా ఆందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,04,353 గ్యాస్ కనెక్షన్లుండగా ఇప్పటి వరకు 2,23, 802కనెక్షన్లకు ఆధార్‌అనుసంధానం జరిగింది. మిగిలిన 80,551 గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం జరగలే దు. ఇందులో వేరొకరినుంచి కనెక్షన్లు కొనుగోలుచేసినసుమారు 23 వేలమంది బోగస్ లబ్ధిదారులుగా మిగిలిపోనున్నారు. ఆధార్ అనుసంధానం వల్ల అసలైన లబ్ధిదారులు ఇబ్బంది పడకపోయినా బోగస్ లబ్ధిదారులకు మాత్రం ఇక్కట్లు తప్పేలా లేదు.
ఆధార్ అనుసంధానంతో ఇక్కట్లు..
Published Mon, Sep 22 2014 2:20 AM | Last Updated on Fri, May 25 2018 6:21 PM
Advertisement