జిల్లాలో 94 శాతం మందికి ఆధార్ నంబర్లు
పూర్తయిన ఆధార్-జనాభా అనుసంధానం
ఎన్యుమరేషన్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమం
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో 94 శాతం మందికి ఆధార్ ఉన్నట్లు జనగణన అధికారులు ధ్రుృవీకరించారు. కొద్దినెలల కిందట జిల్లాలో జనగణన-ఆధార్ అనుసంధానం కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 34 మండలాల్లో 5,680 నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ బుక్ లెట్లతో జనాభా గణనను ఆధార్‌తో సరిపోల్చారు. ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఆధార్ అనుసంధానం చేస్తూ లేని వారి నుంచి ఆధార్ నంబర్లను తీసుకుని వివరాలు నమోదు చేశారు.
గత ఏడాది అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ గణన చేపట్టారు. ఈ వివరాలన్నింటినీ జాతీయ జనాభా గణన వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ గణన అధికారులు వివరాలన్నింటినీ అప్‌లోడ్ చేశారు. మొత్తం 4,248 మంది ఎన్యూమరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వారిని మినహాయించి గణన చేపట్టారు. మొత్తం 22,26,475 మందిని ఆధార్‌తో సరిపోల్చారు.
వీరిలో 94 శాతం మంది(20,94,106 మంది)కి ఆధార్ అనుసంధానం జరిగినట్టు గుర్తించారు. ఆధార్ లేకుండా కేవలం ఈఐడీ నెంబర్లతో 0.42 శాతం మంది ఉన్నారు. వీరికి ఆధార్ నంబర్లు ఇంకా రాలేదు. ఇటువంటి వారు జిల్లాలో 9,253 మంది ఉన్నారు. ఆధార్ లేకుండా 54,476 మంది ఉన్నట్టు జనాభా గణన ఎన్యుమరేటర్లు గుర్తించారు. వలసలు, ఇతర కారణాలతో 68,640 మంది అందుబాటులో లేకపోవడంతో ఆధార్‌ను అనుసంధానించలేకపోయారు.
వీరికి జిల్లాలో ఆధార్ ఉందా లేక ఇతర ప్రాంతాల్లో ఉందానన్న విషయం తెలియలేదు.
రాష్ట్రంలోనే జిల్లా ప్రథమం..
ఆధార్‌తో జనాభా గణనను అనుసంధానించే కార్యక్రమంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 13 జిల్లాల్లోనూ గత ఏడాది అక్టోబర్ 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే చాలా జిల్లాల్లో జనగణనకు సంబంధించిన సామగ్రి లేకపోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. డిసెంబర్ 31 నాటికి ఆధార్ అనుసంధానం పూర్తయ్యే అవకాశం లేదని భావించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని మరికొద్ది నెలలు పొడిగించారు. విజయనగరం జిల్లాలో మాత్రం నిర్ణీత సమయానికే ఆధార్‌తో జనాభా గణను పూర్తి చే శారు. వివరాలను ఎన్‌పీఆర్ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచారు.
ఆధార్ అదరహో..!
Published Wed, Apr 6 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
Advertisement