‘సాక్షి’ మ్యాథ్‌బీ రిజిస్ట్రేషన్‌కు విశేష స్పందన
వడాయిగూడెం (భువనగిరి అర్బన్) : విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సాక్షి నిర్వహిస్తున్న మ్యాథ్‌బీ–2016కు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ పరీక్షకు శనివారం మండలంలోని వడాయిగూడెంలో గల ప్రెసిడెన్సీ హైస్కూల్‌కు చెందిన 50 విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్దిరాములు మ్యాథ్‌బీ పుస్తకాలు మంచి మార్కులు సాధించడానికి కూడా ఉపయోగపడుతాయని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా సాక్షి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. శ్రీనివాస్, వి. విజయలక్ష్మి, పి. సుహాసిని, లీలాకుమారి పాల్గొన్నారు.