'సంతృప్తిగా నట జీవితం'
అలనాటి కథానాయకుడు నరసింహరాజు
దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం.. సీరియల్ షూటింగ్!
విజయవాడ: కృష్ణమ్మ ఉరకలు వేస్తోందని అలనాటి కథానాయకుడు నరసింహరాజు అన్నారు. కృష్ణమ్మ ఒడిలో పవిత్ర స్నానమాచరించేందుకు పుష్కరాల సమయంలో ఇక్కడకు రావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పుష్కర స్నానంతో పాటు సప్తమాత్రికలు అనే టీవీ సీరియల్లో నటించేందుకు నరసింహరాజు మంగళవారం దుర్గాఘాట్‌కు వచ్చిన ఆయన కాసేపు సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు
సాక్షి :మీ స్వస్థలం ?
నరసింహరాజు : నేను పక్క జిల్లా వాడినే. తణుకు సమీపంలోని వడ్డూరు మా ఊరు.
సాక్షి : చిత్ర రంగంలోకి ఎప్పుడు వచ్చారు?
నరసింహరాజు : 1969వ సంవత్సరంలో సినిమా పరిశ్రమకు వచ్చాను. ఇప్పటి వరకూ 120 చిత్రాల్లో నటించాను. ఆ చిత్రాలన్నీ చాలా సంతృప్తినిచ్చాయి.
సాక్షి : కథానాయకుడిగాఎన్ని చిత్రాల్లో నటించారు.?
నరసింహరాజు : సుమారుగా 90 చిత్రాల్లో కథానాయకునిగా నటించాను. అవన్నీ మంచి గుర్తింపు తెచ్చాయి. చాలా మంది ప్రముఖ నటులతో కలిసి నటించాను. చాలా సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందులో జగన్మోహిణి, పునాదిరాళ్ళు, పున్నమినాగు, నీడలేని ఆడది, ఇలా చాలా సినిమాలు నాకు మంచి గుర్తింపును తెచ్చాయి. అదేవిధంగా ఆధ్యాత్మికమైన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. చాలా కొన్ని చిత్రాలే ప్రేక్షకాధరణ పొందలేదు.