వడివేలుతో బిల్లా–2 హీరోయిన్
తమిళసినిమా: హాస్యనటుడు వైగైపులి వడివేలు మళ్లీ హీరోగా రెడీ అయ్యారు. హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తిన ఈయన ఆ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై హీరోనే అం టూ హాస్య పాత్రలకు నో చెప్పారు. అయితే అలా కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ విజ యం సాధించలేదు. అదే సమయంలో నటు డు విజయకాంత్‌తో విభేదాలు, రాజకీయ రం గప్రవేశం వంటి అంశాలతో వడివేలు ఇబ్బం దులు పడ్డారు.
చాలా కాలం నటనకు దూరంగా ఉన్న వడివేలు ఈ మధ్య కత్తిసండై చిత్రం ద్వారా మళ్లీ హాస్య పాత్రల బాట పట్టారు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న మెర్శల్ చిత్రంలోనూ కామెడీ రోల్ పోషిస్తున్నారు. కా గా హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో 2006లో హీరోగా పరిచయం అయిన వడివేలు 11 ఏళ్ల తరువాత ఆ చిత్ర సీక్వెల్లో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన శింబుదేవన్నే ఇప్పుడు దాని సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని నిర్మించిన స్టార్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.
చాలా కాలం తరువాత ఆయన మళ్లీ చిత్ర నిర్మాణం చేపట్టారని చెప్పాలి. కాగా దీనికి హింసై అరసన్ 24ఆమ్ పలికేసి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇకపోతే ఇందులో నాయకిగా ఇంతకు ముందు అజిత్‌కు జంటగా బిల్లా–2 చిత్రంతో రొమాన్స్ చేసిన పార్వతి ఓమనకుట్టాన్ నటించనున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ మాజీ మిస్ ఇండియానే కాకుండా మిస్ వరల్డ్ పోటీలో ఫస్ట్ రన్నర్‌గా నిలిచిందన్నది గమన్హారం. హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి చిత్రం బుధవారం షూటింగ్‌తో ప్రారంభమైంది. చెన్నై చివారు ప్రాంతంలోని స్టూడియోలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి జిబ్రాన్ సంగీత భాణీలు కడుతున్నారు.