vaikuntam
-
పల్లెచిత్రాల 'తోట'! వైకుంఠం గీసిన చిత్రాలకు క్రేజీ..!!
కరీంనగర్: పల్లె జీవనం.. పడచుల కట్టుబొట్టు.. భారతీయ సంస్కృతి.. ఆయన చిత్రాలకు మూలాధారం. తోట వైకుంఠం కుంచె పడితే చిత్రాలకు జీవం వచ్చి, కాన్వాస్‌పై నాట్యం చేస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లిలో జన్మించిన వైకుంఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం గీసిన చిత్రానికి ఇటీవల ముంబయిలోని ఆస్తాగురు యాక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో రూ.1,41,35,220 ధర పలకడం విశేషం. బూర్గుపల్లిలో విద్యాభ్యాసం.. బూర్గుపల్లిలో 1942లో జన్మించిన తోట వైకుంఠం స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశా రు. బోయినపల్లి, శాత్రాజ్పల్లి, వేములవాడ, సిరి సిల్లలో ఉన్నత విద్య చదివారు. హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం పూర్తి చేశా రు. అనంతరం మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో ప్రముఖ చిత్రకళా కారుడు సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు. రంగుల ఆయన ప్రత్యేకత.. డస్కీస్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. సాదాగా కనిపించే మహిళలు రూపం ఆయన చిత్రంగా మలిస్తే అందంగా కనిపిస్తారు. ఆయన గీసిన అందమైన మహిళల చిత్రాలను సిరిసిల్ల చీరెలుగా అభివర్ణిస్తారు. అమ్మ.. మహిళలే స్ఫూర్తి! చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ స్ఫూర్తి అని వైకుంఠం చెబుతుంటారు. చిన్నప్పుడు గ్రామంలో చిందు కళాకారులు నాటకాలు ప్రదర్శిస్తుంటే వారు వేసిన వేశాలకు తగినట్లుగా మేకప్ వేసి రంగులు దిద్దే అలవాటు ఉండేదని తెలిపారు. అలా చిన్నప్పటి నుంచే రంగులు, బొమ్మలు గీయడంపై అనురక్తి కల్గిందని చెబుతుంటారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టమని.. తన చిత్రాలలోనూ ఎక్కువగా వాటినే వాడుతానని తెలిపారు. ఎన్నో అవార్డులు! భోపాల్‌లో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్ భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్రకళాకారుడిగా అవార్డు లభించింది. దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిశారు. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు.. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు వచ్చాయి. 2015లో కోల్‌కతాకు చెందిన పార్థూరాయ్ డాక్యుమెంటరీ నిర్మించారు. గ్రామాభివృద్ధికి విరాళాలు.. స్వగ్రామం బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి రూ.40 వేలు విరాళంగా అందించారు. యువత చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తెలుపుతున్నారు. మాకు గర్వంగా ఉంది.. అంతర్జాతీయ చిత్రాకారుడిగా పేరు పొందిన తోట వైకుంఠం మా గ్రామస్తుడని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఆయనతో మా గ్రామానికి పేరు రావడం గొప్పగా భావిస్తున్నాం. ముంబయిలో జరిగిన వేలంలో ఆయన గీసిన చిత్రానికి కోటిన్నర పలకడం చాలా సంతోషంగా ఉంది. – కమటం అంజయ్య,మాజీ సర్పంచ్, బూర్గుపల్లి చిందు నాటకాలు ఇష్టపడేవారు.. వైకుంఠం సారు చిన్నప్పుడు మా గ్రామంలో చిందునాటకాలు వేసేవారు. పదేళ్ల కింద గ్రామానికి వచ్చినప్పుడు పాతతరం చిందు కళాకారులతో వేశాలు వేయించి డాక్యుమెంటరీ తీశారు. చిందుకళను ఇష్టపడేవారు. – గజ్జెల సాయిలు,చిందు కళాకారుడు గ్రామాభివృద్ధికి తోడ్పాటు.. తోట వైకుంఠం గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గతంలో రూ.40 వేలు సాయం చేశారు. ఆయన గీసిన చిత్రాలతో మా ఊరికి పేరు రావడం గర్వంగా ఉంది. – పెరుక మహేశ్, యువకుడు -
టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి
అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆధిపత్యం కోసమే గొడవపడిన టీడీపీ నేతలు.. ప్రతిపక్షంలోనూ అదే బాటలో పయనిస్తున్నారు. అనంతపురంలో పట్టుకోసం అటు వైకుంఠం, ఇటు జేసీ పాకులాడుతుండగా కేడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. విందు రాజకీయాలతో జేసీ పవన్ ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తుండగా.. వైకుంఠం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. సాక్షి , అనంతపురం: ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు దీపావళి తారజువ్వలా ఎగసిపడుతోంది. జేసీ, వైకుంఠం వర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. నేతలిద్దరూ కేడర్‌తో మంతనాలు జరుపుతూ ఎగదోస్తుండగా.. వర్గపోరు వంకాయ బాంబులా ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధమైంది. దీపావళికి పచ్చపార్టీలో రేగిన ‘చిచ్చు’ బుడ్డి ఎవరి కొంప ముంచుతుందోననే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ( చదవండి: మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా పై కన్నేసిన టీడీపీ నేతలు ) ఆది నుంచీ విభేదాలే... జేసీ కుటుంబం టీడీపీలో చేరడం కూడా వైకుంఠానికి ఇష్టం లేదు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నోరుమెదపలేకపోయారు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా జేసీ కుటుంబానికి ఎదురు నిలుస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్నా.. కేడర్‌ను రెండుగా చీల్చి రాజకీయం నడుపుతున్నారు. రెండు వర్గాల మధ్య విభేదాలు ప్రారంభం నుంచీ ఉన్నా.. ప్రధానంగా అనంతపురం నగరంలోని రోడ్డు వెడల్పు విషయంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ దివాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీ వీడతారనే దాకా ప్రచారం సాగింది. అంతిమంగా రోడ్డు వెడల్పు కోసం ఉత్తర్వులు కూడా జారీ చేయించుకున్నారు. కానీ అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. దీని వెనుక ప్రభాకర్ చౌదరి మంత్రాంగం నడిపారనే ప్రచారం ఉంది. రోడ్డు వెడల్పు పనులు జరగకుండా వ్యాపారులను ఎగదోసి అడ్డుకున్నారనే ప్రచారం కూడా సాగింది. రాంనగర్ బ్రిడ్జి విషయంలోనూ మనస్పర్థలు.. నగరంలోని రాంనగర్ బ్రిడ్జి వెడల్పు కుదించే విషయంలో కూడా జేసీ, వైకుంఠం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ బ్రిడ్జిని కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అప్పట్లో ఎంపీ హోదాలో జేసీ ప్రారంభించారు. ఎన్నికల సమయంలోనూ ఇరువురి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇప్పుడు ఇరువురూ ఓడిపోయిన తర్వాత.. ఒక కేసు విషయంలో జేసీ దివాకర్‌రెడ్డి అరెస్టయి నగరంలోని ఓ పోలీసు స్టేషన్లో ఉండగా.. అటువైపు కన్నెత్తి చూడవద్దని తన అనుచరులనే కాకుండా పార్టీ నేతలను కూడా వైకుంఠం కట్టడి చేశారని సమాచారం. అంతేకాకుండా నిరసనల ఊసే లేకుండా చేయగలిగారనే చర్చ కొనసాగుతోంది. తద్వారా జేసీకి నగరంలో కనీస పట్టు లేదనే భావన వచ్చేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభాకర్‌చౌదరిని దెబ్బకొట్టేందుకు జేసీ పవన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేరుగా భేటీలు.. విందులు! వైకుంఠంతో వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలో జేసీ కుటుంబం నగరంలో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభాకర్ చౌదరికి దగ్గరగా ఉన్న నేతలతో జేసీ పవన్ గత 15 రోజులుగా 2–3 సార్లు భేటీ అయ్యారు. అంతేకాకుండా విందు సమావేశాలు కూడా నిర్వహించారు. టౌన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు జేఎల్ మురళితో పాటు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి, టీడీపీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, టీడీపీ జిల్లా కార్యదర్శి సద్దల చెన్నప్ప, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు డేరంగులు వెంకటాద్రి, కో–ఆప్షన్ మెంబర్ కృష్ణమకుమార్, మాజీ కార్పొరేటర్లు రంగమ్మ, ఉమామహేశ్వరనాయుడు, విద్యాసాగర్, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మణికంఠబాబు, వాణిజ్యవిభాగం ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి తదితరులతో జేసీ పవన్ మంతనాలు సాగించారు. గత 15 రోజులుగా 2–3 సార్లు సమావేశం కావడంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా నగరంలో ప్రభాకర్ చౌదరిని ఏకాకిని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందని జేసీ అనుచరులు వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా టీడీపీ పరిస్థితి దీపావళి వేళ మూడు వంకాయ బాంబులు, ఆరు లక్ష్మీ బాంబుల్లా తయారైంది. అయితే, చివరకు ఏ వర్గం బాణసంచా ఢాం అని పేలుతుందో.. ఎవరి మతాబు తుస్సుమంటుందో తేలాల్సి ఉంది. జేసీ పవన్ అంతరంగం ఎమ్మెల్యే వర్గాన్నంతా మనవైపు తిప్పుకోవాలి. నగరంలో పట్టుసాధించాలి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేటర్ సీట్లు మనవాళ్లకే ఎక్కువగా ఇప్పించుకుని పైచేయి సాధించాలి. వైకుంఠం ప్రణాళిక జేసీని ఏకాకిని చేయాలి. నగరంలో వర్గమంటూ లేకుండా చూడాలి. కార్పొరేటర్ సీట్ల ఎంపికలోనూ మనమే సత్తా చాటాలి. జేసీ వైపు వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలి. -
వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం రెండురోజులు మాత్రమే
-
వైకుంఠాన్ని ఇక్కడే చూడొచ్చు: బాబు
తిరుమల: ఆధ్మాత్మిక నగరం తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన గురువారం ఉదయం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం క్యూ లైన్లను పరిశీలించి, భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని, జిల్లాను దేవాలయాల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైకుంఠం అంటే చూడలేదని...కథల్లోను, పురాణాల్లో మాత్రమే విన్నామని... అలాంటిది తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వైకుంఠం ఎలా ఉంటుందో అలాంటి ప్రశాంత, పవిత్ర వాతావరణం తిరుమలలో ఉంటుందని చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులతో భక్తుల నమ్మకాన్ని పెంచేలా పని చేస్తామని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకలిస్తామన్నారు. స్మగ్లర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారారని, ఒక్క స్మగ్లర్‌ను కూడా లేకుండా చేస్తామన్నారు. స్మగ్లర్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.