భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..
భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా కంపెనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తమ అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.భారత్‌లో మరిన్ని డిజైన్లను రూపొందించడానికి యాపిల్ వంటి ఎలక్ట్రానిక్స్ తయారీదారులను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకు తమ అవసరాలేమిటో గుర్తించి వాటిని తేర్చేలా కంపెనీలను, పరిశ్రమ వర్గాలను సంప్రదిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఇప్పటికే ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వంటి పరిశ్రమ సంస్థలతో సమావేశాలను నిర్వహించింది. ఈ సంస్థలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంలో ఎదురయ్యే సాంకేతికపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కొన్ని ఐఐటీలను కూడా సంప్రదించిందని తెలిసింది. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్‌లో స్థానికంగా ఏ భాగాలు రూపొందించబడుతాయి.. ఎలా తయారు చేస్తారు.. దేశీయ విలువ జోడింపును పెంచడానికి ఎలాంటి విధానాలు పాటించాలి అనే అంశాలను గుర్తించడం దీని లక్ష్యం అని ఓ అధికారి తెలిపారు.ఇదీ చదవండి: తగ్గుతున్న ఐఫోన్ విక్రయాలు.. భారత్‌లో ఎలా ఉందంటే..ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులకు గిరాకీ ఎర్పడనుందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గ్లోబల్ లీడ్ కంపెనీలు ఇన్నోవేషన్, డిజైన్, తయారీరంగంలో భారత్‌ను తమ హబ్‌గా ఎంచుకోవడానికి ప్రభుత్వం అనుకూలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.