న్యూఢిల్లీ: వినియోగదారుల ఆమోదం లేకుండానే చాలా టెలికాం కంపెనీలు వాల్యూ యాడెడ్ సర్వీసు(వ్యాస్)లను యాక్టివేట్ చేస్తున్నాయని ట్రాయ్ తెలిపింది. ఈ విషయమై ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 10 లక్షలకు పైగా ఫిర్యాదులందాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది.
దీనిని నిలువరించడానికి పలు చర్యలు తీసుకున్నామని వివరించింది. ఇక వినియోగదారులు 155223(కామన్ టోల్-ఫ్రీ నంబర్)కు కాల్/ఎస్‌ఎంఎస్ చేయడం ద్వారా వ్యాస్‌ను డీఆక్టివేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.
పది లక్షలకు పైగా టెలికం వ్యాస్ ఫిర్యాదులు
Published Thu, Nov 13 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement