సీఓఏఐలో రిలయన్స్ జియోకు సభ్యత్వం | Reliance Jio Infocomm Joins COAI as Core Member | Sakshi
Sakshi News home page

సీఓఏఐలో రిలయన్స్ జియోకు సభ్యత్వం

Published Tue, Aug 12 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

సీఓఏఐలో రిలయన్స్ జియోకు సభ్యత్వం

సీఓఏఐలో రిలయన్స్ జియోకు సభ్యత్వం

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ)లు చేతులు కలిపాయి. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, యూనినార్ తదితర జీఎస్‌ఎం టెలికం ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహించే  సీఓఏఐలో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ జియో(ఆర్‌జేఐఎల్)కు సభ్యత్వం లభించింది. రిలయన్స్ జియో, సీఓఏఐల మధ్య వివాదం సద్దుమణగడంతో వచ్చే ఏడాది రిలయన్స్ జియో 4జీ సర్వీసులందజేయడానికి మార్గం మరింత సుగమం కానున్నది.

సీఓఏఐలో రిలయన్స్ జియో చేరిక పట్ల సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్. మాథ్యూస్ హర్షవ వ్యక్తం చేశారు. భారతీయులకు వినూత్నమైన, చౌకైన మొబైల్ బ్రాడ్‌బాండ్ సర్వీసులను అందజేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఇతర మొబైల్ ఆపరేటర్లతో కలిసి సుహృద్భావంగా పనిచేయగలిగిన వాతావరణం ఉండగలదన్న ఆశాభావాన్ని ఆర్‌జేఐఎల్ ఎండీ సందీప్ దాస్ వ్యక్తం చేశారు. గతంలో ఆర్‌జేఐఎల్, సీఓఏఐల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. వివిధ విషయాలపై ఈ రెండిటి మధ్య మాటల యుద్ధం జరిగేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement