vanam
-
పూర్తయిన ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం
-
పోలీస్ 'వనం'
పర్యావరణ హితం కోరి తమ వంతుగా మొక్కలను నాటే కార్యక్రమాలను చాలా మంది చేపడుతుంటారు. ఆ తర్వాత ఆ మొక్కల సంరక్షణగాల్లో దీపంలాగే ఉంటుంది. కానీ, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే అనేక సామాజిక అంశాలపైనా స్పందిస్తున్నకామారెడ్డి జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు సిబ్బంది కలిసి ఓ వనాన్నే ఏర్పాటుచేశారు. ఆరెకరాల స్థలంలో 80 రకాలైన 3,500 మొక్కలు నాటి వాటినిసంరక్షించడం ద్వారా ఇప్పుడు అడవిని తలపిస్తున్నారు. ప్రకృతికీ రక్షణగాఉన్నామంటూ తమ చేతల ద్వారా నిరూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం కోసం పట్టణ శివార్లలో 31.30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆరు ఎకరాల స్థలాన్ని ఎస్పీ శ్వేత మొక్కల పెంపకం కోసం ఎంపిక చేసి, మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడేందుకు నిరంతరం ఆమెతో పాటు పోలీసు సిబ్బందీ శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగి పెద్దయ్యాయి. ఈ స్థలంలో హరితహారం కింద మొక్కలు నాటాలని సంకల్పించిన ఎస్పీ శ్వేత అప్పటి కలెక్టర్ సత్యనారాయణతో చర్చించారు. నీటి సౌకర్యం కల్పిస్తే వనాన్ని సృష్టిస్తానని మాటిచ్చారు. కలెక్టర్ తన నిధుల నుంచి రూ.2.18 లక్షలు విడుదల చేసి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశారు. డ్రిప్ సౌకర్యమూ కల్పించారు. దీంతో జిల్లా ఎస్పీ శ్వేత ఆర్మ్డ్ రిజర్వు (ఏఆర్) పోలీసుల సాయంతో మొక్కలు నాటి, వాటిని కాపాడేందుకు శ్రమించారు. మూడేళ్లుగా.. ప్రతీ రోజూ ఎస్పీ రక్షకవనానికి వెళుతూ అక్కడి పనుల్లో భాగమవుతున్నారు. ప్రతీ రోజూ వాకింగ్, రన్నింగ్ కార్యక్రమాలు పోలీసులు ఇక్కడే చేస్తుంటారు. ఈ వనానికి హరిత రక్షక వనం అన్న నామకరణ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీస్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్ గంప గోవర్దన్‌లతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతను ‘వనదేవత’గా పోలీసు సిబ్బంది కొనియాడారు. భూమిని చదును చేసిమొక్కలు నాటుతున్న పోలీసు సిబ్బంది (ఫైల్) 80 రకాల మొక్కలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పెరిగే అటవీ వృక్ష జాతులకు సంబంధించి దాదాపు 80 రకాల మొక్కలు .. రామ సీతాఫలం, బాదం, శ్రీగంధం, టేకు, ఖర్జూరం, వేప, పనస, మారేడు, చింత, దానిమ్మ, జామ, ఈత, మామిడి, మేడి, మునగ, నిమ్మ, పసన, ఉసిరి, వెలగ, మారేడు, కుంకుడు, కదంబం, నల్లజీడి, రాచ ఉసిరి, జిట్రేగి తదితర రకాలకు సంబంధించి 3,500 మొక్కలు నాటారు. వనంలో నీటి గుంతలు ఈ వనంలో రెండు నీటి గుంతలు తవ్వించి, అందులో నీరు నిల్వ ఉంచుతున్నారు. వర్షపు నీరు ఆ గుంతలో నిండేలా ఏర్పాటు చేశారు. పైభాగాన ఉన్న గుంతలో పది అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అందులో చేప పిల్లలను వదిలారు. నీటి నిల్వ వల్ల బోరుబావుల్లో భూగర్భజలానికి ఇబ్బంది లేకుండాపోయింది. హరితవనంలో తవ్విన నీటి గుంత అందరి సహకారం హరిత హారం స్ఫూర్తితోనే పర్యావరణ పరిరక్షణకు పోలీసు శాఖ ఏదైనా చేయాలని భావించాను. ఆ ఆలోచనలోంచి వచ్చినదే హరిత రక్షక వనం. మట్టిదిబ్బలు, రాళ్లతో నిండి ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని చదును చేసి అందులో మొక్కలు నాటాలని సంకల్పించాను. ఆ రోజు కలెక్టర్ సత్యనారాయణ గారిని నీటి వసతి కల్పించాలని కోరిన వెంటనే మంజూరు చేశారు. డ్రిప్ సౌకర్యం కూడా కల్పించారు. ఇక మా ఏఆర్ పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది అందరం కలిసి మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడంలోనూ అందరం శ్రమించాం. అందరి శ్రమకు తగ్గట్టుగానే ఇప్పుడు అడవిగా మారింది. మరో రెండు, మూడేళ్లలో మరింత వృద్ధి్ద చెందుతుంది.– ఎన్.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి పోలీసుల శ్రమ ఈ వనంలో రోజూ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు శ్రమిస్తారు. మొక్కలు నాటిన నాటి నుంచి రోజూ పర్యవేక్షిస్తున్నారు. మొక్కల చుట్టూ పెరిగే కలుపు తొలగించడం, నీరు మొక్కమొక్కకు చేరుతుందా లేదా చూసుకోవడం,పనికిరాని చెత్తను తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఏఆర్ పోలీసుల శ్రమకు ఫలితం దక్కింది. వారి నిరంతర శ్రమతో ఇప్పుడు ఈ ప్రాంతం అడవిగా మారింది.– సేపూరి వేణుగోపాలాచారి,సాక్షి, కామారెడ్డిఫొటోలు: అరుణ్ -
మొక్క.. కాకిలెక్క!
రెండు నెలల్లో 18,25,761 మొక్కలు – జూలై 29న ఒక్క రోజు 11,70,773 మొక్కలు నాటినట్లు లెక్కలు – పది శాతం మొక్కలు ఉంటే ఒట్టు – అధికారుల్లో కనిపించని చిత్తశుద్ధి – నాటిన మొక్కల సంరక్షణ గాలికి.. కర్నూలు(అగ్రికల్చర్): ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే మొత్తం భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే కర్నూలు జిల్లాలో అడవుల శాతం 19.9 మాత్రమే. అడవులతో పాటు పచ్చదనం తగ్గిపోతుండటంతో జిల్లాలో వరుస కరువు నెలకొంటోంది. ప్రతి సంవత్సరం జూన్ నెల నుంచి మొక్కల పెంపకంపై అధికార యంత్రాంగం హడావుడి చేయడం తప్పిస్తే.. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోంది. గత రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18,25,761 మొక్కలు నాటినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. జూన్ 1 నుంచి జూలై 28 వరకు 6,54,988 మొక్కలు నాటగా.. జూలై 29న ఒక్క రోజులో 11,70,773 మొక్కలు నాటినట్లు కాగితాల్లో నమోదయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం–మనం అభాసు పాలవుతోందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం. గత ఏడాది 22 లక్షల మొక్కలు నాటినట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. ఇందులో ప్రస్తుతం పది శాతం మొక్కలు కనిపిస్తే ఒట్టు. మొక్కలు పెంచడానికే రూ.1.98 కోట్లు ఖర్చు చేశారు. గుంతలు తవ్వడానికి, ట్రాన్స్‌పోర్టుకు, వన మహోత్సవాల నిర్వహణకు చేసిన ఖర్చు మరింత భారీగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే మొక్కల పేరుతో నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. ఈ ఏడాది అంతా హడావుడే.. జిల్లాలోని అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ నర్సరీల్లో ఈ ఏడాది 1.10 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు. ఇందులో చిన్నవి మినహాయిస్తే నాటడానికి అనువైనవి 59.68 లక్షలు. మొక్కలు పెంచడానికి రూ.9.90 కోట్లు వ్యయం చేశారు. అయితే మొక్కలు నాటడంలో చేతులెత్తేశారు. హడావుడి చేయడం తప్ప మొక్కలు నాటడంలో చిత్తశుద్ధి లోపించింది. ఆర్భాటంగా 10–15 మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులివ్వడం మినహా నిజంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనే ఆలోచన కరువయింది. కొన్ని ప్రభుత్వ శాఖలు ఒక్క మొక్క కూడా నాటలేదు. కానీ వేలాది మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటిస్తుండటం గమనార్హం. మొక్కలు నాటడానికి ఎన్‌ఆర్‌ఈసీఎస్ ద్వారా గుంతలు తవ్వారు. అధికారుల లెక్కల ప్రకారం 15 లక్షల గుంతలు తవ్వగా ఎన్ఆర్ఈజీఎస్ కింద దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద మొక్కలు పెంపకంలో రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయగా ఇందులో 80 శాతం దుర్వినియోగమే. మొక్కలు నాటడంలో వింతలు ఇలా.. – మార్క్‌ఫెడ్ ద్వారా 1,450 మొక్కలు నాటినట్లు సామాజిక వనవిభాగం అధికారులు ప్రకటించారు. వాస్తవంగా మార్క్‌ఫెడ్‌లో ఒక్క మొక్కను నాటిన పాపాన పోలేదు. – కర్నూలు నగరపాలక సంస్థలో గత ఏడాది 70వేల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 29న ఒక్క రోజులో∙21,319 మొక్కలు నాటినట్లు లెక్కలు చూపారు. నగరం అంతా వెతికినా పది శాతం మొక్కలు కనిపించవు. – డీఈఓ, ఆర్ఐఓ, డీవీఈఓ పరిధిలోని స్కూళ్లు, కళాశాలల్లో, డిగ్రీ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 1.11 లక్షల మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. వీటిల్లో 10వేల మొక్కలు నాటిన దాఖలాలు కూడా లేవు. – వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో జూలై 28 వరకే 4,600 మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. అయితే ఆ సంఖ్య 500 మొక్కలకు మించలేదని తెలుస్తోంది. – రెవెన్యూ శాఖలో.. అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో 5400 మొక్కలు నాటినట్లు లెక్కలు ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో 100 మొక్కలు నాటారు. తర్వాత వాటి సంరక్షణను పట్టించుకోవడమే మానేశారు. ఆర్డీఓ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో చాలా వరకు మొక్కలు నాటే కార్యక్రమాలే చేపట్టలేదు.