vanamadi venkateswara rao (konda babu)
-
బెడిసికొట్టిన టీడీపీ నేత ‘రాజకీయం’
కాకినాడ(తూర్పుగోదావరి): తన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఓ హత్యా ఘటనకు కుల, రాజకీయ రంగు పులిమేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ కుంతీదేవిపేటకు చెందిన కలవల అంజిబాబు కొద్దిరోజుల కిందట స్థానికంగా జరిగిన వివాదంలో హత్యకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి సదరు ఘటనను తనకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది నేతలను రప్పించి మరీ ఇక్కడ రౌడీరాజ్యం నడుస్తుందంటూ ఆ ఘటనను వైఎస్సార్ సీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. హత్యకు గురైన కలవల అంజిబాబు వైఎస్సార్ సీపీ కార్యకర్తగా నిర్ధారణ కాగా, హత్య చేసిన వ్యక్తి టీడీపీ మద్దతుదారుడేనని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే నిర్ధారించడంతో టీడీపీ అసలు రంగు బయటపడింది. నా భర్త వైఎస్సార్ సీపీ కార్యకర్త తన భర్త వైఎస్సార్ సీపీ కార్యకర్త అని కలవల అంజిబాబు భార్య అనిత చెప్పారు. తన నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన వ్యక్తి తన భర్తను హత్య చేశారన్నారు. తన కుటుంబానికి ఎమ్మెల్యే ద్వారంపూడి అండగా ఉండడంతో పాటు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారన్నారు. కొండబాబుకే పనిచేశాం.. అంజిబాబు హత్య కేసులో నిందితుడి తల్లి కలవల ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమ కుటుంబం ఆది నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోసమే పని చేసిందన్నారు. ఇప్పుడు తాము ఎవరో తెలియదన్నట్టు వనమాడి మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో తమకు ఎలాంటి పరిచయాలు లేవన్నారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అంజిబాబు కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే సోదరుడు, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి సోమవారం అంజిబాబు భార్య అనితకు అందజేశారు. ప్రభుత్వ సహాయాన్ని అందించడంతో పాటు పిల్లల చదువుకు సహాయం చేస్తామని వీరభద్రారెడ్డి చెప్పారు. ఆయన వెంట ట్రస్ట్ ఆర్గనైజర్ కర్రి వీర్రెడ్డి, కార్పొరేటర్లు మీసాల ఉదయ్‌కుమార్, మీసాల దుర్గాప్రసాద్, చోడిపల్లి ప్రసాద్, కామాడి దశరధ, వాసిరెడ్డి రాంబాబు ఉన్నారు. కలవల అంజిబాబు కుటుంబానికి రూ.లక్ష సాయాన్ని అందజేస్తున్న వీరభద్రారెడ్డి తదితరులు -
ఎమ్మెల్యే వనమాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సుజాతనగర్: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా నాయకులు నాగా సీతారాములు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫాం పొందిన వనమా వెంకటేశ్వరరావు ఇప్పుడు పార్టీ మారి నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడన్నారు. ఒక పార్టీ నుంచి బీ ఫాం పొంది మరో పార్టీలో చేరడం అనైతికమని, తన స్వలాభం కోసమే పార్టీ ఫిరాయించాడని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను ఎలా మోసం చేస్తాడని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వనమాపై 405, 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతలపూడి రాజశేఖర్, తాళ్లూరి శ్రీనివాసరావు, మండల నాయకులు మడిపల్లి శ్రీనివాసరావు, పంజాల శ్రీనివాసరావు, రామ్‌లక్ష్మణ్, అజ్జూ, ఆబిద్, నరేష్, చంటి, షరీఫ్ పాల్గొన్నారు. -
‘పచ్చ’నేతల కబ్జాకాండ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓటేయడమంటే యాంత్రికంగా మీట నొక్కడం కాదు. ప్రతి ఓటు చుట్టూ ఆ ఓటరు ఆశలు, కలలు అల్లుకుని ఉంటాయి. తాను ఓటు వేసిన పార్టీ లేదా అభ్యర్థిపై గురి, నమ్మకం ఉంటాయి. అధికారంలోకి వచ్చిన వారు ఆ ఆశల్ని నెరవేర్చాలి. ఆ కలల్ని ఫలింపజేయాలి. ఆ గురి, నమ్మకాల్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే మరోసారి ఓటడిగే నైతిక హక్కు ఉంటుంది. గత ఎన్నికల్లో వందలాది హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల్లో అలాంటి నీతి ‘నేతి బీరకాయ’లో నెయ్యి లాంటిదే. అయిదేళ్ల పచ్చదండు పాలన దోచుకోవడం, దాచుకోవడం, కబ్జా చేయడమే లక్ష్యంగా సాగింది. అధికారం దన్నుతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేసేశారు. అవి పర్ర భూములా, తీర ప్రాంత భూములా, చెరువులా, గుట్టలా, దేవదాయ భూములా, మఠం భూములా, అసైన్డ్ భూములా, రోడ్లా, ప్రైవేటు భూములా అని చూడకుండా కబ్జా చేసేశారు. భూములు దొరికితే చాలు చదును చేసేశారు. ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించేశారు. అడ్డొచ్చినోళ్లపై దౌర్జన్యం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు కబ్జాలకు అండగా నిలిచారు. జిల్లా వ్యాప్తంగా రూ. 500 కోట్ల విలువైన సుమారు 300 ఎకరాల వరకు ఆక్రమించారు. ఆక్రమణలపై కేసులు కూడా నమోదయ్యాయంటే జిల్లాలో టీడీపీ నేతల కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలా దోచిన వందల కోట్ల డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. జిల్లాలో పచ్చదండు ఆక్రమణలపై ‘సాక్షి’ ఫోకస్.. కబ్జాలకు ‘కొండం’త అండ కాకినాడలోని తూరంగి పంచాయతీ పరిధిలో సుమారు 20 ఎకరాలు, కొవ్వూరు రోడ్లో 1.5 ఎకరాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును కూడా తన స్థలమే అంటూ ధ్వంసం చేశారు. ఆయన అనుచరులు అదే తీరులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కాకినాడ మెయిన్రోడ్లో గల జగన్నాథపురం వంతెన సమీపంలోని విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రిరాత్రికి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదస్పదమైంది. ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా చేయించేందుకు యత్నించడంతో పాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లైన్ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు. మహాలక్ష్మినగర్ ప్రాంతంలోని తూరంగి 231, 222, 230/2 సర్వే నెంబర్లలో సుమారు 20 ఎకరాల భూమిని తన సొంతభూమిలో కలిపేసుకున్నారు. రూ.10 కోట్లకు పైగా విలువచేసే ఆ భూమిని తన సొంతం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆయన ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో రహదారి వేస్తుంటే తన గూండాగిరితో రహదారిని ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై వనమాడి సోదరుడు సత్యనారాయణ, ఆయన కుమారుడిపై కేసులు కూడా నమోదయ్యాయి. సర్వే నెంబర్ 230/2లోని మిగిలిన మరో 12.23 ఎకరాల ప్రైవేటు వ్యక్తుల భూముల్లో కూడా ప్రవేశించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వేరొకరు కొనుగోలు చేసిన భూమిలో సుమారు ఎకరం వరకు రాళ్లు పాతి తమదేనంటూ వనమాడి కుటుంబీకులు వాదిస్తున్నట్టుగా తెలిసింది. అలాగే, టౌన్ సర్వేలోకి వచ్చే 1837, 1838లో ఉన్న ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కూడా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆ భూములకు సంబంధించి మ్యుటేషన్ జరగకుండా అధికార వర్గాల ద్వారా అడ్డుకుంటున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దుమ్ములపేటలో 8 ఎకరాలు కూడా ఆయన కబ్జాకోరల్లో చిక్కుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కొవ్వూరు రోడ్లో మూడు ఎకరాల అసైన్డ్ భూమి వ్యవహారంలో తలదూర్చి, సెటిల్మెంట్ పేరుతో 50 శాతం భూమిని నొక్కేసి ప్లాట్లుగా విభజించి రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆ ప్రాంతవాసులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇవి కాకుండా కాకినాడ నగరంలోని అనేక ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలను సైతం ఆయన అనుచరులు స్వాహా చేసిన అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల జాగాలోనూ పాగా ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం. తుని నియోజకవర్గంలో పోలీస్ శాఖకు చెందిన విలువైన స్థలమే కబ్జాకు గురైంది. అధికార పార్టీకి చెందిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అండదండలతో బంధువులు ఆక్రమించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ రూ.5 కోట్లు పైనే ఉంటుంది. సాక్షత్తూ హోంమంత్రి సొంత జిల్లాలోనే పోలీసు శాఖ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. కాకినాడ నుంచి అద్దరి పేట వరకు బీచ్ రోడ్లో ఒంటిమామిడి ప్రధాన జంక్షన్. పోలీస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ కోసం సర్వే నంబరు 843లో 7. 32 ఎకరాల విస్తీర్ణం గల మందబయలులో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపురం ఆర్డీవో, తొండంగి రెవెన్యూ అధికారులు సర్వే చేసి స్థలాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. సర్వే నంబరు 842 లోని స్థలంలో గ్రామ చావిడి ఉండేది. ఇందులో పోలీస్‌స్టేషన్ తాత్కాలికంగా నిర్వహించిన తర్వాత 1998 నవంబర్ 26న అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ స్థలాన్ని బదలాయించారు. అక్కడే పోలీస్‌స్టేషన్‌కు పక్కా భవనం నిర్మించారు. దీంతో సర్వే నంబరు 843 లో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో క్వార్టర్స్ పనులు చేపట్టక పోవడంతో ఖాళీగా ఉండేది. మూడు రోడ్ల జంక్షన్లో ఉన్న స్థలంపై అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు చూపు పడింది. అధికారం అండతో మందబయలు స్థలంలో పాకలు, బడ్డీ దుకాణాలను బలవంతంగా ఖాళీ చేయించి షాపింగ్ కాంప్లెక్సు నిర్మించారు. పక్కనే మంత్రి బంధువులు కొంత భూమిని కొనుగోలు చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసు స్టేషన్‌కు చెందిన స్థలం సర్వే నెంబర్లను ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సత్రం భూములకూ చెర ముమ్మిడివరం నియోజకవర్గంలో అధికారం అండతో రూ.10 కోట్ల విలువైన సత్రం భూములను కబ్జా చేశారు. ముమ్మిడివరం మండలం కొమానపల్లి వారణాశి సుబ్బారాయుడు సత్రం 1911లో నిర్మించారు. కొమానపల్లికి చెందిన సుబ్బారాయుడు ముత్యాలు, పగడాల వ్యాపారం చేసేవారు. అప్పట్లో ఫ్రాన్స్ దేశస్తులు సమీపంలోని ఫ్రెంచి యానాంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు. కోనసీమ నలు మూలల నుంచి వ్యాపారులు, ప్రజల వ్యాపార కార్యకలాపాల నిర్వహించేందుకు వెళ్తూ ఈ ప్రాంతంలో కొంత సేపు సేదతీరే వారు. వారి ఉపయోగార్థం సుబ్బారాయుడు ప్రధాన రహదారిని ఆనుకుని కొమానపల్లిలో 30 సెంట్ల విస్తీర్ణంలో సత్రం నిర్మించారు. దీని నిర్వహణకు చిన కొత్తలంక గ్రామంలో 13.75 ఎకరాల భూమిని కేటాయించారు. బాటసారులు సేద తీరేందుకు సువిశాలమైన గదులతో భవనం నిర్మించారు. మంచినీటికి, స్నానాలు చేసేందుకు పెద్ద బావిని తవ్వారు. 1985 వరకు ఈ సత్రం నిర్వహణ సక్రమంగా జరిగింది. అనంతరం భూములను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుత్తుల పాటేశ్వరరావు, వరప్రసాద్‌లకు చెందిన కుటుంబ సభ్యుల పేరున నామమాత్రపు లీజు చెల్లిస్తూ తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. అదే గ్రామానికి చెందిన నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుడి అండదండలతో దాదాపు గత 30 ఏళ్లుగా వారి స్వాధీనంలో ఉంచుకుని ఆ భూములలో పక్కా భవనాలు నిర్మించేసుకున్నారు. ఆక్రమణదారులకు ఆ టీడీపీ నాయకుడు వత్తాసు పలకడంతో దేవదాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లడంతో సత్రానికి లీజు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులకు పన్నులు చెల్లించకుండా సత్రం సొమ్మును దర్జాగా దోచేసుకుంటున్నారు. – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ -
కొండబాబు ఎదురీత
సాక్షి, బోట్‌క్లబ్: ముందుగొయ్యి.. వెనుక నుయ్యి చం దంగా తయారయ్యింది కాకినాడ సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పరిస్థితి. కొండబాబుకు టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని వారం రోజుల క్రితం 17 టీడీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశం పెట్టుకొని మరీ టీడీపీ అధిష్టానానికి తమ నిరసన తెలియజేశారు. గడిచిన ఐదేళ్లుగా పార్టీలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అతని అన్నయ్య సత్యనారాయణ పెత్తనం పెరిగిపోవడంతో పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, కనీసం కొండబాబు సోదరుడిని మందలించకపోవడంపై పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లు తాము కొండబాబు, అతని అన్నయ్య అరాచకాలు భరించామని, ప్రస్తుతం వారి అరాచకాలు భరించే స్థితిలో లేమని టీడీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కొండబాబుపై మొగ్గు చూపి అతనికి సీటు కేటాయించినా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం దీనిని జీర్ణించుకొనే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోను అతని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు సొంత పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో కొండబాబు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు. అసమ్మతి వర్గం మద్దతిచ్చేనా? కొండబాబుకు టిక్కెట్టు ఇవ్వవద్దని, టీడీపీ ముద్దు, కొండబాబు వద్దని ముమ్మరంగా ప్రచారం చేసిన కార్పొరేటర్లు ప్రస్తుత ఎన్నికల్లో అతనితో కలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో పేకాట క్లబ్‌లు, గుట్కా మాఫియా, మద్యం సిండికేట్ నుంచి ముడుపులు తీసుకొంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొండబాబుపై పూర్తిగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సామాజిక సమీకరణ నేపథ్యంలో కొండబాబుకు సీటు కేటాయించినా నగరంలో సొంత టీడీపీలోనే అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. తాము వద్దంటున్నా కొండబాబు కు సీటు కేటాయించడంపై కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. మా అవసరం లేకుండా ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారో చూస్తామని వారు బహిరంగానే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొండబాబు విజయంపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. మేము డమ్మీలమేనా? కార్పొరేషన్ ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చుచేసి విజయం సాధించినా తాము డమ్మీలుగానే మిగిలామని కార్పొరేటర్లు భగ్గుమంటున్నారు. తమ డివిజన్లో కూడా ఎమ్మెల్యే, అతని అన్నయ్య పెత్తనం ఏమిటని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్లో జరిగే అభి వృద్ధిలో కూడా భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని కార్పొరేటర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం తమకు సమయం వచ్చిందని, తమ పవర్ ఏమిటో చూపిస్తామని కరాఖండీగా చెబుతున్నారు. పార్టీకి గుడ్‌బై చెబుతున్న టీడీపీ కేడర్ కొండబాబును టీడీపీ అధిష్టానం కాకినాడ సిటీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమతున్నారు. తమకు విలువ లేని చోట తాము ఇమడలేమని పార్టీ నుంచి పలువురు బయటకు వచ్చేందుకు సిద్ధమతున్నారు. ఇటీవల పలువురు జన్మభూమి కమిటీ సభ్యులు వైఎస్సార్ సీపీలో చేరారు. త్వరలో పలువురు కార్పొరేటర్లు సైతం పార్టీ వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ మాట లెక్క చేయకుండా పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలకు విలువేది? కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకోవడమే తప్ప పార్టీలో తమకు విలువ లేదని వారు మండిపడుతున్నారు. కార్యకర్తలు మనోభావాలను పట్టించుకొనకుండా ఏకపక్షంగా టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వడంపై వారు భగ్గుమంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమకు పార్టీ పట్టించుకొనకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువ లేని చోట తాము పనిచేయడం ఎందుకని బహిరంగంగానే వారు విమర్శిస్తున్నారు. మేయరు మద్దతిచ్చేనా? ప్రస్తుతం కాకినాడ సిటీ టీడీపీ సీటు వనమాడి కొండబాబుకు ఇచ్చిన నేపథ్యంలో కాకినాడ మేయర్ సుంకరపావని కూడా అయిష్టంగానే అయనతో ప్రచారంలో పాల్గొంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. మేయర్ స్థానంలో ఉన్నప్పటికీ తమకు విలువ లేకుండా చేయడంతో ఆమె గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్లో కూడా ఎమ్మెల్యే కొండబాబు, అతని కుటుంబ సభ్యులు పెత్తనంపై వారు మండిపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొండబాబుకు మద్దతు ఇవ్వడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు వినికిడి. సొంత పార్టీలో నేతలతోనే సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వారిని కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కొండబాబు అయోమయ పరిస్థితిలో పడ్డారు. -
కొండబాబుపై అసమ్మతి బండ
సాక్షి ప్రతినిధితూర్పుగోదావరి, కాకినాడ : కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) చేసిన అవినీతి అక్రమాలపై టీడీపీలోనే ఓ వర్గం భగ్గుమంటోంది. ఎమ్మెల్యే దందాపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలని ఆ వర్గమే గొంతెత్తి నిరసిస్తోంది. ‘సాక్షి’ కథనాలే సాక్ష్యాలుగా చూపించి ఎమ్మెల్యే వనమాడికి టిక్కెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు 17 మంది కార్పొరేటర్లు, మరికొందరు డివిజన్ నేతలు శుక్రవారం సాయంత్రం స్థానిక సత్య ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కొండబాబుకు టిక్కెట్ ఇస్తే పార్టీకి పనిచేసేది లేదని కరాఖండిగా తెగేసి చెప్పేస్తున్నారు. బయటపడిన విభేదాలు... కాకినాడ కార్పొరేషన్లో ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే కొండబాబుఅవినీతి అక్రమాలు, ఆయన సోదరుడు సత్యనారాయణ పెత్తనంపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ భరించామని, ఇక భరించలేమంటూ రోడ్డెక్కారు. కార్పొరేషన్లో కార్పొరేటర్లకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. సాక్షాత్తూ మేయర్ సుంకర పావని మాటే చెల్లుబాటు కానివ్వడం లేదు. అంతా తానై వ్యవహరిస్తూ మేయర్ పావనితోపాటు కార్పొరేటర్లకు విలువ లేకుండా చేశారు. మేయర్ పావని ఒకానొక సందర్భంలో అవమానాలకు గురయ్యారు. ఈ విషయాలను కూడా ‘సాక్షి’ పలు సందర్భాల్లో బహిర్గతం చేసింది. ఇంటిగుట్టు బయట పెట్టుకోకూడదని ఇన్నాళ్లూ టీడీపీ నేతలు మౌనం వహించారు... ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారంతా బయటపడ్డారు. మరోసారి పార్టీ టిక్కెట్ ఇస్తే ఆయన్ని భరించలేమంటూ అధిష్టానాన్ని హెచ్చరించారు. అక్షర సత్యమైన ‘సాక్షి’ కథనాలు ‘సాక్షి’లో వచ్చిన కథనాలనే అస్త్రాలుగా చేసుకొని అసమ్మతి కార్పొరేటర్లంతా శుక్రవారం సమావేశమై కొండబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హౌస్ ఫర్ ఆల్’లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, ఏపీఎండీపీ కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ.190 కోట్ల పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, పోలీసు స్టేషన్ బదిలీలు, ఎస్ఐ, సీఐ స్థాయి అధికారుల పోస్టింగుల విషయంలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ లంచాలు తీసుకున్నారని, ఇళ్ల పట్టాలను ఒక్కొక్కటి రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు అమ్ముకున్నారని, బీసీ, ఎస్సీ రుణాలను సొంత బ్యాంకులకు బదలాయించి అవకతవకలకు పాల్పడ్డారని, ప్రజా సమస్యల మీద పోలీసు స్టేషన్‌కు వెళితే ఎమ్మెల్యే సోదరునితో ఫోన్ చేయించాలని పోలీసు అధికారులు ఆదేశించేవారంటూ కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. ఇంతటి అవినీతి అక్రమాలకు పాల్పడిన కొండబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు ఓటు వేయరని బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొండబాబు స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే పార్టీ కోసం పని చేయలేమంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. విశేషమేమిటంటే ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసిన వారిలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశమైన వారిలో డిప్యూటీ మేయర్ కేబీఎస్‌ఎస్ సత్తిబాబు, పేరాబత్తుల లోవబాబు, కర్రి శైలజ, జేడీ పవన్‌కుమార్, బాలా ప్రసాద్, బలువూరి రామకృష్ణ, పి.అనంత్‌కుమార్, అంబటి క్రాంతి, బండి సత్యనారాయణ, సంగాని నందం, జి.దానమ్మ, మోసా దానమ్మ, కామాడి సీత, తెహెర ఖాతూన్, ఐ.వి.రమణమ్మ, వాసిరెడ్డి రాంబాబు, బి.సూర్యవతి, జి.దుర్గ, నాగసూర్య దీపిక, బాల కామేశ్వరరావు తదితర నేతలు హాజరైనట్టు తెలిసింది. నగర అధ్యక్షుడిని రాయబారానికి పంపిన ఎమ్మెల్యే నగర టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కొండబాబు అప్రమత్తమై ఆ పార్టీ నగర అధ్యక్షుడు నున్నం దొరబాబును హుటాహుటిన అసమ్మతి సమావేశం జరిగిన ఫంక్షన్ హాల్‌కు పంపించారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకమైన కార్పొరేటర్లతో దొరబాబు సుదీర్ఘంగా చర్చించారు. అర్ధరాత్రి వరకు వారి మధ్య చర్చలు ఓ కొలిక్కిరాలేదు. -
ప్రశ్నించినందుకు ఈడ్చుకెళ్లారు
తూర్పుగోదావరి, కాకినాడ: నియంతృత్వధోరణిలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఏకపక్షంగా ఓ కమ్యూనిటీహాలు ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండువర్గాల మధ్య వివాదాన్ని రేపేలా వ్యవహరించిన ఆయన తీరును ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఎంజీకే కిశోర్‌పై పోలీసులు జులుం ప్రదర్శించి ఈడ్చుకు వెళ్లిన వైనంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. పోలీసులు, ఎమ్మెల్యే కొండబాబు తీరుపై ఆగ్రహించిన కార్పొరేటర్ పోలీసుస్టేషన్‌ముందే నిరసనకు దిగడం, విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ జగన్నాథపురం చిన్నమార్కెట్‌లో సుమారు 400 మంది చిరు వ్యాపారాలు సాగిస్తున్నారు. వీరికి అక్కడ ఓ కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతోంది. అనేక వివాదాలు అనంతరం వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ న్యాయపరమైన అవరోధాలను పరిష్కరించి కార్పొరేషన్ నిధులతో ఇటీవలే అక్కడి కమ్యూనిటీహాలును పూర్తి చేయించారు. స్థానికంగా ఉండే డ్వాక్రా సంఘాల సమావేశాలకు, పింఛన్ల పంపిణీతోపాటు మార్కెట్లోని వ్యాపారులకు ఉపయోగపడేలా ఈ కమ్యూనిటీహాలును వినియోగించాలన్న ప్రతిపాదన ఉంది. అయితే ఎమ్మెల్యే వనమాడి ఆ ప్రాంతానికి సంబంధం లేని వేరొక వర్గానికి కమ్యూనిటీ హాలు కేటాయించేందుకు హామీ ఇచ్చారంటూ సదరు అసోసియేషన్ బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద ఫ్లెక్సీ పెట్టడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కిశోర్ అక్కడికి చేరుకుని ఓపక్క స్థానిక వ్యాపారులకు, మరో అసోసియేషన్‌కు ఒకరికి తెలియకుండా ఒకరికి కమ్యూనిటీహాలు మీదేనంటూ హామీ ఇచ్చి ఎమ్మెల్యే వనమాడి ఇద్దరి మధ్య వివాదం రేపడం సరికాదని, దీనిపై స్పష్టత ఇచ్చి ప్రారంభించాలంటూ నిరసనకు దిగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు కిశోర్‌తో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఏకపక్షంగా కార్పొరేటర్ కిశోర్‌ను బలవంతంగా ఈడ్చుకుని వెళ్లి జీపులో పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు వెళ్లాక కార్పొరేటర్ కిశోర్ అక్కడే బైఠాయించి నిరసనకు దిగడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పార్టీ శ్రేణులతో అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసుశాఖ అధికార పార్టీ కనుసన్నల్లో ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసంకాదని, అక్కడ వివాదానికి కారణమైన టీడీపీ శ్రేణులను వదిలి ప్రజాప్రతినిధిగా ఉన్న కిశోర్‌పై దుందుడుకుగా వ్యవహరించడం మంచిదికాదని మండిపడ్డారు. స్టేషన్ నుంచి నేరుగా ద్వారంపూడితో పాటు పార్టీశ్రేణులందరూ చిన్నమార్కెట్ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లి ఎమ్మెల్యే వనమాడిని నిలదీశారు. ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టి సమస్యను పరిష్కరించకుండా ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ద్వారంపూడి కొండబాబును నిలదీశారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇలా తొందరపాటు చర్యల ద్వారా అశాంతిని రేకెత్తించడం మంచిదికాదని ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వనమాడిని ద్వారంపూడి గట్టిగా నిలదీసిన నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించి తమ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ కమ్యూనిటీ హాలును స్థానికులకే కేటాయిస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే వనమాడితోపాటు పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్- వనమాడి వెంకటేశ్వర రావు
-
కొండబాబంటే గుండెల్లో దడే
కాకినాడ, న్యూస్‌లైన్: గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే తత్వం లేని టీడీపీ కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వైఖరికి జనం భయభ్రాంతులవుతున్నారు. 2004లో ఆయన నిజ స్వరూపాన్ని చూసిన ఇక్కడి ప్రజలు నాటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకుని బెంబేలెత్తిపోతున్నారు. పరాజయాన్ని జీర్ణించుకోలేక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే జనంపై దాడికి తెగబడిన ఆయన అనుచరుల తీరు ఈ ఎన్నికల సందర్భంలో చర్చనీయాంశమైంది. తన ఓటమికి కారణమయ్యారనే అక్కసుతో అప్పటి ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలపై కొండబాబు అనుచరులు, అల్లరిమూకలు చెలరేగిపోయి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఇళ్లలో లూటీలకు కూడా తెగబడ్డారు. ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేయడం, మహిళలను పరుష పదజాలంతో దూషించడం, రక్తం వచ్చేలా కొట్టడం ఇప్పటికీ నగరంలో ప్రతి ఒక్కరి కళ్ల ముందు మెదులుతోంది. కొన్ని ఇళ్లలో బంగారం, నగదు కూడా లూటీ చేసిన సంఘటనలపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. 2004 ఏప్రిల్‌లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై 2004 ఏప్రిల్ 27న క్రైం నెంబర్ 62, 63తో కాకినాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కామేష్ ఇంటిపై దాడి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన చింతా కామేష్ ఇంటిలోకి సుమారు 20 మంది కొండబాబు అనుచరులు చొరబడి దాడులు చేశారు. జగన్నాధపురం గోళీలపేటలోని కామేష్ నివాసానికి వెళ్లిన రౌడీమూకలు కొండబాబును ఓడిస్తారా అంటూ అతనిపై భౌతిక దాడికి దిగారు. కుటుంబ సభ్యులను కూడా గాయపరిచి ఇంటిలోని సామాన్లను చెల్లాచెదురుగా విసిరేశారు. విషయం తెలుసుకున్న అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు, పళ్లంరాజు, ముత్తా గోపాలకృష్ణ, మల్లాడి కృష్ణారావు వంటి నేతలంతా కామేష్ ఇంటికి వెళ్లి అతనికి ధైర్యం చెప్పారు. ఒక్క కామేష్ ఇంటిపైనే కాక ఆ ప్రాంతంలో మత్స్యకార నాయకులు, మాజీ కౌన్సిలర్ తిరుదు వెంకటేశ్వరరావు, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్‌గా ఉన్న రాధాకృష్ణ, లైటింగ్ కృష్ణ, నాగకుమారి... ఇలా పలువురు వనమాడి అనుచరుల వీరంగాన్ని ప్రత్యక్షంగా చవిచూశారు. దుకాణాలు, చిరు వ్యాపారుల పాన్‌షాపులు, వ్యాపార సంస్థలపై కూడా ఈ దాడి కొనసాగింది. వెన్నాడుతున్న నాటి జ్ఞాపకాలు కొండబాబు అనుచరుల అరాచకాలు జరిగి పదేళ్లు అయినా మరోసారి అలా చేయరని గ్యారంటీ ఏమిటనే ప్రశ్న స్థానికుల నుంచి విన్పిస్తోంది. ఇళ్లు, వ్యక్తులపై దాడులతోపాటు మహిళలకు సైతం భద్రత లేని పరిస్థితి అక్కడ ఉందని వాపోతున్నారు. బ్రాందీషాపుల నుంచి నెలవారీ మామూళ్లు రాలేదనో, రేట్లు తగ్గించలేదనో రహదారులను దిగ్బంధించడం వంటి చర్యలు మరిచిపోలేకపోతున్నామని వారంటున్నారు. దాడులతో భీతిల్లాం కొండబాబు అనుచరులు చేసిన దాడులతో అప్పట్లో చాలా ఆందోళనకు గురయ్యాం. ఒక్కసారే 20 మందికి పైగా ఇంటిపై పడి దాడి చేసి మా కుటుంబ సభ్యులను సైతం గాయపరిచారు. ఇంట్లో సామాన్లను చెల్లాచెదురుగా పడవేసి బీభత్సం సృష్టించారు. ఆ సంఘటన చూసిన స్థానికులు ఇప్పటికీ కొండబాబు పేరుచెబితే హడలెత్తిపోతున్నారు. ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేస్తున్నారని తెలుసుకున్న స్థానికులు అలాంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోరాదనే పట్టుదలతో ఉన్నారు. - చింతా కామేష్, జగన్నాధపురం.