vansimohan
-
దాసరి కుటుంబానికి పరాభవం
వంశీకి దక్కిన టికెట్ సిట్టింగ్‌కు మొండి చెయ్యి కరివేపాకులా వాడుకున్నారని ఆవేదన దాసరి వర్గీయుల్లో ఆగ్రహం సాక్షి, విజయవాడ :గన్నవరం ఎమ్మెల్యే దాసరిబాలవర్ధనరావుకు కాకుండా వల్లభనేని వంశీమోహన్‌కు గన్నవరం అసెంబ్లీ సీటును కేటాయించడంపై పార్టీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీనే అంటిపెట్టుకున్న ‘దాసరి’ కుటుంబానికి జరిగిన పరాభవంగా గన్నవరం వాసులు భావిస్తున్నారు. చంద్రబాబుకు గత ముఫై ఏళ్లుగా విజయా ఎలక్ట్రికల్ అధినేత దాసరి జైరమేష్‌కు సాన్నిహిత్యం ఉంది.పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అనేకమార్లు ఆదుకున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్, నామానాగేశ్వరరావు వంటి పారిశ్రామిక వేత్తలు టీడీపీలోకి రానిరోజుల్లోనే దాసరి జై రమేష్ టీడీపీకి అంగబలం, అర్ధబలం సమకూర్చేవారు. అలాగే కాంగ్రెస్ హవా ఉన్న రోజుల్లోనూ రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా దాసరి బాలవర్ధనరావు గెలుపొందారు. అయినప్పటికీ చంద్రబాబు దాసరిబాలవర్ధనరావుకు ఇవ్వకుండా వంశీమోహన్‌కు ఇవ్వడంపై దాసరి వర్గీయులు త్రీవ ఆగహంతో ఉన్నారు. దాసరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు కరిపేపాకులాగా వాడుకుని వదిలివేశారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి, చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధిచెబుతార నే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని...... దాసరి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు అతనిపై ఏ విధమైన ఆరోపణలు లేవు. ఆయన ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. అలాగే చక్కటి పాలోయింగ్ ఉంది. అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయన్ను పక్కన పెట్టి వంశీమోహన్‌కు ఇవ్వడంలో చంద్రబాబు ఆంత్యరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ అందరిని కలుపుకుని పోయే వ్యక్తికి సీటు ఇవ్వకుండా గ్రూపు రాజకీయాలు చేయడం, దుందుడుకుగా వ్యవహరించే వంశీకి సీటు ఇవ్వడం ఏమిమీటంటూ సీని యర్లు ప్రశ్నిస్తున్నారు. మాజీ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులుతో వంశీకి ఉన్న విభేదాలను ఈసందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. చైర్మన్ గిరితో సరా...! కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(విజయా డైరీ) డెరైక్టర్‌గా దాసరి బాలవర్ధనరావు ఇటీవల ఎన్నికయ్యారు. డైరీ చైర్మన్ మండవ జానకీరామయ్య కరుణించి తన పదవి నుంచి తప్పుకుంటే చైర్మన్ దాసరికి దక్కే అవకాశం ఉంది. లేకపోతే కేవలం డెరైక్టర్ గిరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రెండు సార్లు మ్మెల్యేగా గెలిచి, పార్టీకి వెన్ను దన్నుగా ఉంటే కుటుంబానికి జరిగిన పరాభవంపై కృష్ణాజిల్లాలో చర్చనీయాశంగా మారింది. చంద్రబాబు యూజ్‌అండ్ త్రో పాలనీని మరోసారి ప్రయోగించారని రాబోయే రోజుల్లోతమకూ అదే గతి పడుతుందని ఎమ్మెల్యే స్థాయి నేతలు ఆందోళన చెందుతున్నారు. దాసరికి జరిగిన అవమానం ప్రభావం పార్టీపై స్పష్టంగా కనపడేఅవకాశం ఉంది. -
తేలని గన్నవరం టీడీపీ టిక్కెట్
వంశీమోహన్‌కు టిక్కెట్ హుళక్కేనా! దాసరి, వంశీ మధ్య కొనసాగుతున్న పోరు టీడీపీ శ్రేణులు వీడని అయోమయం మరోపక్క దుట్టా రామచంద్రరావు ప్రచార జోరు సాక్షి, విజయవాడ : వారిద్దరూ తెలుగుదేశం పార్టీకి కీలక నేతలే. ఒకే నియోజకవర్గం టిక్కెట్ కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. గెలుపు కంటే టిక్కెట్ సాధించడమే ఎక్కువ ప్రతిష్టగా తీసుకుని పావులు కదుపుతున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లోనే మకాం వేసి లాబీయింగ్ నడుపుతున్నారు. ఎంత ప్రయత్నించినా ఈ ఇద్దరిలో ఒకరు టిక్కెట్ సంపాదించుకుని మొదటి జాబితాలో తమ పేరు ప్రకటించుకోలేకపోవడం వారి సమర్థతనే శంకిస్తోందని జిల్లా తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికిటిక్కెట్ లభించినా రెండోవారే దగ్గరుండి ఓడిస్తారనేది నగ్న సత్యం. ఇద్దరూ ఇద్దరే! దాసరి బాలవర్ధనరావు గ న్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన సోదరుడు దాసరి జై రమేష్ టీడీపీలో కీలకమైన పారిశ్రామికవేత్త. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేశారు. అయినప్పటికీ తొలిజాబితాలో తన పేరు ఉండేలా చూసుకోలేకపోయారు. ఇక వల్లభనేని వంశీమోహన్ గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పార్లమెంట్ ఇన్చార్జిగా పనిచేశారు. చివరకు గన్నవరానికి పరిమితమైపోయారు. గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్‌ను పొందిన వంశీమోహన్ ఇప్పుడు కనీసం గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు తనకే హామీ ఇచ్చారంటూ హడావుడి చేసిన వంశీమోహన్ తొలి జాబితాలో తన పేరు ఉండేలా చూసుకోలేకపోవడం సగం ఓటమి చెందినట్లేనని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. భిన్న ధ్రువాలు... దాసరి బాలవర్ధనరావు, వంశీమోహన్లు పార్టీలో భిన్న ధ్రువాలుగా గుర్తింపు పొందారు. చాపకింద నీరులా రాజకీయం చేయడం దాసరి ప్రత్యేకత అని పార్టీ శ్రేణుల అభిప్రాయం. వంశీమోహన్ చేసే ప్రతి కార్యక్రమంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే అధిష్టానానికి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు పంపారు. వంశీకి టిక్కెట్ ఇవ్వడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ అధిష్టానం చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. వంశీమోహన్ దుందుడుకు తత్వంతో నగర మాజీ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులుతోనే నేరుగా వివాదానికి దిగి పలు సమస్యలను కొని తెచ్చుకున్నారు. గతంలో వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న విభేదాల కారణంగా ప్రజల్లో ఆయన ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో ఒక యువకుడి హత్యకేసులో వంశీ అనుచరులు ఉన్నారంటూ ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేసింది. ఇటీవల చంద్రబాబునాయుడు నగరానికి వస్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద పోలీసు అధికారులతో వంశీ ఘర్షణకు దిగి పోలీసు అధికారుల్నే హెచ్చరించడం జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. సాధారణ నేతగా ఉండగానే అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్న వంశీ, రేపు పదవి చేతికి వస్తే ఇంకెలా ఉంటారో అనే భయం నియోజకవర్గ వాసుల్లో వ్యక్తమవుతోంది. వంశీ దుందుడుకు స్వభావమే ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుపడుతోందనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. పేదలతో మమేకమైన దుట్టా... ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పేదల వైద్యుడుగా గుర్తింపు పొందారు. ఆయన జేబును బట్టి కాకుండా రోగాన్ని బట్టి వైద్యం చేస్తారని నానుడి. ఆయనతో కొద్దిసేపు మాట్లాడితేనే రోగం సగం నయం అవుతుందని పేదలు నమ్ముతారు. టీడీపీలో ఇద్దరు నేతలూ బహిరంగంగానే కలహించుకుంటుంటే రామచంద్రరావు పేద ప్రజల్లోకి పార్టీని తీసుకెళుతూ దూసుకుపోతున్నారు.