varun aron
-
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
అడిలైడ్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. క్లార్క్ 7 పరుగులకు పెవిలియన్ దారి పట్టాడు. వార్నర్ 94, స్మిత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీకి దగ్గరలోఉన్నాడు. ఆసీస్ 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
థావన్కు రిటార్ట్ ఇచ్చిన వార్నర్
అడిలైడ్ : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అడిలైడ్ తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్ మ్యాచ్‌లో ఆసీస్, టీమిండియా ఆటగాళ్లు గరం గరం అయ్యారు. శుక్రవారం నాలుగో రోజు ఆటలో 66 పరుగుల వద్ద వార్నర్ బౌల్డవడంతో ఫీల్డర్ శిఖర్ థావన్ మోతాదు మించి స్పందించాడు. అయితే అది నోబాల్ అని తేలడంతో వార్నర్ వెనక్కి వచ్చి థావన్కు రిటార్ట్ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోవటంతో అక్కడ వేడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణగింది. కాగా ఆసీస్ ఫస్ట్ వికెట్‌గా రోజర్స్ ఔటైనపుడు సైతం విరాట్ కోహ్లి ఇదేవిధంగా స్పందించాడు. -
అడిలైడ్ టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్‌లో నాలుగో రోజు టీ విరామం అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్ కోల్పోయింది. జట్టు 140 పరుగుల వద్ద ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ 33 పరుగులకు అవుట్ అయ్యాడు. వార్నర్ 70 పరుగులతో, క్లార్క్ పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండా ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా 213 పరుగుల ఆధిక్యంలో ఉంది.