96 శాతం పంటకోత ప్రయోగాలు పూర్తి
వసంతవాడ (పెదపాడు): ప్రధానమంత్రి ఫసలీ బీమా ఫదకంలో భాగంగా జిల్లాలో 2,626 పంటకోత ప్రయోగాలకు గాను 2,521 ప్రయోగాలు నిర్వహించినట్టు ముఖ్య ప్రణాళిక అధికారి, జాయింట్ డైరెక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు. బుధవారం పెదపాడు మండలంలోని వసంతవాడ గ్రామంలో పంటకోత ప్రయోగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటకోత ప్రయోగాలను పారదర్శకంగా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు అందిస్తున్నామన్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, పంట కోత ప్రయోగాల ఆధారంగానే రైతులు బీమా చెల్లిస్తారని చెప్పారు. జిల్లా ఉపసంచాలకుడు టి.సురేష్కుమార్, మండల సహాయ గణాంక అధికారి కె.గాంధీ వీఆర్వో సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు.